అన్వేషించండి

Top 5 UNESCO World Heritage Sites : యునెస్కో గుర్తించిన అద్భుతమైన 5 వారసత్వ ప్రదేశాలు ఇవే.. ఈ విషయాలు తెలుసా?

World Heritage Sites : ప్రాచీన దేవాలయాల నుంచి ఆధునిక నగరాల వరకు.. UNESCO గుర్తించిన 5 కట్టడాలు, వాటి ప్రాముఖ్యతలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్కిటెక్చర్(వాస్తుశిల్పం) అనేది సంస్కృతి, అధికారం, చరిత్రకు, ఊహకు అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ నిలిచిపోయే ఎన్నో అద్భుతాలను గుర్తించింది యునెస్కో. దానిలో ప్రతి ఒక్కటి మానవ ప్రతిభ, ఆధ్యాత్మిక లోతును ప్రతిబింబిస్తుంది. పురాతనమైన రాతి దేవాలయాల నుంచి మైమరిపించే నగరాల వరకు యూనెస్కో గుర్తించిన.. 5 ప్రదేశాల (Top 5 UNESCO World Heritage Sites) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి మనల్ని ఆశ్చర్యపరిచడమే కాకుండా.. అద్భుతమైన ఎక్స్​పీరియన్స్ ఇవ్వగలిగే ప్రదేశాలుగా నిలిచిపోతాయి.

మాచు పిచ్చు (Machu Picchu), పెరూ

(Image Source: Twitter/@vgallegoscortes)
(Image Source: Twitter/@vgallegoscortes)

ఆండిస్ పర్వతాలలో.. సముద్ర మట్టానికి దాదాపు 8,000 అడుగుల ఎత్తులో ఉంది మాచు పిచ్చు. ఇది ఇంజనీరింగ్‌కు అద్భుతమైన ఉదాహరణగా చెప్తారు. 15వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. 1911లో కనుగొనేవరకు దీని గురించి బయటి ప్రపంచానికి ఎలాంటి సమాచారం లేదు. ఈ ప్రాంతంలోని రాతి పని, సున్నం లేకుండా కట్టిన విధానం, శతాబ్దాల తరబడి.. భూకంపాలు, వాతావరణ పరిస్థితిని తట్టుకుని నిలబడిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇవన్నీ దానిని నిర్మించిన బిల్డర్ల ప్రతిభను హైలెట్ చేస్తాయి. పర్వతాల పక్కన చెక్కిన అందమైన టెర్రస్‌లు.. వ్యవసాయానికి, స్థిరత్వానికి రెండింటికీ ఉపయోగించారు. దేవాలయాలు ఖగోళ శాస్త్రంలోని నైపుణ్యాన్ని చూపిస్తాయి. దాదాపు పొగమంచుతో కప్పబడి ఉండే ఈ మాచు పిచ్చు దూరం నుంచి చూసేందుకు కూడా అద్భుతంగా కనిపిస్తుంది.

అంగ్‌కోర్ వాట్(Angkor Wat), కంబోడియా

(Image Source: Twitter/@KhmerPost24)

(Image Source: Twitter/@KhmerPost24)

అంగ్‌కోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం. 12వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. భక్తి, వాస్తుపరమైన ప్రతిభకు దీనిని నిదర్శనంగా చెప్తారు. ఈ ఆలయం మొదట విష్ణువుకు అంకితం చేశారు. తరువాత ఇది ముఖ్యమైన బౌద్ధ స్థలంగా మారింది. హిందూ పురాణాల ప్రకారం.. దీనిలోని ఐదు చిహ్నాత్మక టవర్లు.. విశ్వానికి పవిత్ర కేంద్రమైన మేరు పర్వతాన్ని సూచిస్తాయట. అంగ్‌కోర్ వాట్‌కు దాదాపు 2 మైళ్ల వరకు విస్తరించి ఉన్న రిలీఫ్‌లు.. రామాయణం, మహాభారత పురాణ దృశ్యాలను ప్రతిబింబిస్తాయి. తెల్లవారుజామున అత్యంత అద్భుతమైన సూర్యోదయ దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 

సిడ్నీ ఒపెరా హౌస్(Sydney Opera House), ఆస్ట్రేలియా

(Image Source: @forallcurious)
(Image Source: @forallcurious)

