Divorce in the Air : Gen Zలకు సోకుతున్న డేంజర్ డిసీజ్- ట్రెండ్‌గా మారుతున్న డివోర్స్ ఇన్ ద ఎయిర్
Divorce : ఈ మధ్య సెలబ్రెటీలకు కొత్త డిసీజ్ వచ్చింది. అదే డివోర్స్. ఒకరి తర్వాత ఒకరు తమ డివోర్స్ని సోషల్ మీడియా వేదికలుగా చెప్పేస్తున్నారు. సెలబ్రెటీలకే కాదు.. కామన్ పీపుల్స్కి కూడా ఇది సోకేసింది.
Celebrity Divorces Impact on Social Media : సెలబ్రెటీల నుంచి.. సామాన్యుల వరకు ఈ మధ్య ఓ డిసీజ్ బారిన పడుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు దీని వ్యాప్తి తక్కువగానే ఉన్నా.. దాని తర్వాత ఇది కాస్త ఎక్కువగా వ్యాపిస్తుంది. అదే డివోర్స్. లవ్ ఇన్ ద ఎయిర్ ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు డివోర్స్ ఇన్ ద ఎయిర్ అయిపోంది. దీనివల్ల లవ్‌కి చెక్ పడి.. డివోర్స్ అనే వ్యాధి విజృంభిస్తోంది. ఇది ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందోనని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.
డివోర్స్ డిసీజ్ ఇప్పుడు మొదలైంది కాదు.. కానీ దాని వ్యాప్తి మాత్రం ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఐడియల్గా కనిపించిన ఎందరో ప్రముఖులు ఈ డివోర్స్ బారిన పడుతున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి వెల్లడించి.. డివోర్స్ ఎలా సోకిందో చెప్పకుండా.. చివర్లో మాత్రం మా ప్రైవసీని అర్థం చేసుకోమని కోరుతున్నారు. ఈ సమయంలో మాకు అండగా ఉండాలంటున్నారు.
సోషల్ మీడియాలో ఇంపాక్ట్..
ఓ వ్యక్తితో కలిసి ఉండాలా? విడిపోవాలా అనేది పర్సనల్ ఛాయిస్. కానీ ఇప్పుడు అలా అనుకోవట్లేదు. సోషల్ మీడియాలో ఏ సెలబ్రెటీ డివోర్స్ పోస్ట్ పెట్టినా.. అతను లేదా ఆమెను డిఫెండ్ చేస్తూ.. వారి డివోర్స్ వెనుక రీజన్స్ ఇవేనంటూ నెటిజన్లు కామెంట్లలో కొట్టేసుకుంటున్నారు. వాళ్ల పర్సనల్ సమస్యల్నీ వీరు సొంతం చేసుకుంటున్నారు. రిలేషన్ చెడిపోవడానికి అమ్మాయిదే తప్పు అని కొందరు.. లేదు లేదు అతను చేసిందే ఇదంతా అనుకుంటూ కామెంట్లలో వార్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. మావ నేను ఇంక పెళ్లి చేసుకోను రా. సింగిల్‌గా చచ్చిపోతా అనుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
నెక్స్ట్ జనరేషన్లో కష్టమే..
ఈ డివోర్స్ కేసులు పెరిగే కొద్ది.. వచ్చే జనరేషన్లో పెళ్లిపై ఉన్న గౌరవం తగ్గిపోతుందంటున్నారు పలువురు నిపుణులు. విడిపోయేవారు కొన్నేళ్లు అయినా కలిసే ఉండి.. తమ రిలేషన్‌ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నారు కానీ.. తర్వాత జనరేషన్లో ఈ తరహా మైండ్ సెట్ ఉండకపోవచ్చు. నీకు నాకు గొడవ అయిందా విడిపోదామనే ధోరణి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి అయిన జంట విడిపోవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. అలాగే కలిసి ఉండేందుకు కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకప్పుడు డివోర్స్ రేట్ తక్కువగా ఉన్నా.. ఇప్పుడు ఇది పెరుగుతుంది. గట్టిగా చెప్పాలంటే.. అప్పట్లో డివోర్స్ జరిగినా.. దాని ఇంపాక్ట్ అనేది సామాన్యులపై ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము విడిపోతున్నామంటూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల ఎందరో ఇంపాక్ట్ అవుతున్నారు.
గతంలో సెలబ్రెటీలు విడిపోతే ఎక్కువమందికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల గతంలో విడిపోయిన వారు కూడా తెరపైకి వస్తున్నారు. పైగా విడిపోయిన వారిలో ఎవరో ఒకరు టోటల్‌గా టార్గెట్ అవుతున్నారు. చివరికి ఎలా మారిపోయిందంటే.. సోషల్ మీడియాలో పార్టనర్‌తో లేకుండా ఫోటో పెట్టినా.. లేదా వేరే వ్యక్తితో ఫోటో పెట్టినా.. నెటిజన్లే వారు డివోర్స్ తీసుకుంటారని డిసైడ్ చేసేస్తున్నారు.
మేజర్ రోల్ ప్లే చేస్తోందిగా..
ఒకప్పుడు బంధంలో కలిసి ఉండాలన్నా.. విడిపోవాలన్నా కుటుంబం మేజర్ రోల్ ప్లే చేసేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వీరు ఏమి పోస్ట్ చేస్తున్నారనేది పక్కన పెడితే.. వీరు సోషల్ మీడియాలో చూస్తున్న కంటెంట్ కూడా రిలేషన్ షిప్‌పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ వ్యాధికి ఎలాగో మందులు ఉండవు. కానీ.. ఎవరో పర్సనల్ ప్రాబ్లమ్‌ని.. తమ పర్సనల్ ప్రాబ్లమ్‌గా తీసుకోకుంటే.. ఈ వ్యాధి ఇంపాక్ట్ తగ్గుతుంది.
Also Read : సింగిల్‌గా ఉంటే మంచిదా? కాదా? దానివల్ల కలిగే నష్టాలు, లాభాలు ఇవే