Long Hair: ఈ హెయిర్ ప్యాక్స్ వేశారంటే పొడవాటి మెరిసే జుట్టు మీ సొంతం
జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఏవేవో ప్రొడక్ట్స్ ఉపయోగించడం కాదు. ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా హెయిర్ ప్యాక్స్ వేసుకోవచ్చు.
ఆడ, మగ అని తేడా లేకుండా అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి అనేక సమస్యల వల్ల జుట్టు రాలడం అధికమవుతుంది. ఒక్కొక్కరికీ జుట్టు రాలేందుకు భిన్నమైన కారణాలు ఉంటాయి. మరి కొంతమందిలో ఆరోగ్య సమస్యలు కూడా హెయిర్ లాస్ ఎక్కువయ్యేలా చేస్తాయి. అందుకే జుట్టు సంరక్షణ అన్నింటిలో కెల్లా ముఖ్యం. పొడవాటి, మెరిసే జుట్టు కోసం మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని సులభమైన హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అయ్యారంటే పొడవాటి నల్లని జుట్టు పొందుతారు.
గుడ్డు, మయోన్నైస్, ఆలివ్ ఆయిల్
గుడ్డులో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్నందున జుట్టుకు ఉత్తమమైన వాటిలో ఒకటిగా నిలుస్తుంది. ఇక మయోన్నైస్ పొడి జుట్టుకు పోషణ ఇచ్చి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుడ్డు, మయోన్నైస్, ఆలివ్ నూనె కలిపి జుట్టు అంతటా అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. ఆలివ్ ఆయిల్ జుట్టు డ్యామేజ్ ని రివర్స్ చేయడంతో పాటు షైన్ కూడ ఇస్తుంది.
గుడ్డు, నిమ్మకాయ
నిమ్మకాయ జుట్టు, తలకు చాలా మేలు చేస్తుంది. నిమ్మరసం, గుడ్డు కలిపిన పేస్ట్ జుట్టుకు అప్లై చేసి 45-50 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువ. నిమ్మరసంలో విటమిన్లు ఏ, డి, ఇ వంటివి ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. జుట్టు పొడిబారకుండా చేస్తుంది. మెరుపుని అందిస్తుంది.
బంగాళాదుంప, అలోవెరా
బంగాళాదుంప, కలబంద హెయిర్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల స్కాల్ఫ్ శభ్రపడుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. బంగాళాదుంప తురిమి రసం బయటకి తీసేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని తలకు అప్లై చేసి సుమారు 2 గంటల పాటు ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
కొబ్బరి క్రీమ్
కొబ్బరి నూనె జుట్టుకు అపారమైన ప్రయోజనాలు అందిస్తుంది. కొబ్బరి క్రీమ్ కూడా జుట్టుకి ప్రయోజనకరంగా ఉంటుంది. పొడి జుట్టుతో బాధపడుతుంటే కొబ్బరి క్రీమ్ ఉత్తమ ఎంపిక. ఇది జుట్టుకి మెరుపును ఇస్తుంది. హెయిర్ పెరుగుదలకు సహాయపడుతుంది. లేత కొబ్బరిని తీసుకుని దాన్ని కొద్దిగా వేడి చేయాలి. దాన్ని చల్లార్చి బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ లాగా వచ్చే వరకు కలుపుకోవాలి. దీన్ని జుట్టు, స్కాల్ఫ్ కి అప్లై చేసుకుని ఒక గంట పాటు ఉంచుకోవాలి. తలకి వెచ్చని టవల్ చుట్టుకోవడం మరచిపోవద్దు. తర్వాత షాంపూ ఉపయోగించి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ప్రోటీన్ పొందటం కోసం గుడ్లు తినాల్సిన పని లేదు, వీటిని తినొచ్చు