అన్వేషించండి

Sprouts Dosa Recipe : స్ప్రౌట్స్​తో టేస్టీ, క్రిస్పీ దోశలు.. బరువు తగ్గేందుకు చక్కటి రెసిపీ

Healthy Breakfast : స్ప్రౌట్స్​తో మీరు ఏమైనా కొత్త వంటకం తయారు చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ క్రిస్పీ దోశలను ట్రై చేయవచ్చు. ఇవి టేస్టీ, హెల్తీ బ్రేక్​ఫాస్ట్ అవుతుంది.

Crispy and Tasty Sprouts Dosa : స్ప్రౌట్స్​ను చాలామంది తమ డైట్​లో చేర్చుకుంటారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉదయాన్నే వీటిని తింటారు. అయితే రోటీన్​కు భిన్నంగా స్ప్రౌట్స్ తీసుకోవాలనుకుంటే మీరు వాటితో క్రిస్పీ, టేస్టీ దోశలు చేసుకోవచ్చు. పైగా వాటిని చేయడం చాలా సింపుల్​ కూడా. ప్రోటీన్​ ఫుడ్ కావలనుకునేవారు కచ్చితంగా వీటిని తమ డైట్​లో చేర్చుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు కూడా వీటిని హాయిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా.. టేస్ట్ ఉండదు అనుకుంటున్నారేమో.. అలా ఏమి కాదండీ.. ఈ రెసిపీ చాలా టేస్ట్​గా ఉంటుంది. మరి ఈ స్ప్రౌట్స్ దోశలను ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

పెసలు - అరకప్పు 

శనగలు - అరకప్పు

పల్లీలు - పావు కప్పు

బొబ్బర్లు - పావు కప్పు

శనగ పిండి - 4 టేబుల్ స్పూన్స్

క్యారెట్ - 1

పాలకూర - 1 కట్ట

ఉల్లిపాయలు - 1 పెద్దది

పచ్చిమిర్చి - 2

కొత్తిమీర - 1 కట్ట

అల్లం - అంగుళం

పసుపు - చిటికెడు

జీలకర్ర - 1 స్పూన్

ఉప్పు - తగినంత 

కారం - 1 స్పూన్

ధనియాల పొడి - 1 స్పూన్

నూనె - తగినంత

తయారీ విధానం

ముందుగా పెసలు, శనగలు, పల్లీలు, బొబ్బర్లు నానబెట్టుకోవాలి. అవి మొలకలు వచ్చేలా చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర స్ప్రౌట్స్​ ఉంటే ఇంకా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారెట్, పాలకూర, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం బాగా కడగాలి. అల్లం, క్యారెట్​ను బాగా సన్నగా తురుముకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర సన్నగా తరుగుకోవాలి. అన్నింటిని సిద్ధం చేసుకున్నాక.. స్ప్రౌట్స్​ను సన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ మిషన్ లేకుండా మిక్సీలో వేసుకుని కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. 

సిద్ధం చేసుకున్న స్ప్రౌట్స్ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పాలకూర, అల్లం, క్యారెట్ తురుము వేయాలి. అనంతరం పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో శనగపిండి వేసి చేతితో మిక్స్ చేసుకోవాలి. నీరు సరిపోదు అనుకుంటే కాస్త నీరు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఓ పదినిమిషాలు పక్కన ఉంచేయండి. 

స్టౌవ్ వెలిగించి దోశ పాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న దోశలుగా.. అంటే వడల సైజ్​లో వేయండి. ఒక పాన్​పై రెండు మూడు దోశలు వేసుకోవచ్చు. అవి వేగేందుకు కాస్త నూనె వేయండి. అవి ఉడికే సమయంలో స్టౌవ్ మీడియంగా ఉండేలా చూసుకోండి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు కూడా వాటిని ఉడకనివ్వండి. రెండూ వైపులా గోధుమరంగులో వచ్చిన తర్వాత దోశలను తీసేయండి. ఇలా మిగిలిన పిండితో మీరు చిన్న సైజ్ స్ప్రౌట్ దోశలు చేసుకోవచ్చు. 

స్ప్రౌట్స్ దోశలు ఆరోగ్యానికి చాలా మంచివి. మీరు ఉదయాన్నే మీ డైట్​లో ప్రోటీన్​ చేర్చుకోవాలనుకుంటే.. ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అంతేకాకుండా నోటికి రుచిగా కూడా ఉంటుంది. వీటిని మీరు ఉదయం బ్రేక్​ఫాస్ట్​లాగా, సాయంత్రం స్నాక్స్​లాగా తీసుకోవచ్చు. ఈ దోశలకు పల్లీ చట్నీ బెస్ట్ కాంబీనేషన్ అవుతుంది. అంతేకాకుండా ఇవి క్రంచీగా ఉంటాయి కాబట్టి పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ తినొచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటిని తమ డైట్​లో చేర్చుకోవచ్చు. 

Also Read : ఓట్స్​తో టేస్టీ, క్రిస్పీ దోశలు.. ఇన్​స్టాంట్ రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget