అన్వేషించండి

Raw Vegetables: ఈ కూరగాయలను ఎప్పుడూ పచ్చిగా తినకండి, చాలా డేంజర్

కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కొందరికీ పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉంటుంది. అది మంచిదే కానీ అన్ని రకాల కూరగాయలు తినడం మాత్రం శ్రేయస్కరం కాదు.

క్యారెట్, బెండకాయ, దొండకాయ వంటి కూరగాయలు పచ్చిగా తింటారు. అలా తింటే ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని చెప్తుంటారు. అయితే అన్నీ రకాల కూరగాయలు పచ్చిగా తినడం కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాలుగు రకాల కూరగాయలు మాత్రం వాటిని వండుకుని తింటేనే ఉత్తమ ప్రయోజనాలు అందిస్తాయి. పచ్చిగా తింటే మాత్రం ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.

కొలోకాసియా ఆకులు

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దీన్ని అర్బి కా పట్టా అని పిలుస్తారు. ఈ ఆకులు ఒక విధమైన మట్టి రుచిని కలిగి ఉంటాయి. అయితే ఈ ఆకులు ఉడికించకుండా తినడం ఆరోగ్యానికి హానికరం. ఇవి పచ్చిగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అందుకు కారణం ఈ ఆకుల్లో అధిక మొత్తంలో ఆక్సలెట్ లేదా ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. వేడి చేయడం వల్ల ఆక్సలెట్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. ఇందులో రసాయనాల ప్రభావం తగ్గుతుంది. ఆ ఆకులు పచ్చిగా తింటే నోరు, గొంతు కూడా చికాకు పెడుతుంది. సరైన సమయం పాటు వాటిని ఉడికించడం వల్ల అందులోని వ్యాధుల ప్రమాదాన్ని పోగొట్టుకోవచ్చు.

క్యాబేజీ

బర్గర్, సలాడ్ లో ఎక్కువగా క్యాబేజ్ పచ్చిగా వేసుకుని తింటారు. ఇవి సలాడ్ కి అదనపు రుచిని అందిస్తాయి. పచ్చి క్యాబేజీలో టేప్ వార్మ్ ఉండే అవకాశం ఉంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. క్యాబేజ్ ని వండి తీసుకోవడం వల్ల దాని రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. వ్యాధికారకాలు ఏమైనా ఉంటే తొలగిస్తుంది. క్యాబేజీని నీటిలో వేసి బాగా ఉడికించుకున్న తర్వాత తీసుకోవడం మంచిది.

క్యాప్సికమ్

బెల్ పెప్పర్స్ ని క్యాప్సికమ్ అంటారు. వివిధ రంగుల్లో లభిస్తాయి. వాటిని పచ్చిగా తినడం కాస్త ప్రమాదమే. క్యాప్సికమ్ రుచిని ఆస్వాదించాలంటే వాటిని వేయించి లేదా ఉడికించి తింటే బాగుంటుంది. క్యాప్సికమ్ వండుకునే ముందు వాటిలోని విత్తనాలు తప్పనిసరిగా తీసేయాలి. వాటిలో టేప్ వార్మ్ అనే జీవి గుడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. విత్తనాలు తొలగించి వాటిని వేడి నీళ్ళలో బాగా కడిగిన తర్వాత వంటకు ఉపయోగించుకోవడం ఉత్తమం.

వంకాయ

దీన్ని తినేందుకు మామూలుగానే చాలా తక్కువగా ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం వీటిని పచ్చిగా తింటారు. అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కూరగాయ విత్తనాలలో కూడా టేప్ వార్మ్ గుడ్లు ఉంటాయి. పచ్చి వంకాయలు తీసుకుంటే పరాన్నజీవులు శరీరంలోకి చేరిపోతాయి. వంకాయని పూర్తిగా మెత్తగా ఉడికించిన తర్వాత తీసుకుంటే పోషకాలు శరీరానికి అందుతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: బ్లూ లైట్ గ్లాసెస్ కళ్ళకి సురక్షితం కాదా? షాకింగ్ విషయాలు వెల్లడించిన కొత్త అధ్యయనం

టాప్ హెడ్ లైన్స్

Managing Diabetes : డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget