మీరు రోజూ చేసే ఈ పనులు రక్తంలో షుగర్ స్థాయిలను పెంచేస్తాయ్, మానుకుంటే మంచిది
డయాబెటిస్ ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య.
మధుమేహం కొందరిలో వారసత్వంగా వస్తుంది కానీ మరికొందరిలో మాత్రం వారి చెడు జీవనశైలి కారణంగా వస్తుంది. మంచి ఆహారం తినకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, కొన్ని చెడు అలవాట్ల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ద్వారా, వేటి వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఆహారాలు, పానీయాలు, అలవాట్లు చక్కెరస్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. మీ రోజువారీ కార్యకలాపాలు కొన్ని డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. అవేంటంటే...
అల్పాహారం తినకుండా...
చాలా మంది అల్పాహారం తినకుండా స్కిప్ చేస్తుంటారు. నిజానికి రోజులో ముఖ్యమైన ఆహారం అల్పాహారమే. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఉదయం భోజనం చేయకుండా ఉండటం వల్ల లంచ్ , డిన్నర్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల డయాబెటిస్ సమస్య పెరుగుతుంది.
అధిక ఎండ
తీవ్రమైన ఎండల్లో ఎక్కువ సేపు ఉండడం కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో అధిక ఒత్తిడ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ సేపు అధిక ఎండలకు గురికావద్దు.
కాఫీ
ఎంతో మందికి చాలా ఇష్టమైన పానీయం ఇది. కాఫీ తాగనిదే ఎంతో మందికి తెలవారదు. కాఫీలో అధికంగా కాఫీ పొడి, చక్కెర వేసుకుని తాగకూడదు.ఆ రెండు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఇది తెలియకుండా డయాబెటిస్‌ను పెంచేస్తాయి.
నిద్రలేమి
ఆరోగ్యమైన శరీరం కావాలంటే ప్రశాంతమైన మనస్సు, తగినంత నిద్ర అవసరం. ఒక రాత్రి సరిగా నిద్రలేకపోయినా ఈ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. శరీరం ఇన్సులిన్ సమర్థం వినియోగించుకోలేదు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగేస్తాయి. డయాబెటీస్ ఉన్నవారిలో సాధారణంగా తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు రక్తంలో చక్కెర (గ్లూకోజ్) అసాధారణంగా పెరగడాన్ని గుర్తించారు పరిశోధకులు. మధుమేహం ఉన్నా లేకున్నా తెల్లవారుజామున ప్రజలు హార్మోన్ల పెరుగుదలను డాన్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో వారి రక్తంలో చక్కెర స్థాయిలలో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించవచ్చు
చిగుళ్ల వ్యాధి
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (JADA) ప్రకారం, చిగుళ్ల వ్యాధి ఉన్న వారిలో కూడా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. చిగుళ్ల వ్యాధి తీవ్రంగా మారితే దాన్ని 'పెరియోడొంటిటిస్' అంటారు. అలాంటప్పుడడు రక్తంలో చక్కెర స్థాయిలు (A1c) అధికమయ్యే ప్రమాదం ఉంది. అలా టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశం ఉంది.
డీహైడ్రేషన్
శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మీ శరీరంలో తక్కువ నీరు అంటే మీ రక్తంలో చక్కెర ఎక్కువ అవుతుందని అర్థం. రక్తంలో చక్కెర అధికంగా ఉంటే మూత్ర విసర్జన కూడా అధికమవుతుంది.
కృత్రిమ స్వీటెనర్లు
శుద్ధి చేసిన చక్కెర కంటే కృత్రిమ స్వీటెనర్లను దూరంగా పెట్టాలి. మధుమేహం ఉన్నవారికి ఇవి ఉత్తమమైనవి కావు. కానీ చాలా మంది మధుమేహులు వాటిని వాడుతున్నారు. పంచదారకు బదులు వాడుతున్నప్పటికి వీటి వల్ల కూడా ఎన్నో నష్టాలు ఉన్నాయి.
Also read: మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీ, దోశ, పూరీ - పిల్లలకు తినిపిస్తే పోషకాహార లోపమే రాదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.