Nicotine Foods: ధూమపానం మానేయాలని అనుకుంటున్నారా? ఈ కూరగాయలు తినండి!
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికీ దాన్ని వదిలించుకోవడం కష్టం. కానీ ఈ కూరగాయలు తింటూ ఆ అలవాటు నుంచి బయట పడొచ్చు.
ధూమపానానికి ఎంతో మంది బానిసలుగా మారడానికి కారణం అందులోని నికోటిన్. ఒక్కసారి దానికి అలవాటు పడితే విడిచిపెట్టడం కష్టం. నికోటిన్ అనేది సిగరెట్ లో ఉండే ఒక పదార్థం. మెదడు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రక్తనాళాలని ఇరుకు చేస్తుంది. రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. మెదడు నికోటిన్ కి బానిసగా మారిపోయి హానికరమైన అలవాట్లకి విడిచిపెట్టలేకపోతారు. నికోటిన్ అనేది సహజంగా ఉత్పత్తి అయ్యే ఆల్కలాయిడ్. ఇది నైట్ షెడ్ మొక్కల కుటుంబానికి చెందింది. పొగాకు నైట్ షేడ్ కుటుంబంలోని భాగమే. అయితే మీకోక విషయం తెలుసా కేవలం పొగాకులో మాత్రమే కాదు రోజు మనం తీసుకునే కూరగాయల్లో కూడా కొంతమొత్తంలో నికోటిన్ ఉంటుంది.
మనం రోజు తినే పండ్లు, కూరగాయాలు ఇతర ఆహారాల్లో సహజంగా నికోటిన్ ఉన్నప్పటికీ దాని స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక మీరు వాటికి బానిసలుగా మారే అవకాశం లేదు. ఈ ఆహారాలు తిన్నప్పుడు నికోటిన్ పేగుల ద్వారా ప్రయాణించి సులభంగా జీర్ణం అవుతుంది. నైట్‌షేడ్ మొక్కలు, ఇతర ఆహారాలలో కనిపించే నికోటిన్‌ను మైక్రోగ్రాముల (µg)లో కొలుస్తారు. ఒక మిలియన్ µg ఒక గ్రాముకు సమానం. అందుకే దాని స్థాయిలు తక్కువగా ఉంటాయి. ధూమపానం మానేయడంలో ఈ ఆహారాలు మీకు సహాయపడతాయి.
వంకాయ
వంకాయ నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్క. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇందులో 100 μg నికోటిన్ ఉంటుంది. అయితే సిగరెట్ లో కనిపించే నికోటిన్ మోతాదు తినాలంటే మీరు 10 కిలోల వంకాయలు తినాలి. అందుకే ఇందులోని నికోటిన్ ఆరోగ్యానికి అంతగా హాని చేయదు.
బంగాళాదుంప
బంగాళాదుంపలు ఇష్టపడని వాళ్ళు ఉండరు. చిప్స్, వేపుడు, కూర ఏ విధంగా తీసుకున్న రుచిగానే ఉంటుంది. ఒక బంగాళాదుంపలో సగటున 15 µg/గ్రామ్ నికోటిన్ ఉంటుందని నిపుణులు చెప్పుకొచ్చారు. ఆకుపచ్చని బంగాళాదుంపలో నికోటిన్ సుమారు 42 µg/గ్రామ్ ఉంటుంది. కానీ వీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీరు బంగాళాదుంప ప్యూరీ చేయాలని అనుకుంటే మాత్రం అందులోని నికోటిన్ స్థాయిలు 52 µg/గ్రామ్ వరకు పెరుగుతుంది.
క్యాలీఫ్లవర్
నికోటిన్ కలిగిన అత్యంత ఆశ్చర్యకరమైన రోజువారీ ఆహారాలలో క్యాలీఫ్లవర్ ఒకటి. వాస్తవానికి ఇది నైట్ షేడ్ మొక్కల కుటుంబానికి చెందినది కాకపోయినప్పటికీ ఇందులో 16.8 µg/గ్రామ్ నికోటిన్‌ను ఉంటుంది.
గ్రీన్ పెప్పర్
పచ్చి మిరపకాయలు పాస్తా, కూరలు, సలాడ్ లో తప్పకుండా వేసుకుంటారు. తక్కువ మొత్తంలోనే వినియోగిస్తారు. కానీ పచ్చి మిర్చిలో 7.7 నుంచి 9.2 µg/గ్రామ్ నికోటిన్ ఉంటుంది.
టొమాటో
టొమాటో నైట్ షేడ్ ఆహారం. పండని టొమాటోలో నికోటిన్ అధిక సాంద్రత కలిగి ఉంటుంది. అవి పండినప్పుడు అందులోని సాంద్రత తగ్గుతుంది. సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసే టొమాటోలో సగటున 7.1 µg/గ్రామ్ నికోటిన్ ఉండవచ్చు.
టీ
చాలా మంది అత్యంత ఇష్టంగా తాగే పానీయం టీ. ఇది కూడా నైట్ షేడ్ కుటుంబానికి చెందినదే. కొన్ని బ్రూడ్, ఇన్‌స్టంట్ టీలు నలుపు, ఆకుపచ్చ టీలు నికోటిన్‌ను కలిగి ఉంటాయి. సాధారణంగా టీలో నికోటిన్ గాఢత 100 నుంచి 285 µg/గ్రామ్ ఉంటుంది.
ధూమపానం మానేయాలని అనుకునే వాళ్ళు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. మాంసం ఉత్పత్తులు, కాఫీ, ఆల్కహాల్ కి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇవి తీసుకున్నప్పుడు సిగరెట్ తాగాలనే కోరిక కలుగుతుంది. కాఫీ విత్ సిగరెట్ ఎక్కువ మందికి ఉన్న చెడు అలవాటు. అందుకే కాఫీకి బదులుగా గ్రీన్ టీ వంటి ఆరోగ్యరకమైన అలవాట్లు చేసుకోవడం ఉత్తమం. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం స్పైసీ ఫుడ్, షుగర్ ఫుడ్స్ కూడా సిగరెట్లు తాగాలనే కోరికని పెంచుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: టాయిలెట్‌లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!