Cancer: ఓ మై గాడ్, మీ కాళ్లు ఇలా వాచిపోతున్నాయా? జాగ్రత్త క్యాన్సర్ కావచ్చు!
కాళ్ళల్లో వాపు కనిపిస్తే నీరు పట్టడం వల్ల అలా వచ్చిందని అపోహ పడుతున్నారా? అయితే మీరు ఈ క్యాన్సర్ ని గుర్తించనట్లే..
క్యాన్సర్.. ఈ పదం వింటే ఒకప్పుడు గుండెల్లో వణుకు. దీని బారిన పడితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పరస్థితి మారింది. వైద్య పరంగా టెక్నాలజీ అభివృద్ధి పరంగా ఎటువంటి క్యాన్సర్ కి అయిన చికిత్స చేసి ప్రాణాలు కాపాడగలుతున్నారు. అది కూడా క్యాన్సర్ వచ్చిందనే విషయం ప్రారంభ దశలో తెలుసుకున్నప్పుడే. చివరి దశకి చేరితే ప్రాణాలు కాపాడటం అంటే కత్తిమీద సాములాంటిదే. చాలా మంది క్యాన్సర్ లక్షణాలు తెలుసని అపోహ పడుతుంటారు. కానీ చాలా తెలియని సంకేతాలు కూడా ఉంటాయి. కొన్ని సంకేతాలు సాధారణంగా వచ్చినవే అని నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణాంతకం కావొచ్చు.
అత్యంత సాధారణ క్యాన్సర్లలో మూత్రాశయ క్యాన్సర్ ఒకటి. 50 సంవత్సరాలు పైబడిన పురుషులు దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. లక్షణాలు అస్పష్టంగా ఉండటం వల్ల ప్రారంభదశలోనే చికిత్స తీసుకోవడం కష్టం అవుతోంది. మూత్రాశయ క్యాన్సర్ చివరి దశకి చెరినప్పుడు చికిత్స తీసుకోవడం చాలా కష్టం. అదే త్వరగా గుర్తిస్తే 80 శాతం ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే దీనికి సంబంధీన అన్నీ లక్షణాల మీద అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూకే క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం కాళ్ళ వాపు మూత్రాశయ క్యాన్సర్ సాధారణ లక్షణంగా చెప్పుకోవచ్చు.
మూత్రాశయ లక్షణాలు
☀ మూత్రంలో రక్తం
☀ ఎముకల్లో నొప్పి
☀ కడుపులో నొప్పి
☀ శ్వాస ఆడకపోవడం
☀ పొత్తికడుపు లేదా మెడలో గడ్డలు
☀ చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం
☀ మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట
☀ తరచుగా మూత్రవిసర్జన
☀ కిడ్నీ ఇన్ఫెక్షన్
☀ మూత్రపిండాల్లో రాళ్ళు రావడం
☀ పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథి విస్తరించడం
రక్తంలో మూత్రం కనిపించినంత మాత్రం మూత్రాశయ క్యాన్సర్ ఉన్నట్లు కాదు. వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకున్న తర్వాతే వ్యాధి నిర్ధారణకి రావాలి.
మూత్రాశయ క్యాన్సర్ రావడానికి కారణాలు
ఈ క్యాన్సర్ వచ్చేందుకు ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమి లేవు. కానీ ఈ క్యాన్సర్ వ్యాధిని పెంచే వివిధ అంశాలు మాత్రం ఉన్నాయి. వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి. అనేక క్యాన్సర్ల మాదిరిగానే మూత్రాశయ క్యాన్సర్ కూడా హానికమైన పదార్థాలు తీసుకోవడం వల్లే వస్తుంది. ఇది కొన్నేళ్ళ పాటు మూత్రాశయం కణాలలో అసాధారణ మార్పులకి దారి తీస్తుంది. ధూమపానం వల్ల ఈ క్యాన్సర్ వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది పురుషులకి మాత్రమే కాదు స్త్రీలకి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధి నయం చేసేందుకు శస్త్ర చికిత్స, కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనవ థెరపీ, డ్రగ్ థెరపీ ఉంటాయి. క్యాన్సర్ చికిత్సకి భయపడితే దాన్ని నయం చేయడం చాలా కష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వామ్మో కళ్ళలో ఏకంగా 23 లెన్స్‌లు - వీటితో ఎన్ని అనర్థాలో తెలిస్తే నమ్మలేరు!
Also Read: మూడీగా ఉంటూ మనసులోనే మథన పడుతున్నారా? అయితే, ప్రమాదంలో పడినట్లే