Diwali 2024 Date : ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
Deepavali 2024 : తెలుగు రాష్ట్రాల్లో దీపావళిని ఎప్పుడు చేసుకోవాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఇంతకీ 2024లో దీపావళి తేది ఎప్పుడు? పండితుల ఏమి చెప్తున్నారంటే..
Deepawali 2024 Date : పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే పండుగలలో దీపావళి ఒకటి. దసరా పండుగ(Dusshera 2024) తర్వాత వచ్చే ఈ దీపాల పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా నిర్విహించుకుంటారు. అజ్ఞానంపై జ్ఞానం.. చీకటిపై వెలుగు గెలిచిందనే గుర్తుగా ఈ పండుగను చేసుకుంటారు. అయితే ఈసారి 2024లో దీపావళి(Diwali 2024) ఏరోజు వచ్చింది? దాని ప్రాముఖ్యత ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి ఎప్పుడంటే..(Deepavali 2024 Date)
ప్రతి సంవత్సరం దీపావళిని కార్తీక మాసంలోని అమావాస్య రోజు జరుపుకుంటారు. అయితే 2024లో దీపావళి ఏ రోజు అనే దానిపై కాస్త గందరగోళం మొదలైంది. ఎందుకంటే దృక్ పంచాంగం ప్రకారం.. అమవాస్య అక్టోబర్ 31, 2024న వచ్చింది. అలాగే నవంబర్ 1వ తేదీన కూడా అమావాస్య ఉంది. దీంతో ఏ రోజు దీపావళి చేసుకోవాలనేదానిపై కాస్త గందరగోళం ఏర్పడింది. అక్టోబర్ 31న చేసుకోవాలని కొందరంటుంటే.. నవంబర్ 1వ తేదీనే పండుగ అని మరికొందరు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో పండితులు దీపావళి వేడుకలకు నవంబర్ 1 అనువైన తేదీగా చెప్తున్నారు. ఆరోజు లక్ష్మీ పూజ చేసుకుని పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చంటున్నారు. కార్తీక మాసంలోని 15వ రోజు కూడా నవంబర్ ఒకటే అంటున్నారు. దీపావళిని దేశవ్యాప్తంగా గెజిటెడ్ హాలిడేగా పాటిస్తారు. అలా చూసుకున్నా నవంబర్ 1వ తేదీనే దీపావళి వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా నవంబర్ 1వ తేదీనే దీపావళిగా తెలుస్తోంది.
చరిత్ర ఇదే..(Diwali History)
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని చేసుకుంటారు. అయితే పురాణాల ప్రకారం దీనిని సెలబ్రేట్ చేసుకునేందుకు వివిధ కారణాలు ఉన్నాయి. సత్యభామ, శ్రీకృష్ణుడు కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించి.. ప్రజలకు రక్షణ కల్పించినందుకు గుర్తుగా దీనిని కొందరు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వనవాసానికి వెళ్లిన రాముడు.. రావణుడిని ఓడించి.. తిరిగి అయోధ్యకు సీతతో, లక్ష్మణుడుతో, హనుమంతుడుతో కలిసి వచ్చినందుకు ఈ దీపావళిని పాటిస్తారని చెప్తారు. ఇదే రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారని కొందరు నమ్ముతారు.
దీపావళి ప్రాముఖ్యత..(Diwali Significance)
హిందువులు ప్రధానంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన నరక చతుర్దశి చేసుకుంటారు. నవంబర్ 1వ తేదీన లక్ష్మీ దేవికి పూజలు చేసి.. దీపావళిని చేసుకుంటారు. ఆరోజు ప్రజలు ఆనందంగా.. దీపాలు వెలిగిస్తూ.. సమయాన్ని బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దీపావళికి కొత్త దుస్తులు వేసుకుని లక్ష్మీ పూజను చేసి.. స్వీట్లు పంచుతూ.. క్రాకర్స్ కాలుస్తారు. గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Diwali Precautions)
దీపావళి సమయంలో చాలామంది క్రాకర్స్ కాలుస్తారు. ఈ సమయంలో వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యం తీవ్రంగా ఉంటుంది. పైగా పొగవల్ల దగ్గు వంటి శ్వాస సమస్యలు తలెత్తుతాయి. పర్యావరణానికి కూడా ఇవి హాని కలిగిస్తాయి. పటాకులు కాల్చే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. అందుకే ఈ నేపథ్యంలోనే పర్యావరణహిత క్రాకర్స్ కాల్చాలంటూ కొందరు ఔత్సాహికులు అవగాహన కలిపిస్తున్నారు. దీపాల పండుక్కి.. దీపాలను వెలిగించి.. ప్రశాంతంగా చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు.
Also Read : టేస్టీ సగ్గుబియ్యం పాయసం.. నిమిషాల్లో చేసుకోగలిగే రెసిపీ ఇదే