అన్వేషించండి

మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీ, దోశ, పూరీ - పిల్లలకు తినిపిస్తే పోషకాహార లోపమే రాదు

పిల్లలకు పోషకాహారలోపం రాకుండా ఉండాలంటే వారికి పెట్టే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల్లో పోషకాహార లోపం తరచూ తలెత్తుతుంది. అలాంటి పిల్లలకు అల్పహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసి తినిపిస్తే ఆ లోపం తలెత్తదు. రోజూ ఇంట్లో చేసే పూరీ, దోశె, ఇడ్లీనే...కానీ వాటికి మరిన్ని పోషకాలు జతచేర్చి పెట్టాలి. అలా జత చేర్చడం చాలా సులువు. ఎలాగో ఓసారి చూడండి. 

ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - ఒక కప్పు
క్యారెట్ తురుము - అరకప్పు
క్యాప్సికం తురుము- అరకప్పు
ఉడకబెట్టిన పెసరపప్పు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ ఇలా
1. ఇడ్లీ పిండిని ముందుగా ఎలా సిద్ధం చేసుకుంటారో అలాగే చేసుకోవాలి. 
2. ఇడ్లీ పెట్టడానికి ముందు ఆ పిండిలో  క్యారెట్ తురుము, క్యాప్సికం తురుము, ఉడకబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలపాలి. 
3. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా, నెయ్యి రాసి రుబ్బు వేసుకోవాలి. 
4. ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే సరి, మిక్స్‌డ్ వెజిటబుల్ ఇడ్లీ రెడీ అయినట్టే. 
5. కొబ్బరి చట్నీతో లేదా టమాటా చట్నీతో ఈ ఇడ్లీ తింటే  అదిరిపోతుంది. 
ఈ ఇడ్లీని తరచూ పెట్టడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. పోషకాహార లోపం తలెత్తదు. 
........................................................

దోశె

కావాల్సిన పదార్థాలు
పొట్టు తీయని పెసరపప్పు - అర కప్పు
మినప గుళ్లు - ఒక కప్పు
క్యారెట్ తురుము - అర కప్పు
కొత్తిమీర తురుము - పావు కప్పు
నూనె - సరిపడా
ఉప్పు - రుచికి తగినంత

తయారీ ఇలా
1. ముందుగా పెసరపప్పు, మినప గుళ్లను నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే మరుసరి రోజు ఉదయానికి అవి మెత్తగా అవుతాయి. 
2. పెసరపప్పు పొట్టను తీయకూడదు. అలాగే పప్పులను కడిగేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. 
3. రెండు పప్పులను కలిపేసే రుబ్బుకోవాలి. 
4. ఇప్పుడు రుబ్బులో ఉప్పు, మెత్తటి క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి. 
5. వాటిని దోశెల్లా పోసుకోవాలి. 
6. ఈ దోశెలను ఒక్కసారి తినిపిస్తే మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు పిల్లలు. అంత రుచిగా ఉంటాయి. 
7. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, వేరు శెనగ పలుకుల చట్నీతో ఈ దోశె బావుంటుంది. 
................................................
పూరీ

కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
పాలకూర తరుగు - అర కప్పు
క్యారెట్ తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
నీళ్లు - సరిపడా

తయారీ ఇలా 
1. గోధుమపిండితోనే పిల్లలకు పూరీలు చేసి పెట్టాలి. చాలా మైదా పిండి వాడతారు. ఇది ఆరోగ్యానికి హానికరం
2. పాలకూరను సన్నగా తరిగి కళాయిలో కాస్త నూనె వేసి మగ్గించాలి. ఆకులు మెత్తగా నలిగి దగ్గరగా వస్తాయి. నీళ్లు ఇంకిపోతాయి. 
3. ఒక గిన్నెలో గోధుమపిండి, నీళ్లు, ఉప్పు వేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి. 
4. ఆ సమయంలో ఉడకబెట్టిన పాలకూర, తురిమిన క్యారెట్ వేసి పిండిని కలుకోవాలి. 
5. ఇప్పుడు పూరీల్లా ఒత్తుకుని నూనెలో వేసి వేయించుకోవాలి. 
6. అంతే పోషకాల పూరీ రెడీ అయినట్టే. 
కూరలు తినని పిల్లలకు ఇలాంటి టిఫిన్లు పెట్టడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు. 

Also read: వీటిని రోజూ తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం సగం వరకు తగ్గిపోతుంది

టాప్ హెడ్ లైన్స్

DIY Flaxseed Gel for Hair : అవిసె గింజలు జెల్ తలకు అప్లై చేస్తే కలిగే లాభాలు ఇవే.. ఇలా తయారు చేసి, అలా అప్లై చేసేయండి
అవిసె గింజలు జెల్ తలకు అప్లై చేస్తే కలిగే లాభాలు ఇవే.. ఇలా తయారు చేసి, అలా అప్లై చేసేయండి
Sexual Enhancement Pills : బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?
బీపీ ఎక్కువ, తక్కువ ఉన్నా, గుండె సమస్యలు ఉన్నా.. లైంగిక కోరికను పెంచే ట్యాబ్లెట్స్ వాడకూడదా?
Joint Pain During Monsoon : వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CI Nagarajau Arrest: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్! తీవ్ర ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్న సిట్
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
Amaravati బైపాస్ వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద ఆందోళన.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు, ఎందుకంటే
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Embed widget