Skin Disease: మీ మంచం మీద బెడ్‌షీట్స్‌ను ఉతకడం లేదా? జాగ్రత్త, ఈ భయానక వ్యాధి సోకవచ్చు!
బెడ్ మీద వేసే దుప్పటి లేదా బెడ్ షీట్ తరచూ వాష్ చేసుకోవాలి. లేదంటే అవి అనేక చర్మ వ్యాధులకి కారణం అయ్యే ప్రమాదం ఉంది.
నెలల తరబడి ఒకటే దుప్పటి కప్పుకోవడం, ఒకటే బెడ్ షీట్ మీద పడుకోవడం చేస్తున్నారా? అయితే మీరు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అవి ప్రాణాంతకం వరకి వెళ్లొచ్చు. చాలా మంది కనీసం వారానికి ఒకసారి అయిన బెడ్ షీట్ మారుస్తారు. మరికొందరు అయితే నెలకి ఒకసారి మార్చడం చేస్తారు. కానీ ఇలా ఒకే బెడ్ షీట్ ఉంచుకుని దాని మీద పడుకోవడం చేస్తే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తప్పని సరిగా తరచూ బెడ్ షీట్స్ మార్చుకోవడం వాటిని చక్కగా ఉతుక్కోవడం చేయాలని సూచిస్తున్నారు.
మురికి పరుపులు సూక్ష్మజీవులు, వ్యాధుల సంతానోత్పత్తి అనువైన ప్రదేశంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది తేలికపాటి చర్మ పరిస్థితుల నుంచి తీవ్రమైన అనారోగ్యాల వరకి దారితీసే అవకాశం ఉంది. 2020లో హమ్మండ్ ఫర్నిచర్ నిర్వహించిన సర్వేలో మూడవ వంతు బ్రిటీషర్లు తమ బెడ్ షీట్స్, పరుపులని సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తున్నారని తేలింది. ఇలా మురికి వాటి మీద పడుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
దద్దుర్లు, దురద
మురికి బెడ్ షీట్లపై పేరుకుపోయే డెడ్ స్కిన్ సెల్స్ దుమ్ము పురుగులకి అనువైన ఆహారం. దీని ఉనికి అనేక రకాల చర్మ పరిస్థితులకి కారణమవుతుంది. దుమ్ము పురుగులు చాలా హానికరం. బెడ్లు, దుప్పట్లు, దిండ్లు, పరువులు వాటి ఆవాసంగా ఎక్కువ ఉంటాయి. ఇవి తామర మంట, రినైటిస్ వంటి చర్మ సమస్యలు వస్తాయి. ఇది దురద, దద్దుర్లు, చికాకు కలిగిస్తుంది. తామర అంటువ్యాధి. త్వరగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే చర్మ సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అలర్జీలు
దుమ్ము పరుగులు బెడ్ షీట్స్ మీద మల పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలాగే చనిపోయిన పురుగుల శరీరాలు అలర్జీలని, ఆస్తమాని ప్రేరేపిస్తాయి. వీటి వల్ల చర్మంపై దద్దుర్లు, కళ్ళు దురద, ముక్కు కారణం వంటివి వస్తాయి. ఒక్కోసారి ఉబ్బసం తీవ్రమైన సందర్భాల్లో కనిపిస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులని కలిగిస్తుంది. చాలా ప్రమాదకరం.
అపెండిసైటిస్
క్లీవ్ ల్యాండ్ చర్మ వ్యాధి నిపుణులు చెప్పిన దాని ప్రకారం బేడీ షీట్లపై బ్యాక్టీరియా పేరుకుపోయి అది జీర్ణాశయంలోకి చేరుతుంది. దీని వల్ల అపెండిసైటిస్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల అపెండిక్స్ ఇన్ఫెక్షన్ బారిన పడి తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంది. అపెండిక్స్ అంతే పెద్ద పేగుకి అనుసంధానించబడి ఉండే పొడవైన అవయవం. పొత్తి కడుపు కింద భాగంలో ఉంటుంది. ఇది వాపు లేదా ఇన్ఫెక్షన్ కి గురైనప్పుడు అపెండిసైటిస్ వస్తుంది. దీనికి తరచుగా చికిత్స చేయాల్సిన అవసరం అవుతుంది. ఒక్కోసారి అపెండిక్స్ పేలిపోవడం వల్ల ప్రాణాంతకం కూడా కావచ్చు.
అంటువ్యాధులు
ఉతకని మురికి బెడ్ షీట్స్, పరుపులపై సూక్ష్మ జీవులు ఉంటాయి. దీని వల్ల స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే అంటువ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇది చాలా సులభంగా వ్యాపిస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలని కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా న్యుమోనియాతో ముడిపడి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆయుర్వేద మార్గాలు ఇవే