అన్వేషించండి

Karnataka Bus Accident: కర్ణాటకలో పెను విషాదం; ట్రావెల్ బస్‌ను ఢీ కొట్టిన కంటెయినర్‌- 17 మంది సజీవ దహనం

Karnataka Bus Accident: కర్ణాటకలో జాతీయ రహదారిపై కంటెయినర్‌ అదుపు తప్పి రాంగ్ రూట్‌లో ట్రావెల్ బస్‌ను ఢీ కొట్టింది. ఈ విషాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు.

Karnataka Bus Accident: క్రిస్మస్ పండుగ వేళ కర్ణాటక రాష్ట్రంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా, మృత్యువు అగ్ని రూపంలో వచ్చి కబళించింది. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది  ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఒక ప్రైవేటు బస్‌, కంటెయినర్‌ లారీ ఢీ కొనడంతో రేగిన మంటలు క్షణాల్లో విస్తరించి పెను విషాదాన్ని నింపాయి. 

సీబర్డ్‌ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణవైపు వెళ్తుండగానే ప్రమాదం జరిగింది. గురువారం వేకువ జామున సుమారు 2.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి-48పై గోర్లత్తు క్రాస్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎదురుగా వస్తున్న ఒక కంటెయినర్‌ లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు వస్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. ఢీ కొన్న వేగానికి రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

నిద్రలోనే మృత్యు ఒడిలోకి

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో, లోపల ఉన్నవారు ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. దట్టమైన పొగ కారణంగా ఏవైపు వెళ్లాలో తెలియక 17 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు విడిచారు. అతి వేగం, ఆ సమయంలో ఉన్న పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

ప్రాణాలు కాపాడుకున్నవారు

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ , కో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి బయటకు రాగలిగారు. ఇలా బయట పడ్డ వాళ్లు తమ బంధువులు, స్నేహితులు కళ్ల ముందే అగ్నికి ఆహుతైపోతుంటే కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయపడిన ఇతర ప్రయాణికులను అధికారులు తక్షణమే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. 

మృతులను గుర్తించే ప్రక్రియను పోలీసులు చేపట్టారు. అధికారులు ప్రస్తుతానికి సేకరించిన సమాచారం ప్రకారం బస్‌లో మంజునాథ్‌, అమృత, కల్పన, సంధ్య, దిలీప్, శశాంక్, బిందు, కవిత, ప్రీతీశ్వరన్‌, అనిరుధ్‌ బెనర్జీ, ప్రజాపతి, విజయ్ భండారీ, శశికాంత్‌, నవ్య, కిరణ్‌పాల్, అభిషేక్, కీర్తన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Delhi AQI: దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీ ప్రజలు విషగాలులు పీల్చుతున్నారా ? గ్యాస్ చాంబర్‌గా మారిన సిటీ
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీ ప్రజలు విషగాలులు పీల్చుతున్నారా ? గ్యాస్ చాంబర్‌గా మారిన సిటీ
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
KTR: తెలంగాణలో తుగ్లక్ పాలన.. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో తుగ్లక్ పాలన.. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Embed widget