By: Haritha | Updated at : 22 May 2023 10:48 AM (IST)
(Image credit: Pixabay)
హై బీపీ లేదా హైపర్ టెన్షన్... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ హైబీపీని పర్యవేక్షించడం చాలా అవసరం. ఇది అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రధాన రక్తనాళాలైనా ధమనుల్లో రక్తం ప్రశాంతంగా ప్రవహించకుండా, దూకుడుగా ప్రవహిస్తూ ధమని గోడలను ఢీకొడుతూ ఉంటుంది. అలా ఢీకొట్టినప్పుడు బీపీ పెరుగుతుంది. అదే హైబీపీ. ఇది వచ్చినట్టు కూడా చాలామంది గుర్తించలేరు. పరిస్థితి చాలా తీవ్రంగా మారేవరకు ఇది ఎటువంటి లక్షణాలను పెద్దగా చూపించదు. అందుకే అధిక రక్తపోటును గుర్తించడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం. రక్తపోటు ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. కళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
ఎలాంటి లక్షణాలు?
రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. దీన్ని హైపర్‌టెన్సివ్ రెటినోపతి అని పిలుస్తారు. రక్తనాళాల గోడలు సంకోచించి రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. దీనివల్ల రెటీనాలోని రక్తనాళాలపై కూడా ప్రభావం పడుతుంది. అవి వాచిపోతాయి. రక్తం లీకయ్యే పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడు కళ్ళు ఎర్రగా మారిపోతాయి. కళ్లు ఎర్రగా కనిపిస్తే ఓసారి బీపీ చెక్ చేయించుకోవాలని గుర్తుంచుకోండి.
కళ్ళల్లో కనిపించే ఈ సంకేతాలు కాకుండా బీపీ అధికమైనప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే ...
1. ఛాతీలో నొప్పి పెట్టడం
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం
3. మూత్రంలో రక్తం కనిపించడం
4. ఛాతీ, మెడ, చెవుల్లో ఇబ్బందిగా అనిపించడం
5. తలనొప్పి తీవ్రంగా రావడం
6. తీవ్రమైన అలసట
రక్త పోటు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువు వల్ల కూడా అధిక రక్తపోటు ఎక్కువవుతుంది. తగినంత వ్యాయామం చేయకపోతే ఇది అదుపులో ఉండదు. ఉప్పు తినడం చాలా వరకు తగ్గించాలి. పండ్లు తాజా కూరగాయలు తినేందుకే ఇష్టపడాలి. మద్యం, కాఫీ, ధూమపానం వంటి వాటికీ దూరంగా ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ నెలకి, రెండు సార్లు అయినా బీపీని చెక్ చేయించుకోవడం చాలా అవసరం. అలాగే హైబీపీ వారసత్వంగా కూడా వస్తుంది. కాబట్టి కుటుంబ చరిత్రలో ఎవరికైనా హై బీపీ ఉంటే తర్వాత తరాలు వారు జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి కూడా హైబీపీకి ముఖ్య కారణంగా చెప్పుకుంటారు.
Also read: గుండె వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ రోగాలు రాకుండా ఉండాలంటే దీన్ని తినండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Chinese Woman: షాపింగ్ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై
White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!
Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట
Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త
పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?