Baby Food : పాలు తాగే పిల్లలకు త్వరగా ఫుడ్ తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్త
Parenting Tips : పాలు తాగే పిల్లలకు ఫుడ్ ఎప్పుడు పెట్టాలా అనేది చాలామందిలో ఉండే ప్రశ్న. ఏ నెలలో పిల్లలకు ఫుడ్ పెట్టాలి. త్వరగా ఆహారాన్ని అలవాటు చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
Side Effects of Feeding Solid Food : మొదటిసారి పేరెంట్స్ అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ నుంచి అన్ని అనుమానాలే ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ అనుమానాలు రెట్టింపు అవుతాయి. దానిలో మేజర్‌గా చెప్పుకోవాల్సింది పాలు తాగే పిల్లలకు ఫుడ్ ఎప్పుటి నుంచి పెట్టాలి అనేది పెద్ద ప్రశ్న. పిల్లలు పెరిగేకొద్ది పాలుకి కాస్త విముఖతను చూపిస్తారు. ఇలాంటి సూచనను మీరు గుర్తించి ఫుడ్ అలవాటు చేయవచ్చు. అయితే పిల్లలకు ఎర్లీగా ఫుడ్ అలవాటు చేస్తే ఏమైనా ఇబ్బందులుంటాయా?
పెద్దలు ఏమి చెప్తారంటే.. పిల్లలకు ఆరునెలల నుంచి పాలతో పాటు ఏమైనా ఆహారాపదార్థాలు తినిపించడం స్టార్ట్ చేయమంటారు. మరికొందరు నాలుగునెలల నుంచే ఫుడ్ పెట్టొచ్చు అనుకుంటారు. అయితే ఈ విషయంపై వైద్యులు పూర్తిగా భిన్నమైన సమాధానం ఇచ్చారు. శిశువుకు ఆహారాన్ని ముందుగానే ఇవ్వడం ప్రమాదమని చెప్తున్నారు. ఒకవేళ మీరు చంటిపిల్లలకు మీరు ఫుడ్ తినిపించాలనుకుంటే కచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోవాలి అంటున్నారు.
వైద్యులు చెప్తున్న దుష్ప్రాభావాలు ఇవే..
పిల్లలకు త్వరగా ఫుడ్ తినిపిస్తే దుష్ప్రాభావాలు కచ్చితంగా ఉంటాయంటున్నారు వైద్యులు. నాలుగు నెలల ముందు పిల్లలకు ఘనమైన ఆహారాన్ని ఇవ్వడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇది నిజమని నిరూపించాయి. ఇది గుండె, జీర్ణ సమస్యలను వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తల్లిపాలు తాగే పిల్లల కంటే ఫుడ్ తినిపిస్తే పిల్లలు వేగంగా పెరుగుతారని కొందరు చెప్తారు. కానీ అది పూర్తిగా నిజమని మనం నమ్మకూడదు. కొందరు పిల్లలు ఇతరులకంటే వేగంగా పెరుగుతారు. మరికొందరికి సమయం పడుతుంది.
పిల్లలకు ఎప్పుడు ఫుడ్ పెట్టాలి..
వైద్యుల ప్రకారం.. చంటిపిల్లలు ఆరునెలల్లో ఫుడ్ తినడానికి సిద్ధమవుతారు. కాబట్టి ఆరునెలల వరకు శిశువుకు తల్లిపాలు లేదా పాలు ఇవ్వడమే మంచిది. అలా కాకుండా ముందే ఫుడ్ తినిపిస్తే వారిలో అధికబరువుతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. దాని సైడ్ ఎఫెక్ట్స్ అప్పుడే చూపించకపోయినా.. తర్వాతి కాలంలో కచ్చితంగా ఇబ్బందులకు గురిచేస్తాయి అంటున్నారు.
లేట్‌గా స్టార్ట్ చేస్తే..
శిశువులకు త్వరగా ఫుడ్ పెట్టడం అనేది అస్సలు మంచిది కాదు. కానీ పిల్లల జీర్ణవ్యవస్థ మొదటి కొన్నినెలలు ద్రవాలు, పాలను ఆరగించడానికే హెల్ప్ చేస్తుంది. అలాంటి సమయంలో పిల్లలకు ఫుడ్ ఇస్తే వారు దానిని సరిగ్గా జీర్ణం చేసుకోలేరు. నాలుగు నెలలకే కనుక ఫుడ్ పెట్టేస్తే పిల్లలు ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఇది పిల్లలకు పూర్తిగా ఫుడ్ తినాలనే కోరికను దూరం చేస్తుంది. అయితే శిశువుకు సరైన పోషకాహారం అందకపోవడం వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశముంది. కాబట్టి మీరు వైద్యులను రెగ్యూలర్‌గా సంప్రదిస్తే మంచిది. ఇవన్నీ మైండ్‌లో ఉంచుకుని పిల్లలకు ఫుడ్‌ని మరీ లేట్‌గా అలవాటు చేయకూడదు. అలా చేయడం వల్ల బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తుందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా పిల్లలకు ఫుడ్ తినిపించడం వల్ల వారికి అలెర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పిల్లల్లో ఈ సంకేతాలు గుర్తించండి..
పిల్లలు ఫుడ్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీరు కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. ఇతరులు ఏమి తింటున్నారోనని శిశువు ఆసక్తి చూపిస్తారు. ఎలాంటి మద్ధతు లేకుండా కూర్చోగలిగినప్పుడు, తమంతట తామే ఆహారాన్ని తమ నోటిలో పెట్టుకోవడానికి ప్రయత్నించడం వంటివి పిల్లల నుంచి వచ్చే సంకేతాలు. ఫుడ్ ఎక్కువైతే.. దానిని తిరస్కరించడం.. దూరంగా తిరగడం వంటివి శిశువు ఇచ్చే సంకేతాలు. ఇవన్నీ పిల్లలకు ఫుడ్ పెట్టడానికి సరైన సమయం అని చెప్తోంది.
ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే..
సూప్‌లు, అరటిపండు, ఆపిల్ గుజ్జు, ఉడికించిన ఆహారం, ఫ్రూట్స్, తల్లిపాలతో కూడిన ఓట్మీల్, సెమీ లిక్విడ్ వంటి ఫుడ్స్ పిల్లలకు ఇస్తే మంచిది. వయసు పెరిగే కొద్ది పిల్లలకు కొత్త కొత్త ఫుడ్స్ అలవాటు చేయవచ్చు. కానీ మొదట్లో ఏ ఫుడ్ ప్రారంభించాలనుకున్నా కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సిందే.
Also Read : ఈ ఫుడ్స్ క్యాన్సర్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తాయట.. నిపుణుల సలహా ఇదే