Eye Health: ఈ పానీయం రోజూ తాగారంటే కళ్ళజోడు పెట్టుకునే అవసరమే రాదు!
స్క్రీనింగ్ టైమ్ ఎక్కువ కావడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చూపు మసకబారడం, కళ్ళజోడు వచ్చేస్తుంది. ఇక ఆ సమస్య ఉండకుండా కళ్ళని కాపాడుకోవాలని అనుకుంటే ఇది తాగండి.
ఎక్కువ సేపు టీవీ, ఫోన్, ల్యాప్ టాప్ చూడటం వల్ల కళ్ళు అలిసిపోతూ ఉంటాయి. స్క్రీన్ ఎక్స్ పోజర్ కారణంగా చాలా మంది దృష్టి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇవే కాదు అదే పనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు కూడా పొడి బారిపోయి మంటలు పుట్టడం, తలనొప్పి రావడం జరుగుతుంది. కళ్ళు సరిగా కనిపించకపోవడం వల్ల కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీ కళ్ళని కాపాడుకోవాలని అనుకుంటే కేవలం మూడే మూడు పదార్థాలతో తయారు చేసిన ఈ పానీయం తీసుకోండి. ఇది కంటి జబ్బులు రాకుండా చూస్తుంది. పురాతన కాలం నాటి ఈ ఔషధం కంటికి సంబంధించిన రుగ్మతలు తగ్గించేందుకు సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా పరిష్కరిస్తుంది.
ఇంట్లో ఈ పానీయం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
సోంపు గింజలు- ఒక కప్పు
బాదం పప్పు- ఒక కప్పు
రాక్ క్యాండీ- ఒక కప్పు
తయారీ విధానం
ఈ మూడు పదార్థాలు సమానంగా తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. గాలి చొరబడని డబ్బాలో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. గోరు వెచ్చని పాలలో ఈ పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని తాగేయడమే. నిద్రపోయే ముందు లేదా అల్పాహారం తీసుకోవడానికి ముందు ఈ పొడి కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.
ఈ మూడు పదార్థాల వల్ల లాభాలు
సోంపు, బాదం పప్పు, రాక్ క్యాండీల సమ్మేళనం సహజంగా కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. వాస్తవానికి ఇది పాతకాలపు ట్రిక్. పాలతో కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దృషి మెరుగుపడి కళ్ళద్దాలు పెట్టుకునే అవసరమే రాకుండా చేస్తుంది. బాదంపప్పులో సహజంగానె విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటికి మేలు చేస్తాయి. మొత్తం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది తరచూ తాగడం వల్ల కంటి శుక్లం, గ్లకోమా వంటి సమస్యలని దూరం చేస్తుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. సోంపు గింజలను నేత్రజ్యోతి అని కూడా పిలుస్తారు. అందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కంటి చూపు బాగుండెలా కాపాడతాయి.
ఇదే కాదు క్యారెట్, యాపిల్ జ్యూస్ కూడా కంటి చూపును కాపాడతాయి. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి సహకరిస్తాయి. బచ్చలికూర, కాలే, బ్రకోలి కలిపి చేసే జ్యూస్ తీసుకోవడం వల్ల కంటికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. నారింజ జ్యూస్, స్వీట్ పొటాటో, గుమ్మడికాయ కలిపి చేసిన సూప్, టొమాటో జ్యూస్, అలోవెరా జ్యూస్, కొబ్బరి నీళ్ళు కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.