News
News
X

నోటిలో అల్సర్ చాలాకాలంగా తగ్గడం లేదా? ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

క్యాన్సర్ కు సంబంధించిన అవగాహన చాలా తక్కువ. మౌత్ క్యాన్సర్ గురించి తెలిసిన వారు చాలా తక్కువ. క్యాన్సర్ ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచి చికిత్స అందించవచ్చు కనుక ఈ క్యాన్సర్ గురించి కొంత తెలుసుకుందాం.

FOLLOW US: 

గత పదేళ్ల కాలంలో దాదాపుగా 34 శాతం వరకు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గత సంవత్సర కాలంగా కేవలం యూకేలో 3 వేల పైచిలుకు మంది మౌత్ క్యాన్సర్ తో మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య గత 5 సంవత్సరాలతో పోలిస్తే 20 శాతం ఎక్కువ.

అందుకే డెంటిస్టులు మౌత్ క్యాన్సర్ కు సంబంధించిన ముఖ్యమైన లక్షణాల గురించి అవగాహన కల్సించడం మీద దృష్టి నిలిపారు.

మౌత్ క్యాన్సర్ ను గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్ల చికిత్సలో జాప్యం జరగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని లండన్ కు చెందిన డాక్టర్ వికాస్ ప్రింజా అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా నాలుగు లక్షణాలను త్వరగా గుర్తించాలి.

 1. నోటిలో ఏర్పడిన అల్సర్ త్వరగా మానక పోతే అనుమానించాల్సిందే
 2. నాలుక, పెదవులు, గడ్డం తిమ్మిరిగా ఉండడం
 3. నోటి లోపల తెల్లని లేదా ఎర్రని ప్యాచెస్
 4. దంతాల్లో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు

మౌత్ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాల్లో కొన్నింటిని తప్పనిసరిగా అందరూ తెలుసుకుని ఉండాలి. క్యాన్సర్ ముప్పును ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి చికిత్స అందించడం సాధ్యమవుతుంది.

News Reels

సాధారణంగా ఆల్కహాల్, పోగాకు అలవాటున్న వారిలో నోటి క్యాన్సర్ ముంపు పొంచి ఉంటుంది. అయితే కొన్ని సార్లు హెచ్ పీ వీ (హ్యూమన్ పాపిలోమా వైరస్ ) ఇన్ఫెక్షన్ కూడా మౌత్ క్యాన్సర్ కు కారణం కావచ్చని డాక్టర్ నీల్ సిక్కా అభిప్రాయపడ్డారు.

నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కూడా మౌత్ క్యాన్సర్ రావచ్చట. విరిగిపోయిన దంతాల వల్ల కూడా నోటిలో అల్సర్స్ ఏర్పడవచ్చు. అవి త్వరగా మానకపోతే ఆ అల్సర్లు క్యాన్సర్లుగా మారవచ్చు.  ఎక్కువగా ఎండలో తిరిగే వారికి లిప్ క్యాన్సర్ రావచ్చని అంటున్నారు డాక్టర్లు.

రెగ్యులర్ చెకప్ సమయంలో తప్పనిసరిగా డెంటిస్టులు క్యాన్సర్ మీద కూడా ఒక దృష్టి పెట్టుకోవాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్ చెకప్ లో భాగం చేసుకోవాలని డాక్లర్ సిక్కా సూచిస్తున్నారు.

కొన్ని సార్లు ఎక్స్ రే లలో కూడా చిన్నచిన్న మార్పులను గురంచే వీలుంటుందని ఆయన అంటున్నారు.

చిన్న చిన్న చెకప్స్ ఇంట్లో ఎవరికి వారు కూడా చేసుకోవచ్చని డాక్టర్ సిక్కా అంటున్నారు.

