Viral Video: ఒంటికి నిప్పటించుకుని పరుగులు పెట్టిన వధూవరులు, ఇదేం పిచ్చిరా బాబు
పెళ్లి గుర్తుండి పోయేలా చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ, మరీ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నాయి కొన్ని జంటలు.
తమ రిసెప్షన్లో వధూవరులు చేసిన స్టంట్ వైరల్ గా మారింది. ఇద్దరు స్టంట్ మాస్టర్లు పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటదా అనిపించిది చూసే వాళ్లకి. ఇంతకీ వాళ్లేవరంటే... గేబ్ జాసెప్, అంబిర్ బాంబిర్. వీరిద్దరూ అమెరికాలో నివసిస్తున్నారు. హాలీవుడ్లో స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఒక సినిమాకు వర్క్ చేసే సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇక రిసెప్షన్ సమయంలో తమదైన స్టైల్ లో స్టంట్ ప్రదర్శించారు ఈ జంట. అది చూసి అవాక్కయ్యారు పెళ్లికి హాజరైన అతిధులు.
ఏం చేశారంటే...
స్టంట్ మాస్టర్లుగా ప్రఖ్యాతి చెందిన వీరిద్దరూ తమ పెళ్లిలో ఎవ్వరూ మర్చిపోలేని రీతిలో స్టంట్ చేయాలనుకున్నారు. పెళ్లి దుస్తుల్లో పూల బొకేతో వధువు నిల్చుంది. ఆమె చేయి పట్టుకుని వరుడు నిల్చున్నాడు. ఆ బొకేకు నిప్పు అంటించారు. ఆ నిప్పు అలా పాకి వధూవరుల వీపు భాగాలకు అంటుకుంది. అలా వెనుక నుంచి నిప్పులు చిమ్ముతుంటే ఇద్దరూ హూందాగా నడుచుకుంటూ కొంత దూరం వచ్చారు. తరువాత తమ మోకాళ్లపై కింద కూర్చోగానే ఆ నిప్పులను ఆర్పేశారు స్నేహితులు. ఇందులో ఎవరికీ గాయాలవ్వలేదు.
చూసే వాళ్లు మాత్రం వధూవరుల జుట్టు అంటుకుంటుందేమోనని భయపడ్డారు. కానీ వారు జుట్టుకుని, ముఖానికి యాంటీ బర్న్ జెల్ రాసుకున్నారని చెబుతున్నారు. అమెరికాలోని టిక్ టాక్ లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఏకంగా 13 మిలియన్లకు పైగా జనాలు ఈ వీడియోను చూశారు. కొంతమంది ఈ వీడియోను చూసి ‘ఇంత డేంజరస్ పనులు అవసరమా’ అని కామెంట్ పెడితే, మరికొందరు ‘స్టంట్ మాస్టర్లు పెళ్లాడితే ఇలా ఉంటదన్నమాట’ అని కామెంట్లు పోస్టు చేశారు.
వధూవరులిద్దరూ స్టంట్ మాస్టర్లు కావడం, ఇలాంటి స్టంట్లు వారికి అలవాటు ఉన్నవి కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ పని చేశారు. ఇంకెవరూ ఇలాంటి వీడియోలు చూసి స్టంట్లు చేయకండి.
View this post on Instagram
Also read: మనిషి ఆకారంలో ఊరు, గ్రహాంతరవాసుల పనే అంటున్న గ్రామస్థులు
Also read: ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్, వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?