అన్వేషించండి

Mysterious Places in India : ఇండియాలోని రహస్య ప్రదేశాలు ఇవే.. గాల్లో తేలే రాయి నుంచి కవలల భూమి వరకు

Must Visit Places in India : భారతదేశంలోని రహస్య ప్రదేశాలు చాలానే ఉన్నాయి. మీకు మిస్టరీ, అడ్వెంచర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రదేశాలు మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

Most Mysterious Places in India : భారతదేశంలోని ప్రతి అంగుళంలోనూ మిస్టరీ ఉంటుంది. ఆసక్తితో నిండిన కథనాలు ఉంటాయి. మనస్సును కదిలించే, గందరగోళానికి గురిచేసే, వెన్నులో వణుకు పుట్టించే గమ్యస్థానాలకు నిలయంగా చెప్తారు. కొన్ని ప్రదేశాలు ఆసక్తికరంగా ఉంటే.. కొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఏ శాస్త్రాలు, శక్తులు వాటిని వివరించలేకపోయాయి. అయితే ఇండియాలో అలాంటి ఆసక్తిగల ప్రదేశాలు ఏంటో.. వాటి వెనుక ఉన్న ఆసక్తికర కథనాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గాల్లో తేలే రాయి

(Image source: Twitter/ noorie_quotes)
(Image source: Twitter/ noorie_quotes)

ఆ రాయిని 11 మంది ఒకేసారి వేళ్లు పెట్టి.. "కమర్ అలీ దర్వేష్" అని తాకితే.. ఆ రాయి గాల్లోకి లేచి పైకి ఎగురుతుందట. ఈ రాయి బరువు సుమారు 90 కిలోల వరకు ఉంటుంది. ఇది శతాబ్దాల నాటి విశేషంగా, అద్భుతంగా, మత విశ్వాసంగా చెప్తారు. అయితే ఇప్పటికీ రాయి ఎగరడానికి కారణం ఎవరికీ తెలియలేదు. మిస్టరీగానే ఉంది. కానీ ఆ ప్రాంతంలో ఇది ఒక పవిత్రమైన విశ్వాస స్థలంగా చెప్తారు. కమర్ అలీ దర్వేష్ అనే సాధువు ఆ రాయికి శాపం పెట్టారని.. ఆయన పేరుతో పిలిస్తేనే అది లేస్తుందని నమ్ముతారు.

కర్ణి మాత ఆలయం

(Image source: Twitter/ ChidiKamedi)
(Image source: Twitter/ ChidiKamedi)

రాజస్థాన్​లోని కర్ణి మాత ఆలయంలో 20,000 కంటే ఎక్కువ ఎలుకలు ఉంటాయి. అయితే ఈ ఎలుకలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే పూజిస్తారు కూడా. వాటికి ఏమి జరగకుండా కాపాడుతారు. ఎందుకంటే ఈ ఎలుకలు కర్ణి మాతకు చెందిన బంధువులుగా భావిస్తారు. వారు పునర్జన్మ ఎత్తారని.. వారు ఆ మాత కుటుంబ సభ్యులని నమ్ముతారు.

శని శింగనాపూర్

(Image source: Twitter/ rastrvadi_4)
(Image source: Twitter/ rastrvadi_4)

మహారాష్ట్రలోని శని శింగానాపూర్ గ్రామంలో ఇప్పటివరకు దొంగతనం జరగలేదట. అందుకే ఇక్కడ ఏ ఇంటికి, పాఠశాలకు, ఇతర ఏ భవనాలకు తలుపులు ఉండవట. ఇక్కడి గ్రామస్తులు నేరాలు జరగకపోవడానికి శని దేవుడే కారణమని భావిస్తారు. ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

లేహ్ అయస్కాంత కొండ

(Image source: Twitter/ TourMyIndiaa)
(Image source: Twitter/ TourMyIndiaa)

లేహ్ లడఖ్​లోని అయస్కాంత కొండ ఉంది. ఇక్కడ వాహనాల ఇంజిన్‌లను ఆపివేసినా అవి నడుస్తాయి. ఏదో అతీంద్రియ శక్తి లాగుతున్నట్లుగా అవి కదులుతాయట. కొండ గురుత్వాకర్షణ శక్తి వల్ల కలిగే దృశ్య భ్రమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

లేపాక్షి

(Image source: Twitter/ EcumenicalTempl)
(Image source: Twitter/ EcumenicalTempl)

ఆంధ్రప్రదేశ్​లోని లేపాక్షిలో స్తంభాలు చాలానే ఉన్నాయి. అయితే వాటితో పాటు వేలాడే స్తంభం కూడా ఒకటి ఉంది. ఇది నేలను తాకకుండా ఉంటుందట. దానికింద నుంచి పేపర్, కర్ర వంటివి ఏమి పెట్టి లాగినా అడ్డు లేకుండా వస్తాయట. అయితే దానికి గల కారణం ఇప్పటికీ తెలియదు. 

కొడిని, కవలల భూమి

 

(Image source: Twitt)er/ trialNerrorNgo
(Image source: Twitt)er/ trialNerrorNgo

కేరళలోని కొడిని అనే ప్రదేశం ఉంది. ఇక్కడ రహస్యం ఏమిటంటే ఎక్కువమంది కవలలు ఉంటారట. కొన్ని అంచనాల ప్రకారం.. ఈ గ్రామంలో 200 జతల కవలలు ఉన్నారట. స్థానికంగా పండించిన చిలగడదుంపల వినియోగమే దీనికి కారణమని భావిస్తున్నారు. జెనిటికల్ కారణాలు, నీరు, పర్యావరణం వల్ల ఇలా జరుగుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు.

కొంగ్కా లా పాస్

భారతీయ, చైనా సరిహద్దులోని కొంగ్కా లా పాస్ అనే వివాదాస్పద ప్రాంతం ఉంది. అయితే ఇక్కడ గ్రహాంతరవాసుల గురించి అనేక నివేదికలు వచ్చాయి. ఈ ప్రాంతంలో గుర్తు తెలియని వస్తువులను ఎగురుతున్నట్లు చాలామంది ప్రత్యక్ష సాక్షులు చూశారట. ఇది గ్రహాంతరవాసుల ప్రదేశమని చాలామంది నమ్ముతారు.

మీరు ఎప్పుడైనా అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లి ఈ వింతలను చూడొచ్చు. అయితే కొంగ్కా లా పాస్​కి మాత్రం వెళ్లలేరు. చైనా, ఇండియా బోర్డర్ కాబట్టి వెళ్లకపోవడమే మంచిది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Embed widget