Sleeping Hours: తూచ్, 8 గంటల నిద్ర మెదడుకు సరైనది కాదట, కొత్త రూల్ చెప్పిన పరిశోధకులు
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు నిద్రపోవాలి? అని అడిగితే.. ఎనిమిది గంటలు చాలని అంటారు. కానీ, 8 చాలా ఎక్కువట. మరి, కరెక్టుగా ఎన్ని గంటలు నిద్రపోతే లాభం?
నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. బోలెడంత ఆరోగ్యం వచ్చేస్తుందనే భ్రమతో రోజంతా నిద్రపోయే ప్రయత్నం మాత్రం చేయకండి. అది మరింత ప్రమాదకరం. మనిషి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని ఇప్పటివరకు పరిశోధకులు, వైద్య నిపుణులు చెప్పారు. అయితే, తాజా పరిశోధనల్లో మాత్రం ఈ సంఖ్యను మార్చేశారు. మీ మెదడకు మేలు జరగాలంటే ఎనిమిది గంటల నిద్ర సరైనది కాదని చెప్పేశారు.
మనిషికి అతి నిద్ర లేదా అతి తక్కువ నిద్ర ఎప్పుడూ మంచిది కాదు. ఈ అలవాటు ఉన్నవారికి మెదడు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా అల్జీమర్స్, చిత్త వైకల్యం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 38 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గల 500,000 మంది మెదడులను స్కాన్ చేసి కొన్ని ఆసక్తికర విషయాలను కనుగొన్నారు.
ఈ సందర్భంగా రోజూ క్రమం తప్పకుండా ఏడు గంటల సేపు నిద్రపోవడం ఉత్తమం అని తెల్చేశారు. మీ మెదడు సక్రమంగా పనిచేయాలంటే అర్ధరాత్రిళ్లు లేదా తెల్లవారుజామున కాకుండా సరైన సమయాల్లో నిద్రపోయి, టైమ్‌కు మేల్కోవాలని పరిశోధకులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులకు నిద్ర చాలా ముఖ్యమని, దాని వల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని వెల్లడించారు. మంచి నిద్ర మెదడును శుభ్రపరుస్తుందని ‘నేచర్ ఏజింగ్’ జర్నల్‌లో ఈ స్టడీ రచయిత ప్రొఫెసర్ బార్బరా సహకియన్ వివరించారు.
Also Read: వేసవిలో బెస్ట్ ఫ్రూట్ ఇదే - బొప్పాయిలో ఇన్ని ప్రయోజనాలను మీరు ఊహించి ఉండరు
రాత్రి వేళ తగిన సమయంలో నిద్రపోవడం వల్ల మెదడుకు మన జ్ఞాపకాలను నిల్వ చేయడానికి, నరాలను కనెక్ట్ చేయడానికి, రిపేర్ చేయడానికి లేదా నిర్మించడానికి, హాని కలిగించే ప్రోటీన్‌లను తొలగించడానికి అనుమతిస్తుంది. అయితే, ఇది జరగడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. కాబట్టి, తగినంత నిద్రలేని వ్యక్తులు అవన్నీ కోల్పోతారు. ఇది జరగడానికి గంటలు పడుతుంది కాబట్టి తగినంత నిద్ర లేని వ్యక్తులు ప్రయోజనాలను కోల్పోతారు. అందుకే పెద్దలందరూ రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని స్టడీలో పేర్కొన్నారు. పిల్లలు ఎంత నిద్రపోతే అంత మంచిదని వెల్లడించారు.
Also Read: దంత సమస్యలతో గుండె జబ్బులు, ఈ అలవాట్లు వెంటనే మానుకోండి
ఈ పరిశోధనకు ముందు వైద్య నిపుణులు సూచించిన నిద్ర వేళలు ఇవే:
పుట్టినప్పటి నుంచి 3 నెలల వయసు: 14 నుంచి 17 గంటలు
4 నుంచి 11 నెలలు : 12 నుంచి 16 గంటలు
1 నుంచి 2 సంవత్సరాలు: 11 నుంచి 14 గంటలు
3 నుంచి 5 సంవత్సరాలు : 10 నుంచి 13 గంటలు
6 నుంచి 12 సంవత్సరాలు: 9 నుంచి 12 గంటలు
13 నుంచి 18 సంవత్సరాలు: 8 నుంచి 10 గంటలు
18 నుంచి 64 సంవత్సరాలు: 7 నుంచి 9 గంటలు
65 ఏళ్లపై బడిన వారు : 7 నుంచి 8 గంటలు