Corona Virus: మన దేశంలో ఒమిక్రాన్ వైరస్ సోకిన ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్లే... ఇద్దరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లే
ఒమిక్రాన్ మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే...
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ మనదేశంలోకి కూడా అడుగుపెట్టేసింది. బెంగుళూరులో రెండు కేసులు నమోదైనట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికీ ఈ వైరస్ లక్షణాలు కనిపించినట్టు చెప్పింది. మొన్నటి వరకు వాళ్లెవరో తెలియ లేదు కానీ, ఇప్పుడు ఆ ఇద్దరి గురించి కొంత సమచారం బయటికి వచ్చింది. అందులో ఒక వ్యక్తికి 66 ఏళ్లు అతను దక్షిణాఫ్రికా పౌరుడు. మరో వ్యక్తి బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల ఓ అనస్తీషియన్.
వీరిద్దరితో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు కూడా కనిపెట్టారు అధికారులు. అనస్తీషియన్‌కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ గా తేలింది. అతనితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న అయిదుగురు వ్యక్తులు కూడా కరోనా పాజిటివ్ గా తేలారు. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షకు పంపించింది ప్రభుత్వం. ఆ డాక్టర్ ను, అతడిని నేరుగా కలిసిన 13 మంది వ్యక్తులను, అలాగే 205 సెకండరీ కాంటాక్టులు అంటే ఆ పదమూడు మంది కలిసిన వ్యక్తులను కనిపెట్టి... అందరినీ ఆసుపత్రిలోనే ఐసోలేట్ చేశారు.
ఆ వ్యక్తి వెళ్లిపోయాడు...
మరో వ్యక్తి 66 ఏళ్ల దక్షిణాఫ్రికా పౌరుడు. అతడిని బెంగళూరులోనే హోటల్లో ఐసోలేషన్లో ఉండమని ఆదేశించారు అధికారులు. కానీ అతను నవంబర్ 27న దుబాయ్ వెళ్లిపోయాడు.
వ్యాక్సినేషన్ పూర్తి...
ఒమిక్రాన్ సోకిన ఈ ఇద్దరికీ కూడా రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయింది. వీరిలో చాలా మైల్డ్ లక్షణాలే బయటపడ్డాయి. ఆసుపత్రిలో చేరేంత అనారోగ్యం కలగలేదు. ఇద్దరూ చలాకీగానే ఉన్నారు. వారి పనులు వారు చేసుకుంటున్నారు.
లక్షణాలు ఇవే...
ఈ కొత్త వేరియంట్లో కొన్ని లక్షణాలు భిన్నంగా ఉన్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో అలసట అధికంగా ఉంటుంది. గొంతులో నొప్పి, పొడి దగ్గు, తలనొప్పి, అతిసారం, చిరాకు, శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బంది, ఛాతీ నొప్పి, గందరగోళంగా అనిపించడం వంటివి కలుగుతాయి. ఈ వైరస్‌ను RT-PCR పరీక్షల ద్వారా గుర్తించవచ్చు.
Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
Also Read: Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి