అన్వేషించండి

Yellow Tea : మీకు ఎల్లో టీ గురించి తెలుసా? ఇది హెల్త్​ బెనిఫిట్స్​కి పెట్టింది పేరు

Healthy Drink : ఆరోగ్య ప్రయోజనాలకు ఎల్లో టీ పెట్టింది పేరు. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. మరి దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Yellow Tea Benefits : రుచిలో కాస్త భిన్నంగా ఉండే ఎల్లో టీ దాని ప్రత్యేకతలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. విభిన్నమైన రుచితో పాటు.. మృదువైన టెక్స్చ్​ర్, ఆహ్లాదకరమైన వాసనతో ఇది ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది కొంచెం గ్రీన్​ టీని పోలి ఉంటుంది. పైగా ఈ ఎల్లో టీలో పసుపు రంగు సహజమైనది కాదు. దీనిని సీల్డ్ ఎల్లోవింగ్ అనే ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు కాబట్టి ఇది ఎల్లో రంగులో ఉంటుంది. దీనికోసం టీ పాలీఫెనాల్స్​ను పసుపు రంగు పొందెందుకు ఆక్సీకరణం చేస్తారు. తర్వాత ఎండిన ఆకుల రంగు, వాసనను సంరక్షించే పద్ధతులు ఫాలో అవుతారు.

బ్లాక్, గ్రీన్, బ్లూస్, ఫ్రూటీ టీలతో పాటు పసుపు రంగు టీ కూడా ప్రజాధారణ పొందుతుంది. దీనిని మీరు ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. ఈ టీని చైనానుంచి ఉద్భవించింది. దాని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఇప్పుడు దీనివైపు ఆసక్తి చూపిస్తున్నారు. మొదట్లో ఈ టీని రాజ కుటంబాలకు అందించేవారు. ఎందుకంటే ఇది ఖరీదైన, విలాసవంతమైన, సంతోషకరమైన ఆవిష్కరణగా చెప్తారు.

నలుపు, ఆకుపచ్చ టీలను ప్రాసెస్ చేసే విధానంగా కాకుండా పసుపు టీ సీల్డ్ ఎల్లోయింగ్ అనే ప్రత్యేక పద్ధతి ద్వారా తయారు చేస్తారు. దీనిలో టీ ఆకులను గుడ్డలో చుట్టి క్రమంగా పులియబెడతారు. అయితే దానికంటే ముందు ఆక్సీకరణం చేస్తారు. ఈ పద్ధతి వల్ల పసుపు టీకి ప్రత్యేకమైన రుచి, లక్షణం వస్తుంది. ఇది గ్రీన్ టీ బ్యాగ్​ల మాదరిగానే ఉంటుంది. గోరువెచ్చని నీటిలో ఈ టీ బ్యాగ్ ఉంచి.. మీరు ఎల్లో టీని తయారు చేసుకోవచ్చు. ఎల్లో టీ బ్యాగ్స్​ను మీరు ఆన్​లైన్​లో ఆర్డర్ చేసుకోవచ్చు. 

ఎల్లో టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎల్లో టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇతర రకాల టీల మాదిరిగానే దీనిలో ఫ్లైవనాయిడ్లు, కాటెచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయం చేస్తాయి. ఎల్లో టీలోని పాలీఫెనాల్స్​ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి. పసుపు టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

బరువు తగ్గేందుకు కూడా ఎల్లో టీ మంచి ఎంపిక. ఆహ్లాదకరమైన విధానంలో మీరు బరువు తగ్గవచ్చు. గ్రీన్​ టీ ఎక్స్​ట్రాక్ట్​ల మాదిరిగా ఎల్లో టీ కూడా బరువు తగ్గడానికి సహాయం చేస్తుందని ఓ పరిశోధన తెలిపింది. పైగా ఇది మీరు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండడంలో సహాయం చేస్తుంది. దీనిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. అధికమొత్తంలో పాలీఫెనాల్స్, అమైనో ఆమ్లాలు, డైటరీ షుగర్, కెఫిన్ వంటి క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి మీ శరీరంలో వాపు, ఇతర దీర్ఘకాలిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయం చేస్తాయి. 

Also Read : బరువు తగ్గేందుకు రోజూ రోజ్​ టీ తాగాలట.. తయారీ రెసిపీ ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget