అన్వేషించండి

Diwali Outfit Ideas 2023 : దీపావళికి మీరు ఈ డ్రెస్​ల్లో సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్​గా కనిపిస్తారు తెలుసా?

Diwali Outfit Ideas 2023 : దీపావళి సమయంలో మీ డ్రెస్ అందరిలోనూ మిమ్మల్ని ప్రత్యేకంగా చూపించేదై ఉండాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.

Diwali Outfit Ideas : దీపావళి దగ్గరికి వచ్చేస్తుంది. ఆ సమయంలో మీరు కూడా ఓ దివాలాగే కనిపించాలనుకుంటారు. అయితే పండుగకు ఎలాంటి దుస్తులు ధరించాలో అనే ప్రశ్నకు అమ్మాయిల దగ్గర సమాధానమే ఉండదు. ఎందుకంటే.. ఏ డ్రెస్​ వేసుకుంటే ఎలా ఉంటామో అనే భయంతోనే కన్ఫ్యూజ్​ అవుతూ ఉంటారు. మీరు కూడా ఆ జాబితాలో ఓ భాగమేనా? అయితే ఇక్కడ మీకు కొన్ని ఔట్​ఫిట్​ ఐడియాలున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ దివాళీకి ఎలాంటి ఔట్​ఫిట్​లు ఎంచుకోవాలో.. వాటితో ఎలా రూల్​ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

అనార్కలీ డ్రెస్.. 

కాలాతీతమైన ట్రెడీషనల్​ డ్రెస్​లకు అనార్కలీ పెట్టింది పేరు. ఏ పండుగకైనా.. అనార్కలీ మిమ్మల్ని అందరినుంచి ప్రత్యేకం చేస్తుంది. మీ అందాన్ని రెట్టింపు చేయడంలో ఇది ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. ఫ్లోర్ లెంగ్త్​ అనార్కలి డ్రెస్​లు మిమ్మల్ని ట్రెడీషనల్​గా అదే సమయంలో హాట్​గా కూడా చూపిస్తాయి. ఇవి మీరు ఇంట్లోనే ఉండి పండుగ చేసుకున్నా.. లేదంటే పండుగ కదా ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా కంఫర్ట్​గా ఉంటాయి. 

అయితే మీరు కూడా ఈ దివాళికి అనార్కలీ వేసుకోవాలని చూస్తున్నారా? అయితే షిఫాన్, జార్జెట్​ వంటి తేలికైన, కంఫర్ట్​నిచ్చే దుస్తులను ఎన్నుకోవచ్చు. ఇది మిమ్మల్ని సాంప్రదాయకంగానే కాదు.. ఆధునికంగా కనిపించేలా చేస్తుంది. ఈ డ్రెస్​ ఎంచుకుంటే బ్యాక్ డీప్​ కట్​, ఫుల్​ హ్యాండ్స్​తో వచ్చే వాటిని ఎంచుకోవచ్చు. దీనిపై మీరు దుపట్టా వేసుకోవాలా? వద్దా? అనేది పూర్తిగా మీ వ్యక్తిగతమే. ఒకవేళ మీరు దుపట్టా వేసుకోవాలని చూస్తున్నట్లయితే.. షీర్, ఫ్లోర్ లెంగ్త్ దుపట్టాలు ఎంచుకోండి. భారీ జుంకాలు పెట్టుకుని.. మీ హెయిర్ లీవ్​ చేస్తే.. మిమ్మల్ని బీట్​ చేసేవారుండరు. ట్రెండీగా కనిపించాలనుకుంటే.. దుపట్టా, చురీదార్​ లేకుండా గౌనులాగా కూడా దీనిని ధరించవచ్చు. 

చీరలు..

