Diwali shopping : దీపావళి షాపింగ్‌ను ఇలా ఈజీగా చేసేయండి.. ఇలా షార్ట్ లిస్ట్ చేసుకుంటే సరి
Diwali 2024 : దీపావళి 2024 సమయంలో ఇంటిని కలర్ఫుల్గా రెడీ చేసుకునేందుకు.. పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు కచ్చితంగా షాపింగ్ చేయాలి. అయితే లిస్ట్ ఫాలో అయిపోండి.
Shopping for Diwali : పండుగ సమయంలో షాపింగ్స్ అనేవి చాలా కామన్. ఇంటికి సంబందించి.. పర్సనల్ డెకరేషన్, సెలబ్రేషన్‌కి సంబంధించిన షాపింగ్ చేస్తారు. అయితే దీపావళి(Diwali 2024) సమయంలో ఇది కాస్త కష్టంతో కూడుకున్న పని అవుతుంది ఎందుకంటే.. క్రాకర్స్ వంటివి కూడా లిస్ట్‌లో యాడ్ అవుతాయి కాబట్టి. అయితే ఈ దివాళీకి పెద్దగా కష్టపడకుండా ఈజీగా షాపింగ్ ఎలా చేయాలో.. బయటకువెళ్తే ఏ వస్తువులు కచ్చితంగా, మరచిపోకుండా తెచ్చుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ఇంటి డెకరేషన్ కోసం..
కలర్ఫుల్గా దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడంలో డెకరేషన్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటిలో కచ్చితంగా లైట్స్ ఉంటాయి. మీరు ఇంటికి తగ్గట్లు మట్టి దీపాలు, స్ట్రింగ్ లైట్స్, ఫైరీ లైట్స్, ఎల్ఈడీ లైట్స్ తీసుకోవచ్చు. వీటితో ఇంటిని డెకరేట్ చేసుకుంటే దీపావళి శోభ ఇట్టే వచ్చేస్తుంది. ముగ్గులు కూడా పండుగ శోభను పెంచుతాయి కాబట్టి ముగ్గులకు తగ్గట్లు రంగులను కొనుక్కోవాలి. పువ్వులతో కూడా ముగ్గులను అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. కాబట్టి బయటకు వెళ్లేప్పుడు వీటిని మీ లిస్ట్‌లో చేర్చుకోండి.
ఆకాశంలో ఎగురవేసే లాంతర్లు, ట్రెడీషనల్ లాంతర్లు కొనుక్కోవచ్చు. ఇవేకాకుండా డోర్ హ్యాంగింగ్స్ కట్టుకోవచ్చు. పువ్వులతో లేదా పేపర్ హ్యాంగింగ్స్ వేలాడదీయవచ్చు. లేదంటే మామిడాకుల తోరణాలు కూడా గుమ్మాలకు మంచి లుక్ ఇస్తాయి. వీటికి లైట్స్‌ని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు.
దీపావళి క్రాకర్స్
పిల్లల నుంచి పెద్దలవరకు దీపావళి వచ్చిందంటే టపాసుల గురించి ఎదురు చూస్తారు. అయితే వీటికోసం వెళ్లేప్పుడు కాస్త బడ్జెట్‌ని మైండ్‌లో పెట్టుకుని మెయిన్వి తీసుకోవాలి. స్పార్కిల్స్, భూ చక్రాలు, కాకరపువ్వొత్తులు, క్రాకర్ బాంబ్స్, మతాబులు వంటివి తీసుకోవచ్చు. లేదంటే మీ బడ్జెట్‌కి తగ్గట్లు క్రాకర్స్‌ని కొనుక్కోవచ్చు.
స్వీట్స్..
దీపావళి సమయంలో స్వీట్స్ ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంట్లో చేయకపోతే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇచ్చేందుకు స్వీట్స్ కొని తెచ్చుకోవచ్చు. లడ్డూ, బర్ఫీ వంటి ట్రెడీషనల్ స్వీట్స్ తీసుకోవచ్చు. సేవ్, మిక్చర్ వంటి హాట్ స్నాక్స్ తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే ట్రెడీషనల్ స్వీట్స్ తయారు చేసి.. వాటిని బంధుమిత్రులకు పంచి పెట్టుకోవచ్చు. అలాగే వారికి డ్రై ఫ్రూట్స్ వంటివాటిని గిఫ్ట్‌గా ఇచ్చుకోవచ్చు.
పూజకోసం..
పూజకోసం మట్టి దీపాలు, అగరబత్తులు, కర్పూరం, కుంకుమ, పసుపు, గంధం వంటి వాటిని తీసుకోవచ్చు. పువ్వులు, ఒత్తులు తీసుకోవాలి. ఇవి ప్రతిపూజకు కచ్చితంగా అవసరమవుతాయి.
దుస్తులు
నచ్చిన దుస్తులు, మీ రంగుకు నప్పే దుస్తులను రెడీమేడ్‌గా లేదంటే కొనుక్కుని వాటిని కుట్టించుకోవచ్చు. అలాగే మీ డ్రెస్, లుక్‌కి తగ్గట్లు జ్యూవెలరీ సెట్ చేసుకోవచ్చు. గాజులు, ఇయర్ రింగ్స్, నెక్ పీస్‌లు తీసుకుంటే పండుగ సమయానికి అంతా సిద్ధంగా ఉంటుంది.
ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌ని, డెకరేషన్స్ని దీపావళి కోసం ఉపయోగించుకోవచ్చు. ముందుగానే ఈ లిస్ట్ రెడీ చేసుకుని కొనుక్కుంటే ఎలాంటి రష్, ఇబ్బంది లేకుండా వాటిని దీపావళికోసం సిద్ధం చేసుకోవచ్చు. DIY డెకరేషన్స్, క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే దీపావళి కోసం వాటిని కూడా సిద్ధం చేసుకోవచ్చు.
Also Read : ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే