Climbing Stairs: రోజూ మెట్లు ఎక్కండి - ఈ 9 ప్రమాదకర క్యాన్సర్లు మీ దరిచేరవు
మెట్లు ఎక్కితే చాలా లాభాలున్నాయని అందరికీ తెలిసిందే. కానీ సౌకర్యవంతంగా ఉండటం కోసం లిఫ్ట్ వాడేస్తారు.
ఒకప్పుడు ఎన్ని అంతస్తులు అయినా సరే మెట్లు ఎక్కేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం సింపుల్ గా లిఫ్ట్ ఎక్కేసి చక్కెస్తున్నారు. అలా చేయడం వల్ల శరీరం అలిసిపోకుండా కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటాయని అనుకుంటారు. కానీ నిజానికి మెట్లు ఎక్కడం వల్ల మీరు తొమ్మిది రకాల క్యాన్సర్ల బారి నుంచి బయట పడొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. మెట్లు ఎక్కడం వల్ల కండరాలు గట్టి పడతాయి. ఫిట్ గా ఉండే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు సగానికి పైగా తగ్గుతుందని అధ్యయనం కనుగొంది.
స్వీడన్ లో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం ఫిట్ గా ఉన్న పురుషుల్లో కణితం తొమ్మిది రకాల కణితుల నుంచి రక్షణ పొందుతారని తేలింది. 16 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువకులని పరిశీలించారు. వారిలో గుండె, ఊపిరితిత్తులు, మెడ, గొంతు, కడుపు, క్లోమం, కాలేయం, పేగు, మూత్రపిండాల్లో కణితులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గోథెన్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఆరోన్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన యువకులలో ఫిట్ నెస్ బాగుణం వారిలో 18 రకాల క్యాన్సర్లలో 10 అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ముడిపడి ఉందని అధ్యయనం సూచిస్తుంది. యువతలో కార్డియోస్పీరేటరీ ఫిట్ నెస్ పెంచేందుకు ఈ అధ్యయనం మరింత బలాన్ని ఇస్తుంది.
అధ్యయనం సాగింది ఇలా..
1968 నుంచి 2005 మధ్య సైనిక నిర్బంధ సమయంలో ఉన్న వారి ఆరోగ్యాన్ని పరిశోధకులు చెక్ చేశారు. దాదాపు 33 సంవత్సరాలు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. వారిలో చాలా మందికి 60 ఏళ్ల లోపు క్యాన్సర్లు వచ్చినట్టు గుర్తించారు. బ్రిటీషర్లు ఏదో ఒక సమయంలో క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఒక సర్వే ప్రకారం సగం మందికి పైగా స్త్రీలు, మూడవ వంతు పురుషులు ఎటువంటి వ్యాయామం చేయడం లేదు. 50 శాతం మంది పిల్లలు ప్రతిరోజూ చురుకుగా ఉంటున్నారు. ఇక ముగ్గురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. పెద్దలు ప్రతివారం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని అక్కడి వైద్య సంస్థలు సూచిస్తున్నాయి. పిల్లలు రోజుకి ఒక గంట పాటు ఆరుబయట ఆడుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ, హార్మోన్ స్థాయిలని సమతుల్యం చేయడం, రక్తపోటు, షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం తక్కువ ఫిట్ నెస్ ఉన్న వ్యక్తులు ఊబకాయం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగానికి ఎక్కువగా బానిసలుగా మారిపోతున్నారు. వేగంగా నడవడం, జాగింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం, ఈత కొట్టడం, మెట్లు ఎక్కడం వంటి వాటి వల్ల కార్డియో ఫిట్ నెస్ ని పెంచుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డయాబెటిస్ బాధితులు వంకాయలు తినొచ్చా? ప్రయోజనాలు ఏమిటీ?