పండుగ కళను చీరలే తీసుకొస్తాయంటే అతిశయోక్తి కాదు. పైగా ఇవి ఫ్యాషన్​కు అనుగుణంగా.. కొత్త లుక్స్, వెరైటీ బ్లౌజ్​లతో వస్తున్నాయి. కాబట్టి అటు ట్రెండీగా, ఇటు ట్రెడీషనల్​గా కూడా అదిరే లుక్స్ ఇస్తాయి. దీపావళి సమయంలో మీరు కూడా ఓ అందమైన క్రాకర్​గా కనిపించాలనుకుంటే.. పట్టు వస్త్రాలు, బన్సారీలు ఎంచుకోవచ్చు. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే.. మీరు సింపుల్​ శారీలకు ట్రెండీ జ్యూవెలరీ యాడ్ చేయవచ్చు. 

చీరల్లో నలుపు లేదా గోల్డెన్ రంగు శారీలను ఎంచుకోవచ్చు. లేదంటే కుంకుమ ఎరుపు రంగు చీర కూడా మిమ్మల్ని అందరిలోనూ అందంగా కనిపించేలా చేస్తుంది. ఇవే కాకుండా పాస్టెల్ కలర్స్​ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్​లో ఉన్నాయి. వాటిపైన మంచి డిజైన్స్ ఉన్న శారీలను దీపావళికి ఎంచుకోవచ్చు. త్రి క్వార్టర్ స్లీవ్స్​తో కూడిన బ్లౌజ్స్​తో మీరు శారీని జత చేయవచ్చు. ప్రీ డ్రేప్​ శారీలు, ధోతి శైలి చీరలు, 1 మినిట్ శారీలను కూడా మీరు ఎంచుకోవచ్చు. కొన్ని బ్లౌజ్ ప్లేస్​లో షర్ట్ మోడల్స్ వస్తున్నాయి. 

షరారా 

నలుగురిలో మీరు భిన్నంగా.. అందంగా కనిపించేందుకు మీరు షరారాలు ఎంచుకోవచ్చు. ఇవి వివాహాలు, ఈద్​లకు మాత్రమే వేసుకుంటారనుకుంటే అది పొరపాటే. షరారాలను ప్రతి తెలుగు పండగల సమయాల్లో ఉపయోగించవచ్చు. దానిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పాయింట్. ఇదో ఫ్యాషన్ డ్రెస్ అనుకుంటారు కానీ.. దీని ఫ్లేర్డ్ ప్యాంట్ మీకు ట్రెడీషనల్​ లుక్​ ఇస్తుంది. ఇలాంటి ప్యాంట్​ను మీరు పొడవైన కుర్తాతో జత చేయవచ్చు. జరీ, పూసలతో మరింత అందంగా మీ డ్రెస్​ను డిజైన్ చేసుకోవచ్చు. బాలీవుడ్​లో మొదలైన ఈ ట్రెండ్​.. మెల్లిగా తెలుగు రాష్ట్రాలకు సైతం వస్తుంది. కొందరు షరారాతో చీరను జత చేసి కొత్తగా ట్రై చేస్తున్నారు. వాటికి మీరు లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. మెడలో ఏమి వేసుకోకుండా.. అందమైన బ్యాంగిల్స్​తో మీ లుక్​ సెట్ చేసుకోవచ్చు. 

ఇవేకాకుండా మీరు పలాజో, కుర్తీలను పండుగ సమయంలో ఎంచుకోవచ్చు. ప్రింటెండ్, ఎంబ్రాయిడరీ చేసిన కేప్​ టాప్​లు కూడా మీకు ట్రెండీ, ట్రెడీషనల్​ లుక్ ఇస్తాయి. ఈ టాప్​లను మీరు పొడవైన స్కర్ట్​లతో జత చేయవచ్చు. ఎథ్నిక్ ట్విస్ట్​ ఉన్న జంప్​ సూట్​లు కూడా మీరు ట్రై చేయవచ్చు. భారీ ఆభరణాలతో మీరు దీనిని జత చేయవచ్చు. ఈ డ్రెస్​లు మిమ్మల్ని సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్​ వావ్​ అన్నట్లు చూపిస్తాయి. 

Also Read : దీపావళికి ఈ క్రియేటివ్ ఐడియాలతో మీ ఇంటిని ఇలా అందంగా అలంకరించేయండి

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget