మీ పిల్లలు కదలకుండా ఒకే చోట ఉంటున్నారా? అన్నేసి గంటలు కూర్చుంటే భవిష్యత్తు నరకమే!
చిన్నతనంలో మెలకువగా ఉన్న సమయంలో ఆరుగంటల కలంటే ఎక్కువ సేపు నిశ్చలంగా ఉంటే.. ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతుందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ రోజుల్లో పిల్లలకు ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోతారు. గంటలు.. గంటలు ఫోన్‌తో టైమ్‌పాస్ చేస్తూ, సరిగ్గా తిండి తినడం, సరదాగా ఆటలు అడుకోవడమూ అనే విషయాలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. దీంతో పిల్లలకు సరైన శారీరక శ్రమ లేక.. చాలామంది చిన్నారులు ఊబకాయంతో ఉత్సాహాం లేకుండా ఉసూరుమంటూ ఉంటున్నారు. అంతేకాదు, చిన్నతనంలో ఆరుగంటల కంటే ఎక్కువ సేపు నిశ్చలంగా ఉండే పిల్లలకు యుక్తవయస్సులో ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పిల్లలు మెలకువగాఉన్న సమయంలో ఆరుగంటల కంటే ఎక్కువసేపు శారీర శ్రమలేకుండా ఉంటే ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని నేచర్స్ గట్ అండ్ లివర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం పేర్కొంది.
లివర్ కణాలలో కొవ్వు అతిగా చేరితే.. ఈ పరిస్థితి ఏర్పడుతుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, లివర్ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే, కొంతవరకు ఉంటే ఇబ్బందేమీ ఉండదు. గానీ మితిమీరితే లివర్‌కు ప్రమాదం. కానీ ఎప్పుడైతే మన లివర్ బరువులో 5 నుంచి 10 శాతం మధ్యకు కొవ్వుపెరుగుతుందో అప్పుడది సమస్యగా మారుతుంది. ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాకుండా మెటబాలిక్ సిండ్రోమ్‌లోని ఐదు భాగాలలో కనీసం ఒకదానితో ముడిపడి ఉంటే, దానిని మెటబాలిక్-అసోసియేటెడ్ స్టీటోటిక్ (ఫ్యాటీ) లివర్ డిసీజ్ (MASLD) అంటారు.
శారీరక శ్రమ లేకపోతే..
యుఎస్‌లోని బోస్టన్‌లో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశంలో పాల్గొన్న తూర్పు ఫిన్‌లాండ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రూ అగ్బాజే మాట్లాడుతూ.. "లివర్ దెబ్బతినడానికి, శారీరక శ్రమ లేకపోవడమే కారణం అని మేము గుర్తించాం" అని పేర్కొన్నారు. నేచర్స్ గట్ అండ్ లివర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం కోసం, యూకె బర్త్ కోహోర్డ్ దీర్ఘకాలిక అధ్యయనంలోని డేటాను ప్రొఫెసర్ ఆండ్రూ అగ్బాజే విశ్లేషించారు.
ఈ అధ్యయనంలో 17 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు, లివర్ మచ్చలు, ఫ్యాటీ లివర్ గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారు. ఈ పరిశీలనలో పిల్లలు రోజుకు సగటుప ఆరు గంటలు కూర్చొని లేదా నిశ్చలంగా గడిపారు. అయితే ఈ సమయం యవ్వనంలో ప్రతిరోజూ 9 గంటలకు పెరిగింది.
అరగంట పెరిగేకొద్దీ..
ఈ ఆరుగంటలకు, ఒక్కో అరగంట పెరిగే కొద్దీ.. పిల్లలకు 25 సంవత్సరాల కంటే ముందే ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం 15 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. రోజుకు ఆరు గంటల కంటే ఎక్కువ నిశ్చల సమయం పెరగడం వల్ల తేలికపాటి శారీరక శ్రమ చేసే సమయం తగ్గుతుంది. కాబట్టి యుక్తవయస్సులో ప్రతిరోజూ 3 గంటలు తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, రోజుకు 3 గంటలకు పైగా తేలికపాటి శారీక శ్రమ చేస్తే లివర్ సమస్యలు వచ్చే ముప్పు 33 శాతం తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
Also Read: పిల్లలు పుట్టేందుకు ఏజ్ లిమిట్ ఉందా? ఆ వయసు దాటితే పేరెంట్స్ కాలేరా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.