By: ABP Desam | Updated at : 23 Jun 2022 08:50 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
టెస్టోస్టెరాన్ అనేది సెక్స్ హార్మోన్. మగవారిలో సెక్స్ డ్రైవ్‌కు అతి ముఖ్యమైన హార్మోణ్ ఇది. అలాగే వారిలో కండరాలు పెరిగేందుకు, ఎముకలు బలంగా ఉండేందుకు కూడా ఇది అవసరం. స్మెర్మ్ ఉత్పత్తిని కూడా ఇది నియంత్రిస్తుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వారిలో భావోద్వేగాలు అధికమైపోతాయి. విచారం, నిరాశ అధికమైపోతుంది. ముఖ్యంగా లైంగిక విషయాల పట్ల పూర్తిగా ఆసక్తిని కోల్పోతారు. సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల మీరు ఆత్మన్యూనతకు గురవుతారు. నలుగురిలో వెళ్లేందుకు కూడా ఇష్టపడతారు. ఒక పురుషుడిలో ఒక డెసిలీటర్‌కు 300 నానోగ్రాముల కన్నా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఆ వ్యక్తిలో ఈ హార్మోన్ లోపం ఉన్నట్టు లెక్కిస్తారు వైద్యులు.
కొన్ని లక్షణాలు...
టెస్టోస్టెరాన్ స్థాయిలో శరీరంలో తగ్గినా అది బయటికి కనిపించే గాయం కాదు కాబట్టి వెంటనే గుర్తు పట్టలేం. కానీ మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
1. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గితే మీకు సెక్స్ పరమైన ఆలోచనలేవీ రావు.
2. స్మెర్మ్ కూడా చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది.
3. టెస్టోస్టోరాన్ తగ్గి, ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగితే మగవారిలో ఆడవారిలోలాగా ఛాతీ పెరుగుతుంది.
4. వారిలో సెక్స్ పరమైన స్పందనలు చాలా తగ్గిపోతాయి.
5. ఎలాంటి పనులు చేయకపోయినా అలసిపోయినట్టు నీరసంగా ఉంటారు.
6. డిప్రెషన్ గా, నిరాశగా కనిపిస్తారు. టెస్టోస్టెరాన్ తగ్గితే డిప్రెషన్ బారిన పడే అవకాశం ఎక్కువ.
ఏం తినాలి?
మగవారు శరీరంలో టెస్టోస్టెరాన్ తగ్గినట్టు అనిపిస్తే కొన్ని రకాల ఆహారాల ద్వారా తిరిగి భర్తీ చేసుకోవచ్చు. అల్లం టీ, అల్లం వేసుకుని కూరలు వండుకుని తినడం చేయాలి. రోజుకో దానిమ్మ పండును తినేందుకు ప్రయత్నించాలి. ఆకుపచ్చని ఆకుకూరలు తినాలి. ఆలివ్ ఆయిల్ తో ఆహారాన్ని వండుకుని తినాలి. ఉల్లిపాయలు అధికంగా తింటూ ఉండాలి. వండుకుని తిన్నా, పచ్చిగా తిన్నా మంచిదే. బాదం పప్పులు, సోయాం, అవిసె గింజలు వంటివి రోజూ తినాలి. కొవ్వు పట్టిన చేపలు, చేప నూనె తరచూ మెనూలో చేర్చుకోవాలి.
మద్యపానం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి ధూమపానం, మద్యపానం ఈ రెండింటికీ దూరంగా ఉండడం మంచిది.
Also read: డయాబెటిస్ రోగులు గ్లూటెన్ ఉన్న పదార్థాలు తినకూడదా? మరి చపాతీలలో గ్లూటెన్ ఉంటుందిగా?
Also read: కిలో చికెన్ కన్నా కిలో చింతచిగురు ధరే ఎక్కువ, ఈ సీజన్లో దానికెందుకంత క్రేజ్
Rose Petals: గులాబీ పూల రెక్కలను గిన్నెలో పోసి ఇంట్లో ఉంచితే ఆరోగ్యమా లేక ఆర్ధిక లాభమా?
Mandara Oil: జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగాలా? ఇలా మందార తైలాన్ని తయారుచేసి వాడండి
Carrot Rice: పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్, తెలివితేటలు పెంచుతుంది
matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం
World Biryani Day: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?