అన్వేషించండి

Coconut Water Hacks : జుట్టు రాలుతుందా? అయితే కొబ్బరి నీళ్లను తలకు ఇలా అప్లై చేయండి

Hair Care Tips : కొబ్బరి నూనెతో జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అయితే కొబ్బరి నీళ్లతో మీరు జుట్టుకి, చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చట మీకు తెలుసా?

Beauty Tips : కొబ్బరి నీళ్లు రుచికరంగా, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు, డీహైడ్రేట్ అయినప్పుడు చాలామంది ఈ సహజమైన పానీయాన్ని ఆశ్రయిస్తారు. అయితే దీనితో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. చర్మం, జుట్టు కూడా ఎన్నో బెనిఫిట్స్ పొందుతుంది అంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి లోపలి నుంచి మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. అలాగే స్కిన్, హెయిర్​కి కూడా బెనిఫిట్స్ అందుతాయి. 

ఈ సహజమైన హైడ్రేటింగ్ పదార్థాన్ని మీరు చర్మ, జుట్టు సంరక్షణలో ఉపయోగించవచ్చు. రోజూ వారి దీనచర్యలలో మీరు కొబ్బరినీళ్లను ఎలా ఉపయోగించవచ్చో? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. వీటితో ఎలాంటి బ్యూటీహ్యాక్స్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు దీనిని ప్రారంభించే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. అయితే దీనిని చర్మానికి, జుట్టుకి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేషియల్ మిస్ట్

మీకు పొడి చర్మం ఉందా? కెమికల్స్ వాడితో చర్మం ఇబ్బంది పెడుతుందా? ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే మీరు కొబ్బరి నీరును ఫేషియల్ మిస్ట్​గా ఉపయోగించవచ్చు. ఇది మీ సెన్సిటివ్ స్కిన్​కి ఓదార్పునిస్తుంది. పొడిబారడాన్ని దూరం చేసి చర్మాన్ని తేమగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని బహుళ సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి రక్షణ అందిస్తాయి. కొబ్బరి నీటిని, రోజ్​ వాటర్​ను బాగా కలిపి.. స్ప్రే బాటిల్​లో వేయండి. చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం మీరు మీకు నచ్చిన ప్రొడెక్ట్స్​లో కలిపి అప్లై చేసుకోవచ్చు. 

ఫేస్ ప్యాక్

కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, అమినో యాసిడ్స్ వంటి చర్మాన్ని ప్రకాశవంతం చేసే గుణాలు ఉంటాయి. వీటిలో యాంటీ మైక్రోబయాల్ గుణాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవన్నీ మొటిమలతో పోరాడడంలో సహాయం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో పసుపు, చందనం కలిపి మీరు ఫేస్ ప్యాక్​గా అప్లై చేయవచ్చు. ఇది మొటిమలు తగ్గించడమే కాకుండా మీకు మంచి గ్లో కూడా ఇస్తుంది. 

హెయిర్ ఫాల్ కంట్రోల్

కొబ్బరి నీరు తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా తలకు మంచి పోషణను అందిస్తుంది. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. హెయిర్ వాష్ చేసే ముందు కొబ్బరి నీళ్లతో స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ పగిలిపోకుండా, జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మంచి కండీషనింగ్​ ఏజెంట్​గా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు మృదువుగా, చిక్కులు లేకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లతో మసాజ్ చేయడం వల్ల జిడ్డుగా కూడా ఉండదు కాబట్టి కేవలం ఒక రౌండ్ షాంపూతో హెయిర్ వాష్ చేయవచ్చు. 

చుండ్రు ఇబ్బంది పెడుతుంటే..

కొబ్బరి నీళ్లలో సహజమైన యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడానికి, పెరగడానికి ఆటంకం కలిగించే దురద, చుండ్రు, ఇతర ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి. చుండ్రు సమస్య వేధిస్తున్నప్పుడు దీనిని హెయిర్​కి ఎలా అప్లై చేయాలంటే.. కొబ్బరి నీళ్లు తీసుకుని దానిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. షాంపూ, కండీషనర్​తో కడిగిన తర్వాత.. ఈ మిశ్రమంతో జుట్టును కడగండి. ఒక నిమిషం అలాగే ఉంచి.. చల్లని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇది మీకు మెరిసే, చిక్కులు లేని జుట్టును అందిస్తుంది. చుండ్రును కూడా దూరం చేస్తుంది. 

Also Read : మీకు ఎల్లో టీ గురించి తెలుసా? ఇది హెల్త్​ బెనిఫిట్స్​కి పెట్టింది పేరు

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget