అన్వేషించండి

Symptoms of breast cancer: మహిళలూ.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయొద్దు - ఇవి రొమ్ము క్యాన్సర్ సంకేతాలు

మ‌హిళ‌ల్లో ఇప్పుడు క‌నిపిస్తున్న జ‌బ్బుల్లో ఒక‌టి రొమ్ము క్యాన్స‌ర్. దీనివ‌ల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ముందు జాగ్ర‌త్త‌గా ఎప్పుటిక‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటున్నారు డాక్ట‌ర్లు.

Symptoms of Breast Cancer: ప్ర‌స్తుత కాలంలో చాలామంది మ‌హిళ‌ల్లో ఎక్క‌ువ‌గా కనిపిస్తున్న జ‌బ్బు రొమ్ము క్యాన్స‌ర్. దీని బారిన ప‌డి చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. కేవ‌లం మ‌హిళ‌లు మాత్ర‌మే కాదు.. ఇటీవ‌ల కాలంలో కొంత‌మంది పురుషులు సైతం ఈ రొమ్ము క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని అధ్య‌య‌నాలు చెప్తున్నాయి. అందుకే, దీనిపై జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచిస్తున్నారు డాక్ట‌ర్లు. ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే క‌చ్చితంగా డాక్ట‌ర్ ని సంప్ర‌దించాల‌ని, ఎలాంటి అనుమానాలు వ‌చ్చినా టెస్ట్ లు చేయించుకోవాల‌ని అంటున్నారు. అంతేకాదు.. ఫ్యామిలీ హిస్ట‌రీలో రొమ్ము క్యాన్స‌ర్ బాధితులు ఉంటే క‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల‌ని అంటున్నారు. మ‌రి ఈ క్యాన్స‌ర్ ని ఎలా గుర్తించాలి? ల‌క్ష‌ణాలు ఏంటి? ఎలాంటి వాళ్లు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలి? ఒక‌సారి చూద్దాం. 

ల‌క్ష‌ణాలు ఏంటంటే? 

బ్రెస్ట్ క్యాన్స‌ర్‌ను ముందే క‌నిపెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిద‌ని చెప్తున్నారు డాక్ట‌ర్లు. క్యాన్స‌ర్ స్టేజ్ ని బ‌ట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. స‌ర్జ‌రీ, రేడియేష‌న్ థెర‌పి, కీమోథెర‌పీ, హార్మోన్ థెర‌పీ, టార్గెటెడ్ థెర‌పీ లాంటివి చేస్తారు. ఈ క్యాన్స‌ర్ కి ల‌క్ష‌ణాలు ఇలా ఉన్నాయి. 

రొమ్ములో గ‌డ్డ‌లు రావ‌డం, గ‌ట్టిగ అయిపోవ‌డం, రొమ్ముల ఆకారంలో, ప‌రిణామంలో మార్పు రావ‌డం, పాలు కార‌డం, రొమ్ము భాగంలోని చ‌ర్మంలో మార్పులు రావ‌డం లాంటివి దీనికి ల‌క్ష‌ణాలు. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే క‌చ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లో ఎవ‌రైనా ఈ స‌మస్య‌తో బాధ‌ప‌డుతుంటే వాళ్లు కూడా స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిద‌ని చెప్తున్నారు. 

ఫ్యామిలీ హిస్ట‌రీ తెలుసుకోవాలి.. 

కుటుంబ ఆరోగ్య చ‌రిత్ర తెలుసుకోవ‌డం చాలామంచిది. ముఖ్యంగా ఎవ‌రైనా రొమ్ము క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డ్డారేమో తెలుసుకోవాలి. అమ్మ‌, చెల్లి, అక్క ఇలా ఎవ‌రైనా రొమ్ము క్యాన్స‌ర్ తో ఉంటే మీరు స్క్రీనింగ్ చేయించుకోవ‌డం చాలా మంచిది. 

రొమ్ము ప‌రిమాణం గ‌మ‌నించుకోవాలి.. 

రొమ్ముల ప‌రిమాణం ఎక్కువ‌గా ఉన్న స్త్రీలు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు డాక్ట‌ర్లు. రొమ్ము ఎక్క‌వ‌గా ఉన్న‌వాళ్లు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎమ్మారై లాంటివి తీయించుకోవాల‌ని చెప్తున్నారు. 

టెస్ట్ లు చేయించుకోవ‌డం మంచిది.. 

ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే క‌చ్చితంగా టెస్ట్ లు చేయించుకోవాల‌ని సూచిస్తున్నారు. మామోగ్రామ్స్, క్లీనిక‌ల్ బ్రెస్ట్ ఎగ్జామ్స్ చేయించుకోవ‌డం ఉత్త‌మం. స్క్రినింగ్ వ‌ల్ల ట్రీట్మెంట్ సులువు అవుతుంద‌ని చెప్తున్నారు. 

జెనిటిక్ కౌన్సింగ్ కి వెళ్తే మంచిది.. 

ఫ్యామిలీ హిస్ట‌రీలో క్యాన్స‌ర్ ఉంద‌ని తెలిస్తే.. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా జెనిటిక్ కౌన్సిలింగ్, జెనిటిక్ టెస్ట్ లు చేయించుకోవ‌డం ఉత్త‌మం. దానివల్ల హాని త‌గ్గుతుంది. 

రెగ్యుల‌ర్ మానిట‌రింగ్ అవ‌స‌రం.. 

ఫ్యామిలీలో ఎవ‌రికైనా ఉంద‌ని తెలిస్తే.. రెగ్యుల‌ర్ గా హాస్పిట‌ల్ కి వెళ్లి చెక్ చేయించుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. గ‌తంలో వ‌చ్చిన రిపోర్ట్ లు, ప్ర‌స్తుతం ఉన్న రిపోర్ట్ ల‌లో క‌లిగి మార్పుల‌ను గ‌మ‌నించుకుంటూ.. జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్తున్నారు డాక్ట‌ర్లు.


Symptoms of breast cancer: మహిళలూ.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయొద్దు - ఇవి రొమ్ము క్యాన్సర్ సంకేతాలు

Also Read: నిద్ర ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా పడకేస్తున్నారా? ఈ జబ్బులు గ్యారంటీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget