Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్ కావాలా? ఇండియన్స్‌కి క్రేజీ ఆఫర్ ఇచ్చిన థాయ్‌లాండ్
Thailand offers a crazy offer to Indians : మీరు ఎక్కువగా టూర్స్‌కి వెళ్తారా? పోని వెళ్లాలనుకుంటున్నారా? అయితే వీసా లేకుండా థాయ్‌లాండ్ వెళ్లిపోవచ్చు తెలుసా?
Thailand offers a crazy offer to Indians : దాదాపు ఇండియాను వదిలి ఏ పొరుగు దేశానికి వెళ్లాలన్నా.. వీసా అవసరం. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే మీకు వీసా లేకపోయినా పర్లేదు.. ఈ ఆరునెలల్లోనే ఎప్పుడైనా మీరు మా దేశానికి రావొచ్చు అని పిలుస్తుంది ఓ దేశం. వీసా లేకుండా ఎందుకు ఇండియన్స్‌ని రమ్మంటోంది. అలా వెళ్లొచ్చా? ఇలా వెళ్లడం వల్ల వాళ్లకేమి కలిసి వస్తుంది? ఆ దేశం పేరేమిటి? ఇంతకీ ఇది నిజమా? అబద్ధమా? అని ప్రశ్నలు మీలో మెదులుతున్నాయా? అయితే దానికి ఆన్సర్ 100 శాతం నిజం.
రీజన్ అదే..
థాయ్‌లాండ్ దేశం.. భారతీయులు వీసా లేకుండా కూడా మా దేశానికి రావొచ్చు. వచ్చే ఆరు నెలల్లో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వీసా లేకుండా రావొచ్చు అంటూ బంపర్ ఛాన్స్ ఇచ్చేసింది. ఆ దేశంలో టూరిజం మార్కెట్‌ను పెంచుకునేందుకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ సంవత్సరం సుమారు 28 మిలియన్ల రాకపోకలను థాయ్‌లాండ్ లక్ష్యంగా చేసుకుంది. దేశంలో ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా థాయ్‌లాండ్ ఆర్థిక వ్యవస్థ భారీగా ఎగుమతిపై ఆధారపడి ఉంది. ఏ దేశ ఆర్థిక వృద్ధిలో అయినా పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఇండియన్స్‌ను వీసా లేకుండా తమ దేశానికి రమ్మంటుంది పర్యాటక రంగం.
ఆరు నెలలు..
ఇంతకీ దీనికి గడువు ఏమైనా ఉందా? మనం ఎప్పుడు వెళ్లొచ్చు? అంటే దీనికి గడువు ఉంది. మనం నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు ఆరునెలల పాటు.. థాయ్‌లాండ్‌కు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. టూరిజం సీజన్ దగ్గర్లోనే ఉంది కాబట్టి.. మీరు వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఈ దేశాన్ని విజిట్ చేయవచ్చు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించుకోవాలనే లక్ష్యంతో థాయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
చైనీస్ కోసం కూడా..
అయితే ఆ దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదేమి కొత్తకాదు. 2019లో రికార్డు స్థాయిలో ఆ దేశాన్ని 39 మిలియన్లు విజిట్ చేశారు. దానిలో 11 మిలియన్లు చైనీస్ టూరిస్ట్‌లు ఉన్నారు. ప్రీ పాండమిక్ సమయంలో టూరిజం మార్కెట్ అయిన చైనీస్ కోసం థాయ్‌లాండ్ 2023 సెప్టెంబరులో వీసాను రద్దు చేసింది. ఈ క్రమంలోనే భారతీయ పర్యాటకులకు శుభవార్త చెప్పింది.
థాయ్ మసాజ్..
మీకు కూడా టిప్స్, టూర్స్‌కి ఎక్కువగా వెళ్లే పర్సన్ అయితే.. మీ హాలీడేలో మీరు హాయిగా థాయ్‌లాండ్ చెక్కేయవచ్చు. థాయ్‌లాండ్ చారిత్రక, సహజమైన, సాంస్కృతిక ప్రదేశాలకు బాగా ప్రసిద్ధి. బీచ్‌లు, ద్వీపాలు సందర్శించవచ్చు. పర్వతాలలో ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే ఇక్కడ వీటకంటే మసాజ్ చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా థాయ్మసాజ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు కూడా ఓ స్ట్రెస్ఫుల్ లైఫ్‌లో ఉంటే.. దాని నుంచి కాస్త విశ్రాంతి కోరుకుంటే మీరు థాయ్‌లాండ్ వెళ్లొచ్చు. అంతేకాదు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం థాయ్‌లాండ్ ఐదవ అతిపెద్ద మెడికల్ టూరిజం. ఇక్కడ కాస్మోటిక్ సర్జరీలకోసం ఎక్కువ మంది వస్తుంటారు. ముఖ్యంగా సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీలు చేయించుకునేవారికి ఈ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సెక్స్ టూరిజం కూడా ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో ఓ భాగమే.
Also Read : సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే, శీతాకాలంలో ఈ సూప్ తాగండి