అన్వేషించండి

Cholesterol: సహజంగా ఇలా కొవ్వు కరిగించేసుకోండి, స్లిమ్‌గా మారిపోండి

ఇష్టమైన పుడ్ తినేయడం, తర్వాత కొవ్వు పెరిపోయింది రా బాబోయ్ అని బాధపడటం షరా మాములైపోయింది. అయితే కొవ్వు ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది.

నచ్చిన ఆహారం కనిపిస్తే ఆగలేం, లాగించేస్తాం. ఇంకేముంది ఫలితంగా కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. దాన్ని తగ్గించుకోడానికి నానా తంటాలు పడాలి. శరీరంలో కొవ్వు కొంత మంచి చేస్తే, ఎక్కువగా చెడే చేస్తుంది. కొవ్వు ఎక్కువ అయితే అధిక బరువు, గుండె జబ్బులకు దారి తీస్తుంది. అదే విధంగా మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని వ్యర్థాలని బయటికి పంపించడంలో సహాయపడుతుంది. అందుకే శరీరంలో మంచి కొవ్వు ఉండొచ్చు కానీ, చెడు కొలెస్ట్రాల్ మాత్రం ఉండకూడదు . దాన్ని కరిగించుకోడానికి వ్యాయామం, డైట్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు చాలా మంది. ఇక డబ్బున్న వాళ్ళు అయితే విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ ద్వారా కొవ్వు తీయించుకుంటారు.

మన నోరు అదుపులో ఉండకపోవడం వల్ల జంక్ ఫుడ్, పానీయాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి, మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త జీవనశైలి వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు భారీగా పెరుగుతాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల  గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదకరమైన రోగాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే మీ శరీరంలోని కొవ్వుని కరిగించుకోడానికి సహజమైన పద్ధతిని పాటించాలి. ఈ ఆధునిక కాలంలో కొవ్వు కరిగించుకునేందుకు వ్యాయామమే కాదు ఆహారపు అలవాట్లలో కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాలి. అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

జంక్ ఫుడ్ నో

చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందులో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని పెంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే వీలైనంత వరకు వాటి జోలికి ఎక్కువగా వెళ్లకపోవడమే మంచిది.

ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి

ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియాని పెంచేందుకు సహాయపడుతుంది. దాని వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి పని చేస్తుంది. బ్రకోలి, బీన్స్, అవకాడో, కిడ్నీ బీన్స్, యాపిల్ వంటి వాటిలో ఈ ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది.

క్రమం తప్పని వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం చాలా మంచి పని. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు క్రమం తప్పని వ్యాయామం మొత్తం ఆరోగ్యానికే మంచిది.

మద్యపానం తగ్గించాలి

మితంగా మద్యం సేవించడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపరుస్తుంది. అయితే ఎక్కువగా మందు తాగడం వల్ల గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మద్యపానం చేయకపోవడం ఉత్తమం.

Also read: రొయ్యల ఫ్రైడ్ రైస్, ఇంట్లోనే ఇట్టే చేసేయచ్చు

Also read: హ్యాపీ మూడ్ కావాలా? అయితే విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gen Z Health Alert : Gen Zలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. మెడ, నడుము నొప్పులకు అసలు కారణాలివే
Gen Zలో పెరుగుతున్న బాడీ పెయిన్స్.. మెడ, నడుము నొప్పులకు అసలు కారణాలివే
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Fatty Liver : ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వల్ల కూడా కాలేయానికి నష్టమే
ఫ్యాటీ లివర్ మందు(ఆల్కహాల్) వల్ల మాత్రమే కాదు.. మైదా, మటన్ వంటి వల్ల కూడా కాలేయానికి నష్టమే
Kailash Mansarovar Yatra : కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Embed widget