అన్వేషించండి

ఫ్రెంచ్ పిల్లలు వైన్ తాగుతారా? చిన్న వయస్సులో మద్యం తాగడం మంచిదేనా?

కుటుంబ పరిధిలో అయినా సరే ఎంత పరిమాణం మద్యం తీసుకునే దానిమీద నియంత్రణ లేకపోవడం గురించి ఇప్పుడు ఫ్రెంచ్ వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

ఫ్రాన్స్‌లో పిల్లలు వైన్ తాగుతారట. ఔనండి, నిజమే. ఇప్పటికీ ఫ్రెంచ్ కుటుంబాలు ఫ్యామిలీ ఫంక్షన్లలో పిల్లలకు మద్యం తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇదేం చోద్యం అనుకుంటున్నారా? అయితే మీరు ఫ్రెంచ్ కల్చర్‌కు.. వైన్, ఆల్కహాల్‌కు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. 

పారీస్‌లో 1956 వరకు మధ్యాహ్న భోజనంలో వాటర్ కట్ వైన్ తాగేందుకు స్కూళ్లలో కూడా అనుమతి ఉండేది. కానీ అప్పట్లో పాఠాశాలల్లో వైన్ నిషేధించాలని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం చాలా మంది తల్లిదండ్రులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పట్లో వైన్ పిల్లల ఎదుగుదలకు మంచిదని, వారిని బలంగా తయారు చేస్తుందని నమ్మకం ఉండేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది పేరెంట్స్ వ్యతిరేకించాలని అనుకున్నారు కూడా. 1979లో స్కూల్ క్యాంటీన్ లో 14 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం సర్వ్ చెయ్యటం నిషేధించారు.  అయితే ఈ చట్టాలు కేవలం స్కూల్ లో వైన్ సర్వ్ చెయ్యటం గురించి మాత్రమే. ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు 18 ఏళ్లలోపు వారు మద్యం తీసుకోకూడదనే నిర్దిష్ట చట్టం లేదు. అయితే మైనర్లు మద్యం కొనడం, మైనర్లకు మద్యం అమ్మడం నిషేదం.

18 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు వారి తల్లిదండ్రులు లేదా గార్డియన్ల సంరక్షణలో ఉంటారు. తల్లిదండ్రులకు వారి పిల్లలకు మద్యం అందుబాటులో ఉంచాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. కానీ వారు పిల్లలకు మద్యం తీసుకునే అనుమతి ఇస్తే పిల్లల సంరక్షణ హక్కు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫ్రెంచ్ పిల్లలు ప్రతి రోజు వైన్ తాగుతారని కాదు.. కానీ ఫ్రెంచ్ కుటుంబాల్లో మద్యపానం ఎదుగుదలలో భాగం అని ఇప్పటికీ నమ్ముతారు. చాలా అరుదుగా గెట్ టుగెదర్స్, చిన్నచిన్న ఫ్యామిలీ పార్టీలలో పిల్లలకు వైన్‌ను అనుమతిస్తారు.

ఇప్పుడు కొత్త అధ్యయనాలు ఇలా చిన్నతనంలోనే వైన్ తాగడం తెలిసిన పిల్లలు భవిష్యత్తులో ఆల్కాహాలిక్స్ గా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నాయి. అంతేకాదు ఆల్కాహాలిక్ లలో సాధారణంగా కలిగే కాలేయ, గుండె సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్, మరికొన్ని యూరోపియన్ దేశాల్లో తల్లిదండ్రులు తమ అడాలసెంట్ పిల్లలను వైన్ తాగేందుకు అనుమతిని ఇస్తున్నారు. ఇది భవిష్యత్తులో వారికి మద్యం వాడకంలో బాధ్యత నేర్పుతుందని కొంత మంది ప్రోత్సహిస్తున్నారట.

కానీ అడాలసెంట్ వయసులో మద్యం తీసుకోవడం రకరకాల ఆరోగ్య, సామాజిక సమస్యలకు కారణం కావచ్చు. యూకేలో ప్రతి ఏడుగురు ఆల్కహాలిక్స్‌లో ఒకరు 11 సంవత్సరాలకు ముందు నుంచే మద్యం తీసుకోవడం మొదలు పెట్టిన వారే కావడం గమనార్హం. డ్రింకావేర్ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో 15 సంవత్సరాల వయసులో 70 శాతం మంది మద్యం తీసుకోవాలని ప్రయత్నించారట. ఆర్కైవ్స్ ఆఫ్ డిసీజ్ ఇన్ చైల్డ్ హుడ్ అనే జర్నల్ లో ఫ్రెంచ్ ఫ్యామిలి డ్రింకింగ్ అపోహను ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారని ఒక ఆర్టికల్ లో ప్రచురించారు.

Also Read: మీరు తందూరి చికెన్ ప్రియులా? జాగ్రత్త దాని వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువేనట

చిన్నతనంలోనే కొద్ది పాటి వైన్ తాగడం పిల్లలకు నేర్పిస్తే.. భవిష్యత్తులో వారికి దాన్ని ఎంత మేరకు వాడవచ్చు అనే అవగాహన కలుగుతుందనేది ప్రెంచ్ ఫ్యామిలీ అపోహ అని చెప్తారు. ఆల్కాహాలిక్ మరణాలు పారీస్‌లోనే ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు కూడా చెబుతున్నాయి. అందుకే పిల్లలకు ఆల్కాహాల్ ఇవ్వడానికి ముందు తల్లిదండ్రులకు దాని ప్రభావం భవిష్యత్తులో పిల్లల మీద ఏ మేరకు ఉంటుందో అవగాహన కలిగించడం అవసరమని యూకే ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. కనీసం 15 సంవత్సరాల వయసు వచ్చే వరకైనా వారికి మద్యాన్ని అనుమతించకూడదని N.H.S గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి. 15 నుంచి 17 సంవత్సరాల లోపు వారు వారానికి ఒక్కసారికి మించకుండా మద్యం తీసుకునేలా పరిమితులు విధించాలని కూడా సూచిస్తున్నారు. అది కూడా తప్పని సరిగా పేరెంట్స్ లేదా గార్డియన్ల సమక్షంలో మాత్రమే అని చెబుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Embed widget