అన్వేషించండి

Henna for Hair : జుట్టుకు హెన్నా అప్లై చేసేముందు చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్

Hair Care : జుట్టుకు పెరుగుదలకు, రంగు కోసం, కండీషనింగ్​ కోసం చాలామంది జుట్టుకు హెన్నాను అప్లై చేస్తారు. హెన్నాను అప్లై చేసేముందు.. తర్వాత కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలట. అవేంటంటే..

Henna Benefits for Hair : హెన్నా జుట్టుకు ఎన్నో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కెమికల్స్ లేకుండా హెయిర్​ కలర్ వేసుకోవడానికి హెన్నా మంటి ఆప్షన్. సింథటిక్ హెయిర్ డైలకు బదులుగా దీనిని చాలామంది ఉపయోగిస్తారు. అలాగే జుట్టుకు హెన్నా మంచి పోషణను అందిస్తుంది. జుట్టు పొడిబారడాన్ని తగ్గించి.. సాఫ్ట్​గా, సిల్కీగా చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్​ను స్ట్రాంగ్​గా చేసి.. జుట్టు పెరుగుదులను ప్రోత్సాహించడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

స్కాల్ప్ సమస్యలు ఉన్నవారు కూడా హెన్నాను రెగ్యూలర్​గా ఉపయోగించవచ్చు. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ సమస్యలను దూరం చేస్తాయి. చుండ్రు, దురద లక్షణాలు తగ్గుతాయి. అయితే హెన్నాను జుట్టుకు అప్లై చేసేముందు, చేసిన తర్వాత కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణలు. దీనివల్ల హెన్నా ప్రయోజనాలను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​ లేకుండా పొందవచ్చని చెప్తున్నారు. 

హెన్నా అప్లై చేసేముందు.. 

మొదటిసారి హెన్నాను జుట్టుకు అప్లై చేయాలనుకుంటే.. 48 గంటల ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మీకు హెన్నాతో అలెర్జీ ఉంటే ముందే తెలుస్తుంది. మంచి క్వాలిటీ ఉండే హెన్నాను మాత్రమే ఎంచుకోవాలి. బాడీ ఆర్ట్ గ్రేడ్ హెన్నా పౌడర్​ను వినియోగిస్తే మంచిది. వాష్ చేసిన జుట్టుపై మాత్రమే హెన్నాను అప్లై చేయాలి. నూనె అప్లై చేస్తే హెన్నా పెట్టుకోకపోవడమే మంచిది. 

హెన్నా అప్లై చేస్తున్నప్పుడు..

హెన్నాను జుట్టుకు అప్లై చేస్తున్నప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. హెన్నా పౌడర్​ను నిమ్మరసం, టీ లేదా కాఫీ డికాక్షన్​తో కలిపి పేస్ట్​గా తయారు చేసుకోవాలి. దానిలో కొబ్బరి నూనె లేదా ఆలివ్​ నూనె లేదా పెరుగు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. వీటిని వేసుకోవడం వల్ల జుట్టుకు ఇంకా పోషణ అందుతుంది. మాయిశ్చరైజ్​ అవుతుంది. చేతులకు గ్లౌవ్స్ వేసుకుని జుట్టుకు హెన్నా అప్లై చేసుకోవాలి. లేదా టింట్ బ్రష్​ ఉపయోగించి హెన్నాను అప్లై చేసుకోవచ్చు. 

హెన్నాను ఎప్పుడూ అప్లై చేసినా కుదుళ్ల నుంచి ముందుగా అప్లై చేయాలి. స్కాల్ప్​ నుంచి అప్లై చేసుకుంటూ.. జుట్టుకు అప్లై చేయాలి. జుట్టును రెండు పార్టులుగా చేసి అప్లై చేస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన హెన్నాను ఒకటి లేదా 2 గంటలు ఉంచుకోవాలి. రంగు మరింత ఎర్రగా కావాలనుకుంటే 2 నుంచి 4 గంటలు కూడా ఉంచుకోవచ్చు. జుట్టుకు పోషణ కావాలనుకుంటే 45 నిమిషాల్లో కడిగేసుకున్నా మంచిదే. 

అప్లై చేసిన తర్వాత.. 

హెన్నా పూర్తిగా ఆరిన తర్వాత జుట్టునుంచి హెన్నా పోయేవరకు బాగా కడగాలి. గోరువెచ్చని నీటితో కడిగితే ఈజీగా వదిలిపోతుంది. అలాగే తలపై పడిన నీరు క్లియర్​గా వచ్చేవరకు నీటితో జుట్టును హెన్నా పోయేవరకు వాష్ చేసుకోవాలి. అనంతరం మాయిశ్చరైజింగ్​నిచ్చే షాంపూ, కండీషనర్​ను అప్లై చేసుకోవాలి. ఇలా హెన్నాను నాలుగు నుంచి 6 వారాలకోసారి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. 

కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్

హెన్నా పెట్టుకున్నాక మంచి రిజల్ట్స్​ కోసం కాస్త ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. హెన్నాను అప్లై చేయకముందు మీకు దానివల్ల అలెర్జీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 

Also Read : ఫ్రిడ్జ్​ పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Embed widget