News
News
X

Microwave: ఈ చిట్కాలు పాటించారంటే మైక్రోవేవ్‌లో కుకింగ్ నిమిషాల్లో చేసేసుకోవచ్చు!

మీకు తెలుసా వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ నుంచి రసం త్వరగా రావాలంటే మైక్రోవేవ్ ద్వారా సాధ్యం అవుతుందని.

FOLLOW US: 
Share:

వంట చేయడంతో అనేక ప్రక్రియలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వంట చేస్తారు. మైక్రోవేవ్ అవెన్‌లో వంట చేయడం అంటే చాలా మందికి రాదు. అందులో కేవలం ఆహార పదార్థాలు వేడి చేసుకోవడం వరకే చేస్తారు. కానీ బంగాళాదుంపలు ఉండకబెట్టడం దగ్గర నుంచి మెత్తబడిపోయిన చిప్స్ మళ్ళీ క్రిస్పీగా చేసుకునే వరకు మైక్రోవేవ్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు చక్కగా అందులోనే పప్పు కూడా వండుకోవచ్చు. మీ ఇంట్లో కూడా మైక్రోవేవ్ ఉంటే ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.

వెల్లుల్లి పేస్ట్

సాధారణంగా వెల్లులి పేస్ట్ చేసుకోవాలంటే మిక్సీలోనే లేదంటే రోట్లోనో నూరుకుంటారు. కానీ మైక్రోవేవ్ ద్వారా కూడా చాలా సింపుల్ గా వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు. వెల్లుల్లి తొక్కలు తొలగించిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. అందులోనే 2 స్పూన్లు నీటిని వేసి దాన్ని క్లాంగ్ ఫిల్మ్‌ తో మూసివేయాలి. ఆ బౌల్ ని మైక్రోవేవ్ లో సుమారు 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత ఫోర్క్ తో మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్‌ని గాలి చొరబడని ఒక కంటైనర్ లోకి తీసుకుని నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది.

బంగాళాదుంపలను ఉడకబెట్టవచ్చు

కేవలం నిమిషాల్లోనే బంగాళాదుంపలు ఉడకబెట్టుకోవచ్చు. 2 బంగాళాదుంపలు తీసుకుని వాటిని శుభ్రంగా నీటితో కడగాలి. తర్వాత ఫోర్క్ తో వాటికి రంథ్రాలు పెట్టాలి. మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు నీటిని పోసుకోవాలి. వాటిలో బంగాళాదుంపలు వేసి టైమర్ 8 నిమిషాలు సెట్ చేసుకోవాలి. తర్వాత గిన్నె బయటకి తీసి కాస్త చల్లగా అయిన తర్వాత తొక్క తీసుకుంటే సులభంగా వచ్చేస్తుంది.

నిమ్మకాయ రసం

గట్టిగా ఉండే నిమ్మకాయ నుంచి రసాన్ని తీయడం చాలా కష్టం. కానీ మీ ఇంట్లో మైక్రోవేవ్ ఉంటే మాత్రం అది చాలా సులభమైన పని. నిమ్మకాయ కడిగి దాన్ని మైక్రోవేవ్ లో 15 సెకన్ల పాటు ఉంచాలి. ఇది నిమ్మకాయ మెత్తగా అయ్యి గుజ్జు మృదువుగా మారేలా చేస్తుంది. తర్వాత దాని నుంచి రసాన్ని తీసుకోవడం చాలా ఈజీ.

పప్పు వండుకోవచ్చు

సరిగా పప్పు పెట్టగానే గ్యాస్ అయిపోయింది అనుకోండి మైక్రోవేవ్ ఉంటే అందులోనే రుచికరమైన పప్పు చేసుకోవచ్చు. కందిపప్పు ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు, 2 కప్పుల నీరు పోసుకోవాలు. టైమర్ 20 నిమిషాలు సెట్ చేసి పెట్టుకోవాలి. టైమ్ అయిపోయిన తర్వాత వాటిని బయటకి తీసి మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇందులోనే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఒక గిన్నెలో నూనె తాలింపు దినుసులు వేసుకుని వేడి చేసుకుని పప్పులో కలుపుకోవచ్చు.

ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా

ఉల్లిపాయ కోసేటప్పుడు ఖచ్చితంగా దాని పవర్ కి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా కాకుండా సింపుల్ గా చేసుకోవాలని అనుకుంటే ఉల్లిపాయ రెండు వైపులా కట్ చేసి మైక్రోవేవ్ లో 30 సెకన్ల పాటు ఉంచుకోవాలి. తర్వాత దాన్ని కోసేటప్పుడు మీకు అసలు కంటి వెంట నీళ్లే రావు. కళ్ళు మంటలు పుట్టవు.

మెత్తబడిన చిప్స్

చిప్స్ బయట పెట్టడం వల్ల గాలికి మెత్తగా అయిపోతాయి. వాటిని మళ్ళీ క్రిస్పీగా చేసుకోవడం చాలా సులభం. బేకింగ్ ట్రే తీసుకుని దానిపై పార్చ్ మెంట్ పేపర్ లేదా కిచెన్ టవల్ ఉంచాలి. అన్ని చిప్స్ దాని మీద పెట్టి 30 సెకన్ల పాటు మైక్రోవేవ్ లో ఉంచాలి. చిప్స్ క్రిస్పీగా ఉండకపోతే మరొక 30 సెకన్ల పాటు వేడిచేసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు

Published at : 30 Jan 2023 04:14 PM (IST) Tags: microwave Microwave Cooking Microwave Cooking Tips Dal Garlic Paste

సంబంధిత కథనాలు

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

High Blood Pressure: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి

High Blood Pressure: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి

బరువు తగ్గేందుకు వ్యాయామం అక్కర్లేదట, జస్ట్ ఈ మాత్ర వేసుకుంటే చాలట!

బరువు తగ్గేందుకు వ్యాయామం అక్కర్లేదట, జస్ట్ ఈ మాత్ర వేసుకుంటే చాలట!

గర్భనిరోధక మాత్రల వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందా?

గర్భనిరోధక మాత్రల వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందా?

Summer Skin Care: వేసవిలో మీ చర్మాన్ని సంరక్షించే విషయంలో ఈ తప్పులు చేయొద్దు

Summer Skin Care: వేసవిలో మీ చర్మాన్ని సంరక్షించే విషయంలో ఈ తప్పులు చేయొద్దు

టాప్ స్టోరీస్

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు