Happy Singles Day 2024 : సింగిల్‌గా ఉంటే మంచిదా? కాదా? దానివల్ల కలిగే నష్టాలు, లాభాలు ఇవే
Happy Singles Day : ప్రేమికులకు, ఫ్రెండ్స్‌కు ఓ డే ఉన్నట్టే సింగిల్స్‌కి కూడా ఓ డే ఉంది. అదే నవంబర్ 11. అయితే సింగిల్‌గా ఉండడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా? లేక ఇబ్బందులే ఎక్కువున్నాయా?
Singles Day 2024 : ఇన్‌స్టాగ్రామ్‌లో కపుల్ రీల్స్ వస్తే.. వాటికింద రేయ్ నేను సింగిల్.. నాకే ఎందుకు ఇలాంటి రీల్స్ వస్తాయంటూ కామెంట్లు ఎక్కువగా వస్తుంటాయి. ఫిబ్రవరి 14 వస్తే చాలు.. సోషల్ మీడియా నిండా.. సింగిల్స్ కష్టాలు మీకేమి తెలుసంటూ.. పోస్టులు వస్తాయి. అయితే ఈ సింగిల్స్‌కి కూడా ఓ రోజు ఉంది. నవంబర్ 11వ తేదీని సింగిల్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఈ సింగిల్స్ డే ఎలా ప్రారంభమైంది? ఈరోజు ఏమి చేస్తారు? నిజంగానే సింగిల్స్‌కి కష్టాలుంటాయా? లేదా Proud to be Single అనేది నిజమేనా?
సింగిల్స్ డే చరిత్ర..
నాన్జింగ్ యూనివర్సిటీలో 1993లో నలుగురు యువకులు.. వాలెంటైన్స్ డేకి వ్యతిరేకంగా.. తాము సింగిల్ అనే చెప్పుకుంటూ.. దానిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ సింగిల్స్ డేని ప్రారంభించారు. చైనాలో అయితే ఈ రోజును హాలీ డే ఇచ్చి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి సింగిల్‌గా ఉండడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా? సింగిల్‌గా ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
బెనిఫిట్స్
సింగిల్‌గా ఉండేవారికి ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారికోసం తమ ఇష్టాలు వదులుకోవాల్సిన అవసరం రాదు. పర్సనల్ గ్రోత్‌పై ఫోకస్ చేసుకుంటారు. తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఆర్థికంగా ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరి కోసం ఎలాంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా.. ఎక్కడికైనా.. ఎలా అయినా వెళ్లొచ్చు. తమకోసం తప్పా.. ఇతరులకోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ప్రొఫెషనల్ గోల్స్‌ని రీచ్ అవ్వడానికి ఎలాంటి డిస్ట్రాక్షన్లు ఉండవు.
సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవడం నేర్చుకుంటారు. నచ్చిన పనులు చేసుకుంటారు. హాబీలను వదులుకోవాల్సిన అవసరం ఉండదు. రిలేషన్షిప్లో ఉండే సమస్యలు, చిరాకులు ఉండవు. నచ్చిన విషయాల్లో కాంప్రిమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సెల్ఫ్ లవ్‌కి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. మీ వర్త్ మీకు బాగా తెలుస్తుంది. ఇవన్నీ సింగిల్‌గా ఉంటే వచ్చే బెనిఫిట్స్ అయినా.. సింగిల్‌గా ఉండడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
సింగిల్‌గా ఉండడం వల్ల కలిగే ఇబ్బందులు
కొన్ని సందర్భాల్లో ఎమోషనల్‌గా లోన్లీగా ఉంటారు. ఆ సమయంలో మీకు ఓ తోడు కావాలి అనిపించొచ్చు. సొసైటీ ప్రెజర్ ఉంటుంది. సింగిల్‌గా ఉండడం మీకు నచ్చే విషయమైనా.. సింగిల్‌గా ఉన్నావు.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ.. ఫ్యామిలీ సొసైటీ నుంచి ప్రెజర్ రావొచ్చు. ఒక్కోసారి ఆర్థికంగా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఎదురు కావొచ్చు. అప్పుడు మీకు ఓ పార్టనర్ తోడుగా ఉంటే.. లైఫ్ బాగుంటుందని అనిపించొచ్చు.
పర్సనల్, ఫ్యామిలీ సమస్యలను షేర్ చేసుకునే పర్సన్ ఉండరు. ఒక్కరే ప్రెజర్‌ని తీసుకోవాల్సి వస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఉండొచ్చు. ఎంత హాలీడే అయినా.. స్పెషల్ డే అయినా.. ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువ కావొచ్చు. హెల్త్ బాలేనప్పుడు ఎవరైనా పక్కన ఉంటే బాగుండు అనే కోరిక ఎక్కువ అవుతుంది. ఇలాంటివన్నీ సింగిల్‌గా ఉంటే ఇబ్బంది పెడుతుంటాయి.
సింగిల్‌గా ఉంటే చేయాల్సిన పనులివే..
సింగిల్‌గా ఉన్నప్పుడు పర్సనల్ గ్రోత్‌పై దృష్టి పెట్టాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలి. మీ హాబీలను వదులుకోకూడదు. ఫ్రీ టైమ్‌లో వాటిపై ఫోకస్ చేయాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. ఇతరుల నుంచి మీరు కొన్ని బౌండరీలు పెట్టుకోవాలి. పాజిటివ్‌గా ఉండాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కంగారు పడిపోకూడదు. ఓపెన్ మైండ్‌తో ఉంటే.. సమస్యలు ఎక్కువ రాకుండా ఉంటాయి.
Also Read : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే