News
News
వీడియోలు ఆటలు
X

International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఎంతటి బాధలైనా నవ్వుతో అధిగమించవచ్చని పెద్దలు చెబుతుంటారు.

FOLLOW US: 
Share:

సంతోషమే సగం బలం అంటారు. అన్ని రోగాలకు ఇది చక్కని పరిష్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, బాధ ఉంటుంది. అందుకే జీవితంలో కష్టసుఖాలు చెరిసమానమని అంటారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కష్టాలు ఎదురైనా కొంతమంది మొహం మీద చిరునవ్వు చెక్కుచెదరనివ్వరు. ఇదే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కూడా ఇదే మాట నమ్ముతారు. సంతోషంగా నవ్వుతూ ఉంటేనే ఎటువంటి పెద్ద సమస్య అయినా కూడా చిన్నదిగా కనిపిస్తుందని అంటారు. అందుకే ఆమె మోము మీద ఎప్పుడు చెరగని చిరునవ్వు ఉంటుంది.

సంతోషంగా ఉండటం మానవ హక్కు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఐక్యరాజ్యసమితి ఏటా మార్చి 20వ తేదీన 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్' అని ప్రకటించింది. జీవితం ఎంత విలువైనదో గుర్తుంచుకోవడం కోసం ఇది ఒక అద్భుతమైన రోజును ఐరాస పేర్కొంటుంది. 2011లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్థిక విషయాలతో సమానమైన ప్రాధాన్యతను ఆనందానికి కూడా ఇవ్వాలని పేర్కొంటూ సంతోషంగా ఉండటం ప్రాథమిక మానవ లక్ష్యంగా చెప్పింది. ఈ తీర్మానం ప్రవేశ పెట్టిన రెండు సంవత్సరాల తర్వాత 2013 లో యూఎన్లోని మొత్తం 193 సభ్యదేశాలు ప్రపంచంలోని మొదటి అంతర్జాతీయ సంతోష్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి మార్చి 20వ తేదీ ఇంటర్నేషనల్ హ్యపీ డే గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సంతోషంగా ఉంటే ఏమవుతుందంటే.. 

  • ఆనందం మీ రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది
  • ఇతరులకు మంచి చేస్తే మనకి  మంచి జరుగుతుంది ఆత్మ సంతృప్తి మిగులుతుంది
  • సంతోషంగా ఉండేందుకు పూల సువాసనలు చక్కగా పని చేస్తాయి
  •  డబ్బు కంటే బంధాలు గొప్పవి, మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకోకుండా వాళ్ళతో సంతోషంగా గడపాలి
  • ప్రకాశవంతమైన రంగులు మీ రోజులు ప్రకాశవంతం చేస్తాయి
  • నొప్పులు, బాధని తగ్గించడంలో సహాయపడుతుంది

ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ అధ్యయనం బయటకి వచ్చింది. డబ్బుతో ఆనందాన్ని కొనలేరని చెప్తూ ఉంటారు. కానీ ఈ అధ్యయనం మాత్రం అది అబద్ధమని చెప్పుకొచ్చింది. డబ్బుతో ఆనందాన్ని కొనగలుగుతున్నారని అంటోంది. డబ్బు ఆనందాన్ని పెంచుతుందా లేదా అని అధ్యయనం చేశారు. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆనందం పెరుగుతుందని ఈ అధ్యయనం నిరూపించింది. ఎవరికైతే ఆదాయం ఎక్కువ వస్తుందో వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు తేలింది. అయితే ఇది అందరికీ సరిపోలకపోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు లేని వారిలో ఇది నిజమవుతుందేమో కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని మాత్రం సంతోషంగా ఉంచలేకపోవచ్చు.

నలుగురితో కలిసి ఉండటం, ఇష్టమైన సంగీతం వినడం వల్ల సంతోషంగా ఉంటారు. అందుకే చాలా మంది బాధగా అనిపించినప్పుడు నచ్చిన పాటలు వినడం, డాన్స్ చేయడం చేస్తారు. ఇది వారిలోని బాధని పోగొట్టి ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఏది ఏమైనా కుటుంబంతో కలిసి ఉంటూ నలుగురితో మాట కలుపుతూ మంచి అనిపించుకుంటే ఆనందమే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని కొందరు చెప్తారు.

Also Read: పెరుగు ఎప్పుడు తినాలో, ఎలా తినాలో తెలుసా?

Published at : 20 Mar 2023 12:55 PM (IST) Tags: Happiness Money and Happiness International Happiness Day Happiness Health Benefits

సంబంధిత కథనాలు

Screen Time: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి

Screen Time: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?