 1. నాలుక పైకి లేపి నాలుక కింద ఏవైనా మార్పులు వచ్చాయా అనేది గమనించుకుంటూ ఉండాలి
 2. నాలుక కింది నోటి అడుగున చూపుడు వేలితో నొక్కి ఏదైనా అసాధారణమైన వాపు లేదా, కణితి, అల్సర్ ఏదైనా ఉందేమో పరీక్షించుకోవాలి.
 3. నోటి లోపల దవడ చర్మం మీద ఏవైనా నొప్పి లేని లేదా నొప్పితో ఉన్న అల్సర్లు ఉన్నాయా అనేది పరీక్షించి చూసుకోవాలి. ఇలాగే చిగుళ్ల మీద కూడా నొక్కి చూసుకోవాలి.
 4. పై పెదవి ని కాస్త బయటికి లాగి దాని కింద చర్మంలో ఏవైనా అసాధారణ మార్పులు వచ్చాయేమో గమనించాలి.
 5. పెదవుల పైన కూడా రెండు వెళ్లతో నొక్కి పెట్టి కణితులు లేదా వాపులు ఉన్నాయేమో చూసుకోవాలి.
 6. ముఖం, దవడల మీద ఇదివరకు లేని కొత్త మార్పు లేదా వాపు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావల్సి ఉంటుంది.

ఈ జాగ్రత్తలు మనకు మనంగా తీసుకోవచ్చు. అయితే క్యాన్సర్ ఎక్కడైనా మొదలు కావచ్చు. చక్కిళ్లు, దవడలు, నోటి లోపలి పైభాగం, పెదవులు, చిగుళ్లు ఏభాగంలో నైనా మొదలుకావచ్చు.

ఎవరికి వారు గుర్తించలేని నోటిలోని భాగాల్లో సైతం క్యాన్సర్ మొదలయ్యే ప్రమాదం ఉంటుంది. స్క్వామస్ సెల్ కార్సినోమా అనే క్యాన్సర్ సాధారణంగా కనిపంచే క్యాన్సర్ రకం. ఏ రకమైన శరీర కణాల్లో క్యాన్సర్ మొదలైందన్న దాన్ని బట్టి క్యాన్సర్ రకం అధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Published at : 12 Nov 2022 10:21 AM (IST) Tags: Symptoms prevention dentist mouth cancer

సంబంధిత కథనాలు

మీ షాంపూలో గుడ్డు ఉందా ! అది ఎందుకు వాడతారు? అన్ని షాంపూల్లోనూ గుడ్డు కలుపుతారా !

మీ షాంపూలో గుడ్డు ఉందా ! అది ఎందుకు వాడతారు? అన్ని షాంపూల్లోనూ గుడ్డు కలుపుతారా !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని ప్రదేశాలు - సూర్యోదయం జరగకపోతే ఏమవుతుందంటే !

రాత్రిపూట చెమటలు పట్టడం క్యాన్సర్‌కు సంకేతమా? ఈ లక్షణాలు మీలో ఉంటే జాగ్రత్త!

రాత్రిపూట చెమటలు పట్టడం క్యాన్సర్‌కు సంకేతమా? ఈ లక్షణాలు మీలో ఉంటే జాగ్రత్త!

Heart Attack: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి

Heart Attack: గుండె జబ్బులు రాకూడదంటే ఈ టీ తాగండి

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

Frozen Food: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారాలు ఇలా మారుతున్నాయా? వాటిని అస్సలు తినొద్దు, వాడొద్దు!

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Kavita Vs Sharmila : రాజకీయాల్లో తిట్లతోనే కాదు కవితలతోనూ విమర్శించుకోవచ్చు - ఇదిగో షర్మిల, కవితల సాహిత్య సంవాదం !

Kavita Vs Sharmila : రాజకీయాల్లో తిట్లతోనే కాదు కవితలతోనూ విమర్శించుకోవచ్చు - ఇదిగో షర్మిల, కవితల సాహిత్య సంవాదం !

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ - ఎందుకు ? ఏమిటి ? ఎలా?

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ - ఎందుకు ? ఏమిటి ? ఎలా?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?