అన్వేషించండి

Dark Side of Rave Parties : రేవ్ పార్టీలో ఏమి చేస్తారో తెలుసా?  పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉన్న డిఫరెన్స్ అదే

Rave party meaning in Telugu : పార్టీలందూ.. రేవ్ పార్టీలు వేరయా అంటారు పోలీసులు. ఎక్కడా దీని గురించి తెలిసినా వెళ్లడం.. అనంతరం దాని గురించి పెద్ద రచ్చ జరగడం కామన్. ఇంతకీ ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి?

Things to Do at Rave Parties : సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు తరచూ పార్టీలు చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకోవడానికి సెలబ్రెటీలే ఏముంది కానీ.. అందరూ తరచూ వివిధ కారణాలతో పార్టీలు చేసుకుంటారు. కానీ అలాంటి వాటిలో పోలీసులు ఎక్కువగా ఇన్​వాల్వ్ కారు. మరి ఈ రేవ్​ పార్టీలపై ఎందుకు అంత ఆసక్తి చూపిస్తారు. తాజాగా బెంగుళూరులోని రేవ్ పార్టీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉండే డిఫరెన్స్ ఏంటి? అసలు రేవ్ పార్టీలో ఏమి చేస్తారు?

కొంతమంది కలిసి ఓ అకేషన్​ని సెలబ్రేట్ చేసుకుంటే దానిని పార్టీ అంటారు. అలాంటి పార్టీల్లో రేవ్ పార్టీ కూడా ఒకటి. దీనిలో కొంతమంది సభ్యులు కలిసి.. సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ.. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్​(EDM) తో నిండి ఉంటుంది. ఎప్పుడూ ఊహించని ఓ ట్రాన్స్​లోకి మిమ్మల్ని తీసుకుపోతుంది. ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ ఒకే రిథమ్​తో.. డీజేలు చేసే స్పిన్నింగ్ ట్రాక్​లతో ఎంజాయ్ చేస్తూ.. మరో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇది కేవలం పార్టీ అనేకంటే.. ఓ అనుభవంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. 

బౌండరీలు లేని లోకం అది..

రేవ్ పార్టీలో బయటి ప్రపంచంలోని నియమాలు వర్తించవు. సొంతంగా.. మీకు నచ్చినట్టు ఉంటూ.. మ్యూజిక్​ని ఎంజాయ్ చేయవచ్చు. మీ అభిరుచిని పంచుకునే ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ఎనర్జీని ఒకరినుంచి మరొకరికి ట్రాన్ఫర్ చేయడం, పూర్తిగా ఎంజాయ్ చేసే వాతావరణం ఈ పార్టీల్లో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తరహా పార్టీలో ఇవే చేయాలి.. ఇవి చేయకూడదనే నిబంధనలు ఏమి ఉండవు. నచ్చినవారితో నచ్చినంత సేపు గడిపేయొచ్చు. 

ఎప్పుడు మొదలైంది అంటే.. 

ఈ రేవ్ పార్టీ కల్చర్ 1980లో చికాగోలో ప్రారంభమైంది. అప్పుడు ఇది నైట్ కల్చర్ కాదు. డే టైమ్​లో కూడా చేసుకునేవారు. డీజేలు కొత్త బీట్​లు చేయడం, ఎనర్జీని పెంచే వాతావరణాన్ని సృష్టించడం చేసేవారు. ఇంతకు ముందు ఎప్పుడూ వినని మ్యూజిక్ దానిలో ఉండేది. అనంతరం యూకే చేరుకుంది. యూకేలో ఈ రేవ్ పార్టీ తన రూపాన్నే మార్చేసింది. 

పార్టీ లొకేషన్ షేర్ చేసేది అప్పుడే..

యూకేలో రేవ్​పార్టీలు భారీగా చేసేవారు. రాత్రిళ్లు చేసే డ్యాన్స్ పార్టీలకు ఇవి ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. సీక్రెట్ ప్లేస్​లలో వీటిని నిర్వహించేవారు. అయితే ఈవెంట్​కు వచ్చే కొన్ని గంటల ముందు మాత్రమే లొకేషన్ షేర్ చేస్తారు. ముందే రివేల్ చేస్తే పార్టీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భావిస్తారు. ఈ కల్చర్​లో కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు, డ్రింక్స్ చేరడంతో సంస్కృతికి ఈ పార్టీలు విరుద్ధంగా మారిపోయాయి. త్వరిత కాలంలోనే ప్రపంచంలోని ప్రతిమూలకు ఈ పార్టీ కల్చర్ వ్యాపించింది. 

కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. అంతకుమించి.. 

రేవ్ పార్టీలు కేవలం మ్యూజిక్ అనుభవమే కాదు.. రేర్ అనుభవాన్ని ఇస్తాయి. డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ వినడమే కాదు.. మీ మనసుకు నచ్చినట్టు ఉండడమనేదే ఈ పార్టీల ప్రధాన లక్షణం. అర్థరాత్రి ఆపే పార్టీలు కావు ఇది. ఉదయం వరకు రేవర్​లలో ఉత్సాహాన్ని పెంచే ఓ మాయలోకంగా చెప్పవచ్చు. ఇంద్రియాలకు ఈ పార్టీలు విందునిస్తాయనే చెప్పవచ్చు. తెలియకుండానే మీలో ఎనర్జీ, ఉల్లాసం పెరుగుతుంది. ఈ పార్టీల గురించి బయటకు తెలియకుండా మ్యూజిక్ వినేందుకు ఎక్కువగా హెడ్ ఫోన్స్ వినియోగిస్తారు. పార్టీ అయ్యేంత సేపు ఈ హెడ్ ఫోన్స్​లో మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. 

ఒకప్పుడు చిల్​ అవుట్ జోన్​లు

చిల్​ అయ్యేందుకు ఒకప్పుడు రేవ్ పార్టీలు జరిపేవారు.చాలామంది ఈ పార్టీలోని రేవర్​లు లైఫ్​ టైమ్​ ఫ్రెండ్స్​గా మార్చుకునేవారు. ఇప్పుడు మాదక ద్రవ్యాలు, మందు, అసాంఘిక కార్యకలాపాలకు ఇవి వేదికగా మారాయి. ఎలాంటి హద్దులు దీనిలో ఉండవు కాబట్టి.. కొందరు ఈ పార్టీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే దీనిపై పోలీసులు నిఘా పెట్టడం ప్రారంభించారు. 

Also Read : రాత్రుళ్లు త్వరగా నిద్రరావట్లేదా? అయితే ఈ టిప్స్​తో హాయిగా నిద్రపోండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget