Phobia: ఇవన్నీ ఆహార ఫోబియాలు, మీకున్నాయేమో చెక్ చేసుకోండి
ప్రపంచంలో ఎన్నో రకాల ఫోబియాలు ఉన్నాయి. అందులో ఆహార సంబంధమైనవి కూడా ఉన్నాయి.
ఒక వస్తువు, వ్యక్తి, పని అంటే కలిగే భయాన్ని ఫోబియా అంటారు. ఈ ఫోబియాలు యాంగ్జయిటీ డిజార్డర్ కోవకే వస్తాయి. ఇవి సాధారణ జీవితానికి ఆటంకాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో ఎన్నో ఫోబియాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆహార సంబంధమైనవి. ఇవి చాలా మందిలో ఉండొచ్చు. ఇలాంటివి మీకూ ఉన్నాయేమో చూడండి.
సైబోఫోబియా
ఆహారం అంటే కలిగే భయాన్ని సైబోఫోబియా అంటారు. ఆహారం తినాలంటే కొంతమంది భయపడతారు. కారణం లేకపోయినా వారిలో మానసిక ఆందోళన పెరిగిపోతుంది. దీనివల్ల వారు పొట్ట నిండా ఏమీ తినలేరు ఇది ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.
లకానోఫోబియా
అనేక మంది కూరగాయలు తినడాన్నిఇష్టపడరు. వాటిని తినాలంటేనే చాలా భయపడతారు. వాటిని తింటే తమకేదో అవుతుందని అనుకుంటారు. కూరగాయలు తింటే అనారోగ్యం పావుతామనే భావన వారిలో నిండి ఉంటుంది. ఈ ఫోబియా ఉన్నవారికి కచ్చితంగా పోషకాహార లోపం ఉండే అవకాశం ఎక్కువ.
కోకోలాటోఫోబియా
చాక్లెట్లను ఇష్టపడని వారెవరు? కానీ వాటిని చూసి భయపడేవారున్నారు. తినాలంటే వణికిపోతారు. వాటిని కనీసం ఫ్రిజ్ లో కూడా పెట్టనివ్వరు. వింతగా అనిపించినా ఇది నిజం. అరుదుగా ఇలాంటి వ్యక్తులు తారసపడుతుంటారు. ఏ రకం చాకొలెట్ అయినా కోలోలాటోఫోబియాతో బాధపడేవారికి భయమే.
ఫ్రక్టో ఫోబియా
పండ్లు చూస్తే భయపడేవారూ ఉన్నారు. ఆ భయం పేరే ఫ్రక్టో ఫోబియా. ఈ ఫోబియా ఉన్న ఏ పండు కూడా తినరు. వారిలో పండ్లను తింటే తమకేదో అయిపోతుందనే భయం. అందుకే వారు ఎలాంటి పండ్లను ముట్టుకోరు.
మెజైరోకాఫోబియా
వీరు ఏం పెట్టినా తినేస్తారు, కానీ వండమంటే మాత్రం చాలా భయం. వెలిగించి ఉన్న స్టవ్ దగ్గరికి కూడా పోరు. కూరగాయలు కోయడం వంటివి కూడా ఇష్టపడరు.
ఫాగో ఫోబియా
ఇదో వింత భయం. వీరికి ఏదైనా మింగడం అంటే భయం. చివరికి నీళ్లు మింగాలన్నా ఫోబియానే. మింగితే గొంతులో ఏదైనా అడ్డుపడుతుందేమో అని వీరికి అతి భయం. ఈ ఫోబియా వల్ల వారు ఏ ఆహారాన్ని ఎంజాయ్ చేయలేరు.
ఇలాగే మరికొన్ని ఆహార సంబంధిత భయాలు ఉన్నాయి.
1. మెతి ఫోబియా - మద్యం తాగడమంటే భయం
2. ఇతియఫోబియా - చేపలంటే భయం
3. గ్యూమో ఫోబియా - రుచి చూడాలంటే భయం
4. ఎకెరోఫోబియా - పుల్లని పదార్థాలంటే భయం
Also read: మామిడి పండు మంచిదే, కానీ వీటితో కలిపి తినకూడదు