ATM Theft With JCB: వీడియో - దొంగలు అప్‌డేట్ అయ్యారు, జేసీబీతో ATMను పెకిళించి ఎత్తుకెళ్లారు, కానీ..

ఈ దొంగలు ‘మనీ హీస్ట్’లోని అన్ని ఎపిసోడ్స్ పూర్తిగా చూసేశారు కాబోలు. ఏకంగా జేసీబీతో ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయారు. కానీ..

FOLLOW US: 

టీఎంను దొంగిలించాలంటే అంత ఈజీ కాదు. సాధారణ సుత్తి, గొడ్డలి వంటి సాధారణ పనిముట్లతో ఏటీఎంను పెకిళించడం సాధ్యం కాదు. అందుకే, దొంగలకు ఓ ఐడియా వచ్చింది. ఏకంగా జేసీబీ ఎక్స్కవేటర్ తీసుకొచ్చి మరీ ఏటీఎంను పూర్తిగా పెకళించి మరీ తమ వెంట తీసుకెళ్లిపోయారు. కానీ, వారిని బ్యాడ్‌లక్ మరో రూపంలో పలకరించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో జరిగిందని అనుకుంటే పొరపాటే. ఇది జరిగింది ఇండియాలోనే. మహారాష్ట్రలోని సంగ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీరజ్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మీద దొంగల ముఠా కన్నుపడింది. ఒట్టి చేతులతో ఏటీఎంను ఎత్తుకెళ్లడం తీసుకెళ్లడం కష్టమని భావించిన దొంగల ముఠా.. ఓ జేసీబీని తెచ్చుకుంది. ఏటీఎం రూమ్‌ను తలుపులు పగలగొట్టి మరీ ఏటీఎం మెషిన్‌ను పెకిళించారు. దాన్ని పట్టుకుని పారిపోతున్న సమయంలో జేసీబీ ఓ గుంతలో ఇరుక్కుంది. దీంతో దొంగలు ఆ ఏటీఎం యంత్రాన్ని మోయలేక.. జేసీబీతోనే వదిలేసి పరారయ్యారు. దోపిడీ సమయంలో ఆ ఏటీఎంలో సుమారు రూ.27 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: ఫోన్ మాట్లాడుతూ లోకం మరిచింది, రెప్పపాటులో ప్రమాదం - ఇదిగో వీడియో

ఈ ఘటనపై మిరాజ్ గ్రామిణ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్ బంక్ వద్ద నిలిపివున్న ఓ జేసీబీని దొంగిలించి దొంగలు ఏటీఎంను పెకిళించారు. ఘటనా స్థలికి కొద్ది దూరంలో జేసీబీ ఓ గుంతలో ఇరుక్కుంది. అందులో ఏటీఎం కూడా సేఫ్‌గా ఉంది. పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌లు పరిశీలిస్తున్నాం. త్వరలోనే ఆ దొంగలను అదుపులోకి తీసుకుంటాం’’ అని తెలిపారు. ఈ వైరల్ వీడియో చూసి నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘మనీ హీస్ట్ 2023’ అని అంటున్నారు.

Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి

వీడియో: 

Published at : 26 Apr 2022 05:08 PM (IST) Tags: ATM Theft With JCB ATM Dig Out ATM Theft in Maharashtra ATM Machine Theft

సంబంధిత కథనాలు

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Vulvar Cancer: కనిపించని శత్రువు వల్వార్ క్యాన్సర్, మహిళలూ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Menstrual Hygiene Day: రుతుక్రమంలో ‘అక్కడ’ సబ్బు వాడకూడదా? ఈ టిప్స్ పాటిస్తే ఇన్ఫెక్షన్లు దూరం!

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!