అన్వేషించండి

Cholesterol Fighting Foods : ఈ ఫుడ్స్ తింటూ కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు తెలుసా? లిస్ట్ ఇదే

Lower Your Cholesterol with Food : కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే కొన్ని ఫుడ్స్​ని రెగ్యూలర్​గా తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందట. అవేంటంటే.. 

Delicious Ways to Lower Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే.. ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బీపీ, షుగర్​ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మొత్తం ప్రాణానికే హాని కలిగించగలదు ఈ కొలెస్ట్రాల్. అయితే సరైన జీవనశైలిని ఫాలో కాకపోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, శారీరక శ్రమ, నిద్ర, ఒత్తిడి ఇలా చాలా కారణాలు శరీరంలో కొలెస్ట్రాల్​ను పెంచుతాయి. 

ముఖ్యంగా అన్​ హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. ఫుడ్​తో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుందో.. అలాగే ఫుడ్ తీసుకుంటూ కూడా కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. కొవ్వును కరిగించడానికి టేస్ట్ లేని ఫుడ్స్ తీసుకోవాలేమో అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే రుచికరమైన ఫుడ్స్​ తీసుకుంటూనే కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేయవచ్చు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? అవి కొలెస్ట్రాల్​ని ఎలా కంట్రోల్ చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం. 

వెల్లుల్లి.. 

వంటింట్లో ఉండే వెల్లుల్లితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పచ్చిగా, వంటల్లో కూడా తీసుకోవచ్చు. కూరల్లో మంచి ఫ్లేవర్​ని ఇవ్వడమే కాకుండా.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసి.. బీపీని కూడా తగ్గిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 

నట్స్

నట్స్​లో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే బాదం, వాల్​నట్స్ నానబెట్టి తీసుకోవచ్చు. అలాగే వీటిని హెల్తీ స్నాక్​గా కూడా తినవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసి.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి. వీటిని సలాడ్స్​లో, బ్రేక్​ఫాస్ట్, స్మూతీలలో కూడా తినవచ్చు. 

కూరగాయలు.. 

ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయి. బ్రోకలీ, స్ప్రౌట్స్ వంటి ఫుడ్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. 

డార్క్ చాక్లెట్

డార్క్​ చాక్లెట్స్​ గుండె ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తాయి. పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. వీటిలోని కోకాపౌడర్ కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసి.. హెల్తీగా, యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. 

బెర్రీలు.. 

స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ.. ఇలా ఏ బెర్రీలను అయినా డైట్​లో చేర్చుకోవాలంటున్నారు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్​తో నిండి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసి.. తగ్గిస్తాయి. ఇవి మంచి రుచిని అందించడంతో పాటు.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్​ని దూరం చేస్తాయి. వీటిని మీరు నేరుగా తీసుకోవచ్చు. స్మూతీలు, బ్రేక్​ఫాస్ట్​లలో కలిపి తీసుకోవచ్చు. 

అవకాడో..

అవకాడో మంచి రుచిని అందిచడంతో పాటు.. కొలెస్ట్రాల్​ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. దీనిని స్మూతీలుగా, టోస్ట్​తో పాటు లేదంటే సలాడ్స్​లో కలిపి అవకాడోను తీసుకోవచ్చు. దీనిలోని హెల్తీ ఫ్యాట్స్.. చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్​ని పెంచుతాయి. గుండె సమస్యలను దూరం చేయడంలో సహాయం చేస్తాయి. గుండెకు మంచివి కదా అని వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు ఓ అవకాడో తీసుకుంటే సరిపోద్ది. 

ఫ్యాటీ ఫిష్.. 

నాన్​ వెజ్ తినేవారు ఫ్యాటీ ఫిష్​ని డైట్​లో చేర్చుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. దీనిలో ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్​ని పెంచి.. చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి. ముఖ్యంగా సాల్మన్ చేపలను రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 

ఈ హెల్తీ ఫుడ్స్​ని రెగ్యూలర్​ డైట్​లో తీసుకోవడంతో పాటు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఈ ఫుడ్స్ మీరు డైట్​లో తీసుకునే ముందు కచ్చితంగా వైద్యులు లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. 

Also Read : మెడిటేషన్​తో బరువు కూడా తగ్గొచ్చట.. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Mahindra Thar: దుమ్మురేపుతున్న థార్ సేల్స్ - నాలుగేళ్లలోనే రెండు లక్షలు!
దుమ్మురేపుతున్న థార్ సేల్స్ - నాలుగేళ్లలోనే రెండు లక్షలు!
Matka OTT Rights Price: ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Vijay Deverakonda: లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
Embed widget