News
News
X

Teachers Day 2022 Gifts: మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన టీచర్లకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేయండి

Teachers Day Gifts: కాలంతోపాటు గురువులకు ఇచ్చే గిప్టుల్లోనూ మార్పు వచ్చింది. మీకు ఇష్టమైన ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే బహుమతులపై ఓ లుక్కేయండి.

FOLLOW US: 

Surprise your favorite Teachers with these gifts: చిన్నతనం నుంచి మనల్ని సరైన మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే సెప్టెంబర్ 5 వచ్చిందంటే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఉంటారు. భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day 2022)గా నిర్వహించుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం అంటే అందరికీ చాలా స్పెషల్. మన ఉన్నతికి శ్రమించిన గురువులను స్మరించుకోవడం అందరి బాధ్యత కూడా. ఒకప్పుడు టీచర్స్‌ డే అంటే ఇష్టమైన గురువుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతోపాటు గురువులకు ఇచ్చే గిప్టుల్లోనూ మార్పు వచ్చింది. మీకు ఇష్టమైన ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే బహుమతులపై ఓ లుక్కేయండి.

మీ ఫెవరెట్ టీచర్స్‌కు ఈ గిఫ్ట్ ట్రై చేయండి
టీచర్స్‌ డే పెన్ స్టాండ్: మీకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయులకు పెన్‌ స్టాండ్‌ను విలువైన బహుమతి ఇవ్వొచ్చు. టీచర్ అనగానే గుర్తొచ్చే వాటిలో పెన్ ఒకటి. మన తప్పుల్ని సరిదిద్దిన టీచర్ల పెన్నులను విద్యార్థులు గుర్తుంచుకుంటారు.
టీచర్స్‌ డే గడియారం: మీ గురువులకు మీరిచ్చే మరో అద్భుతమైన బహుమతి ఈ-వాల్ క్లాక్‌. మీ టీచర్‌ ఇంట్లో మరో అందమైన డెకరేషన్ ఐటెమ్‌గా ఈ వాల్‌ క్లాక్‌ను ఉంచుకుంటారు. ఈ గడియారం చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తుంటారు. సమయం చాలా విలువైనది. కనుక టీచర్స్‌ డే సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చే బహుమతుల్లో ఇది చాలా విలువైనది.
టీచర్స్‌ డే కుషన్ అండ్ మగ్‌ సెట్‌: ఇది చాలా మందికి నచ్చే కామన్‌ గిఫ్టు ఇది. ఇందులో మగ్‌, కుషన్, కీచెయిన్, ఓ గ్రీటింగ్ కార్డు ఉంటాయి. మీరు ఇచ్చే కుషన్ టీచర్‌ బెడ్‌ రూం డెకరేట్ చేసుకునేందుకు యూజ్ అవుతుంది. మార్నింగ్ తాగే టీ కోసం టీ మగ్‌ కూడా ఉంటుంది. అందులో ఉండే గ్రీటింగ్‌ కార్డులో టీచర్‌పై మీకున్న అభిమానాన్ని తెలిపేలా కొన్ని అందమైన వ్యాఖ్యాలు రాసేయండి.
టీచర్స్‌ డే ఫొటో ఫ్రేమ్‌: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్స్‌కు ఇచ్చే వాటిలో మరో బహుమతి ఫొటో ఫ్రేమ్‌. దీన్ని టీచర్స్‌ కోసం స్పెషల్‌గా డిజైన్ చేశారు. దీన్ని మీ టీచర్స్‌ గోడలకు వేలాడదీసి... వాళ్లకు నచ్చిన ఫొటోలు పెట్టుకుంటారు. టేబుల్‌పై కూడా పెట్టుకునే వెసులుబాటు దీనికి ఉంది. ఈ ఫ్రేమ్‌తోపాటు టీచర్స్‌తో మీ క్లాస్‌ ఫ్రెండ్స్‌ అంతా కలిసి దిగిన ఫొటోను అందులో పెట్టి పంపించి మీ గురువులను సర్ ప్రైజ్ చేయండి.
గుడ్‌ లక్‌ ప్లాంట్: టీచర్స్‌ డే సందర్భంగా నచ్చిన ఉపాధ్యాయులకు గుడ్‌లక్‌ ప్లాంట్స్‌ కూడా ఇవ్వొచ్చు. ఇప్పుడు ఇది ట్రెండీ కూడా. చాలా మంది పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, వార్షికోత్సవాలకు వీటినే గిఫ్టులగా ఇస్తున్నారు. అందుకే ఇలా కూడా మీరు ట్రై చేయండి.

Also Read: Teachers Day 2022: దేశం గర్వించిన టీచర్ డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ - తెలుగునాడుతో ప్రత్యేక అనుబంధం

Published at : 05 Sep 2022 08:23 AM (IST) Tags: Sarvepalli radhakrishnan Teachers Day Teachers Day 2022 Dr Sarvepalli Radhakrishnan Birthday National Teachers Day 2022 Teachers Day Gifts

సంబంధిత కథనాలు

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?