డివోర్స్ తర్వాత, బ్రేకప్ తర్వాత మరొకరి త్వరగా నమ్మడం అంత సులువు కాదు. లైఫ్‌లో ముందుకు వెళ్లాలని డివోర్స్ తర్వాత డేట్‌కి వెళ్తే మాత్రం ఈ టిప్స్ ఫాలో అవ్వండి. డివోర్స్ ఎందుకు జరిగిందనే విషయం మీరు డేట్‌కి వెళ్లిన వ్యక్తితో నిజాయితీగా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మీరు వారితో రిలేషన్ కంటిన్యూ చేయాలో వద్దో క్లారిటీ వస్తుంది. పార్టనర్స్ మధ్య పోలికలు గుర్తించడం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. మీరు పార్టనర్ నుంచి ఏమి కోరుకుంటున్నారో.. వాటిని స్పష్టంగా తెలియజేయండి. తమ గురించి ఏమైనా చెప్తుంటే ఓపికగా వినండి. దీనివల్ల వారిపై మీకో అభిప్రాయం రావొచ్చు. నెగిటివ్ థాట్స్‌కి బాయ్ చెప్పి.. పాజిటివ్ విషయాల గురించి ఆలోచించండి. (Images Source : Unsplash)