సిడ్నీ ఒపెరా హౌస్ ఆధునిక వాస్తుశిల్పానికి చిహ్నం. ఇది 20వ శతాబ్దంలో డిజైన్‌ను రీ డిజైన్ చేశారు. దీనిని 1973లో డానిష్ ఆర్కిటెక్ట్ జోర్న్ ఉట్జోన్ నిర్మించారు. దాని రూపకల్పన సరిహద్దులను నెట్టివేసే అత్యాధునిక ఇంజనీరింగ్ పద్ధతులతో రూపుదిద్దారు. తెరచాప లాంటి పైకప్పులు.. సముద్రపు గుల్లలు, ఎగిసిపడే అలలను పోలి ఉంటాయి. ఇది నౌకాశ్రయం అందాన్ని పోలి ఉంటుంది. ఈ వాస్తుపరమైన అద్భుతాన్ని యునెస్కో దాని బోల్డ్ ఆవిష్కరణ కోసం గుర్తించింది. ఒపెరా హౌస్ శక్తివంతమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ఇక్కడ సంవత్సరానికి 1,500 కంటే ఎక్కువ ప్రదర్శనలను నిర్వహిస్తారు. 

అల్హంబ్రా, స్పెయిన్ (Alhambra)

(Image Source: Twitter/@vgallegoscortes)
(Image Source: Twitter/@vgallegoscortes)

గ్రానడాలోని అల్హంబ్రా మూరిష్ ఆర్కిటెక్చర్ ఒక అద్భుతమైన కళాఖండం. ఇది ఇస్లామిక్ కళ, అండలూసియన్ సంస్కృతి కలిసి యూరప్‌లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటిగా చేసింది. ఇది అద్భుతమైన కోటగా, రాజభవనంగా మార్చింది. దీనిని 13వ, 14వ శతాబ్దాలలో నిర్మించారు. దాని ప్రాంగణాలు, ఫౌంటైన్లు, మైల్డ్​గా చెక్కిన స్టూకో గోడలు ఇస్లామిక్ ఆదర్శాన్ని ప్రతిబింబిస్తాయి. కాంతి, రేఖాగణిత నమూనాలు, అరబిక్ కాలిగ్రఫీ ఎప్పటికీ నిలిచిపోయే సొగసైన వాతావరణాన్ని అందిస్తుంది. శతాబ్దాల తరువాత కూడా అల్హంబ్రా స్పెయిన్ ఇస్లామిక్ స్వర్ణ యుగానికి జీవన జ్ఞాపకంగా నిలుస్తుందని చెప్తారు.

పెట్రా, జోర్డాన్ (Petra Jordan)

(Image Source: Twitter/@GrecianGirly)
(Image Source: Twitter/@GrecianGirly)

పెట్రాను తరచుగా "రోజ్-రెడ్ సిటీ"గా పిలుస్తారు. ఇది 2,000 సంవత్సరాల క్రితం ఇసుకరాయి కొండలలో చెక్కారు. అందుకే దీనిని పురావస్తు అద్భుతం అంటారు. ఒకప్పుడు నబటయన్ సామ్రాజ్యానికి అభివృద్ధి చెందుతున్న రాజధానిగా ఉన్న పెట్రా అరేబియా, ఈజిప్ట్, మధ్యధరా ప్రాంతాలను అనుసంధానించే వాణిజ్య కేంద్రం వృద్ధి చెందింది. దాని వైభవానికి మించి ఆనకట్టలు, కాలువలతో సహా పెట్రా అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. ఎడారి నగరం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే ఇంజనీరింగ్ ప్రతిభను ఇది కలిగి ఉంది. ఇరువైపులా ఎత్తైన శిఖరాలతో, కాలక్రమేణా సంరక్షించిన పురాతన రహస్య ప్రపంచంలోకి తీసుకెళ్లి మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Ram Gopal Varma : హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
Advertisement

వీడియోలు

Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
Ram Gopal Varma : హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
హీరోగా RGV... సెన్సేషనల్ 'షో మ్యాన్' - విలన్ ఎవరో తెలుసా?
IndiGo Flights Cancelled : ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
ఇండిగో రాకముందు భారతదేశంలో ఏయే విమానయాన సంస్థలు మూతపడ్డాయి? పూర్తి జాబితా ఇక్కడ చూడండి
IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!
ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనల‌లో సడలింపు!
Akhanda 2 Postponed : డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
India vs SA 3rd ODI : విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
Embed widget