Gut Health: ఇలా చేశారంటే మీ పేగులు చెడిపోతాయ్ - ఈ అలవాట్లకు దూరంగా ఉండండి
గట్ (పేగులు లేదా ఆంత్రం) ఆరోగ్యం చాలా కీలకం. అది ఏ మాత్రం అటు ఇటు అయినా దాని ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది.
పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ పొట్ట అసౌకర్యంగా ఉంటే అది మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. పేగులు శుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్స్ బారిన పడి ఆహారం తీసుకోవడం జీర్ణం చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే గట్ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్లు పేగులకు హాని కలిగిస్తాయి. సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంతో పాటు పోషకాలని శోషించుకుని వ్యర్థాలను బయటకు పంపించడంలో గట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా శరీరానికి సరిపడని ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు, పొత్తి కడుపు నొప్పి, అజీర్ణం, ఎసిడిటీ, పుల్లని తేపులు వచ్చి కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. అందుకే గట్ ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. పేగుల్లో ఉండే మైక్రోబయోమ్ లను గట్ మైక్రోబయోమ్స్ అంటారు. ఇది కొవ్వు నిల్వలనౌ నియంత్రిస్తుంది. గట్ ని ఇబ్బంది పెట్టె లక్షణాలు కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. లేదంటే కడుపు ఇబ్బంది పెట్టె సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు మీ పేగులని ఇబ్బంది పెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
నిద్రలేమి: నిద్రలేమి శరీరాన్నే కాదు పేగులను కూడా సమస్యల్లోకి నెట్టేస్తుంది. సరేగా నిద్రపోకపోతే శరీరం అధిక ఒత్తిడికి గురవుతుంది. అది గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే కంటి నిండా నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు పడే పడే హెచ్చరిస్తారు.
ఒత్తిడి: ఇది పేగులకి హాని కలిగించే మరొక లక్షణం. తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు గట్ లో అభివృద్ధి చెందే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాని వల్ల పేగులు ప్రమాదంలో పడిపోతాయి.
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అది కడుపుపై ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కడుపు సమస్యలకి దూరంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
ఆల్కహాల్: మద్యం సేవించడం ఆరోగ్యానికి అన్నీ విధాలుగా హాని చేస్తుంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట లోపలి పొర దెబ్బతింటుంది. ఇది చివరకి పొట్ట సమస్యలకి దారి తీస్తుంది. అందుకే ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.
గట్ సమస్యల నుంచి బయట పడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నీ విధాలుగా మంచిది. త్రిఫల చూర్ణం జీర్ణక్రియకి చాలా మంచిది. అందుకే ప్రతి రోజు నిద్రకి ఉపక్రమించే ముందు కొద్దిగా త్రిఫల చూర్ణం నీటిలో కలిపి తీసుకోవడం వల్ల పేగులు శుభ్రపడతాయి. జీలకర్ర, యాలకులు, త్రిఫల చూర్ణం తరచూ తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహారాన్ని నమిలి మింగాలి లేదంటే అది జీర్ణం కావడం కష్టం అవుతుంది. అందుకే బాగా ఆహారం నమిలి మింగాలని నిపుణులు చెబుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నిగనిగలాడే జుట్టు కోసం కరివేపాకు - ఈ చిట్కాలు పాటిస్తే పొడవైన జుట్టు మీ సొంతం
Also read: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం