అన్వేషించండి

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఓ ట్రక్కు డ్రైవర్ ఊహించని మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఒక్క రోజులోనే కోటీశ్వరుడైపోయాడు.

ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలంటే.. తప్పకుండా మీకు లక్ ఉండాలి. మీరు రేయింబవళ్లు ఎంత శ్రమించి సంపాదించినా.. ఏదో ఒక రూపంలో డబ్బు మాయమైపోతుంది. నిత్యవసర వస్తువులు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం కూడా కష్టమే. దీంతో చాలామంది, తమ అప్పులు.. ఆశలు తీరేందుకు ‘అదృష్టం’పై ఆశలు పెట్టుకుంటారు. ఏదో ఒక రోజు లక్ష్మీ దేవి తమ ఇంటి తలుపు కొడుతుందనే ఆశతో లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోజంతా ట్రక్కు నడిపే ఈ డ్రైవర్ కూడా అదే చేశాడు. ఊహించని స్థాయిలో భారీ జాక్‌పాట్ కొట్టేశాడు. 

ఇల్లినాయిస్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఇటీవల మిచిగన్‌లో ‘స్క్రాచ్-ఆఫ్ లాటరీ’ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే, అతడు తొలుత ఏదో ఒక చిన్న మొత్తం లభిస్తుందేమోలే అని తేలిగ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత అతడి అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. ఎందుకంటే.. అతడు మొదట్లో రూ.1.5 లక్షల లాటరీ గెలుచుకున్నానని భావించాడు. కానీ, లాటరీ నిర్వాహకులు మాత్రం అతడికి ఊహించని విషయం చెప్పారు. నువ్వు గెలుచుకున్నది లక్షలు కాదు.. కోట్లు అని. అంతే, అతడు ఆ న్యూస్ విని ఎగిరి గంతేశాడు. 

మట్టవాన్‌లోని ఓ గ్యాస్ స్టేషన్‌లో అతడు ఆ లాటరి టికెట్‌ను కొనుగోలు చేశాడు. అక్కడే అతడు బార్ కోడ్‌ను స్క్రాచ్ చేశఆడు. దీంతో అతడి మొబైల్ ఫోన్‌కు ఆ టికెట్‌ను క్లెయిమ్ చేసుకోవాలంటూ మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో తనకు సుమారు 2 వేల డాలర్లలో ఏదో ఒక చిన్న మొత్తం లభించి ఉంటుందని భావించాడు. కానీ, లాటరీ అధికారులు అతడికి ఫోన్ చేసి మీరు.. రూ.7.9 కోట్లు గెలుచుకున్నారని చెప్పారు. దీంతో అతడి నోట నుంచి మాట రాలేదు. ఈ సందర్భంగా అతడు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నాకు వచ్చిన డబ్బులో కొత కొత్త ట్రక్కు కొనుగోలు చేయడానికి కేటాయిస్తాను. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో సేవ్ చేసుకుంటాను’’ అని తెలిపాడు. 

Also Read: మహిళలకు భర్తను అద్దెకిస్తున్న భార్య, రోజుకు రూ.3 వేలు ఆదాయం! 
ఇటీవల ఇండియాలో కూడా రోషన్ సింగ్ అనే వ్యక్తి ఇలాగే ఊహించని విధంగా లాటరీని గెలుచుకున్నాడు. సుమారు 34 ఏళ్లుగా లాటరి టికెట్ కొనుగోలు చేస్తున్న అతడికి.. ఓ రోజు ఊహించని న్యూస్ విన్నాడు. అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.2.5 కోట్లు వచ్చాయని తెలిపాడు. పంజాబ్ స్టేట్ డియర్ బైసాఖి బంపర్ లాటరీ కొనుగోలు చేసిన అతడు.. దీన్ని నమ్మలేకపోయాడు. లాటరీ అధికారులు, మీరు విన్నది నిజమే అని చెప్పేవరకు అతడు.. షాక్‌లోనే ఉన్నాడు. తన భార్య ఎన్నిసార్లు వారించినా అతడు పట్టు వదలని విక్రమార్కుడిలా లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. ఎట్టకేలకు అతడు ఆ డబ్బుతో తన అప్పులు తీర్చుకుని.. వ్యాపారం చేస్తున్నాడు. లక్కంటే ఇట్టా ఉండాలి కదా!!

Also Read: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

టాప్ హెడ్ లైన్స్

WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget