News
News
X

Love With Boyfriend Father: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

ప్రియుడి‌తో బ్రేకప్ తర్వాత చాలామంది అమ్మాయిలు వేరొక అబ్బాయిని వెతికే పనిలో పడతారు. అయితే, ఈమె మాత్రం ప్రియుడి తండ్రినే లైన్‌లో పెట్టేసింది.

FOLLOW US: 

ప్రేమ గుడ్డిదని, ఎప్పుడు ఎవరు ఎవరితో ప్రేమలో పడతారో చెప్పలేమని చాలామంది అంటుంటారు. కొన్ని ఘటనలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అమెరికాకు చెందిన ఓ యువతి ప్రేమకథను చదివిన తర్వాత తప్పకుండా మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రేమ ఇలా కూడా పుడుతుందా? అని ఆశ్చర్యపోతారు. 

ఒహియో‌కు చెందిన సిడ్నీ డీన్ అనే 27 ఏళ్ల మహిళ.. ఇటీవల 51 ఏళ్ల ట్రక్కు డ్రైవర్ పాల్‌ను పెళ్లి చేసుకుంది. అతడు మరెవ్వరో కాదు, స్వయంగా ఆమె మాజీ ప్రియుడికి కన్న తండ్రి. ఇది వినేందుకు షాకింగ్‌గా ఉన్నా.. జీర్ణించుకోలేని నిజం. పైగా వీరిద్దరు ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. డీన్‌కు 11 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు.. పాల్ కొడుకును ప్రేమించింది. అతడితో కొన్నాళ్లు డేటింగ్ కూడా చేసింది. దీంతో డీన్ తరచుగా పాల్ ఇంటికి వెళ్లేది.

డీన్ ప్రియుడు మరో యువతితో చనువుగా ఉండటం చూసి.. బ్రేకప్ చెప్పేసింది. అయితే, డీన్ తండ్రితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. వారిద్దరు నిత్యం చాటింగ్ చేసుకొనేవారు. అయితే, ఆమె అనుకోకుండానే పాల్ ప్రేమలో పడిపోయింది. దీనిపై డీన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను పాల్ ప్రేమలో పడతానని ఎప్పుడూ అనుకోలేదు. మా పరిచయం చాలా భిన్నంగా జరిగింది. కానీ, నేను చాలా హ్యాపీ’’ అని తెలిపింది. 

డీన్‌కు 16 ఏళ్లు రాగానే పాల్‌తో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె తల్లిదండ్రులు మొదట్లో వారిది ఫ్రెండ్‌షిప్ అనుకున్నారు. అయితే, ఆమె పాల్‌ను ప్రేమిస్తుందనే విషయం తెలియగానే షాకయ్యారు. ‘‘ప్రేమ ఒకే.. కానీ, అతడు నీ కంటే 24 ఏళ్లు పెద్దవాడు. అతడిని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావ్?’’ అని అడిగారు. అయితే, ఇందుకు డీన్ వద్ద సమాధానం లేదు. కానీ, అతడితో ఉంటే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ సంగతి తెలిసి ఆమె మాజీ ప్రియుడైన పాల్ కొడుకు కూడా షాకయ్యాడు.

Also Read: వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ, ఇది వారసత్వంగా వస్తుందట!

Also read: మిగిలిపోయిన అన్నంతో ఇలా దోశెలు, టేస్టు అదిరిపోతుంది

Published at : 30 Jun 2022 03:21 PM (IST) Tags: Wedding With Boyfriend Father Love With Boyfriend Father Wedding With Boyfriend Dad

సంబంధిత కథనాలు

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

ప్రేయసి హ్యాండ్ బ్యాగ్‌‌పై మూత్రం పోసిన ప్రియుడు - ఊహించని తీర్పిచ్చిన కోర్టు

ప్రేయసి హ్యాండ్ బ్యాగ్‌‌పై మూత్రం పోసిన ప్రియుడు - ఊహించని తీర్పిచ్చిన కోర్టు

ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!

ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!

Cat Saves Owners Life: యజమానికి గుండెపోటు - ప్రాణాలు కాపాడిన పిల్లి, ఇదిగో ఇలా చేసింది!

Cat Saves Owners Life: యజమానికి గుండెపోటు - ప్రాణాలు కాపాడిన పిల్లి, ఇదిగో ఇలా చేసింది!

టాప్ స్టోరీస్

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!