అన్వేషించండి

Brinjal: డయాబెటిస్ బాధితులు వంకాయలు తినొచ్చా? ప్రయోజనాలు ఏమిటీ?

వంకాయ అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వారానికి ఒక్కసారైనా వాటిని తింటారు. మరి, డయాబెటిస్ బాధితులు తినొచ్చా?

చాలా మందికి ఇష్టం లేని కూరగాయ ఏది అంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం ఒక్కటే వంకాయ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని తినాలంటేనే మొహం అదోలా పెట్టేస్తారు. కానీ ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పోషకాలు, ఫైబర్ గొప్ప మూలం. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పోషకాల పవర్ హౌస్ గా పిలుస్తారు. శరీరానికి అవసరమైన విటమిన్ సి ని అందిస్తుంది. రోగనిరోధక శక్తి పనితీరు, చర్మ ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. ఇందులోని విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గాలని అనుకునే వారికి ఇదొక అద్భుతమైన కూరగాయ. తక్కువ కేలరీలు, డైటరీ ఫైబర్ ఉండటం వల్ల కాస్త తిన్నా పొట్ట నిండుగా ఉంచుతుంది. ఇక మధుమేహులకి వరం లాంటిది ఇది. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన కూరగాయ. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండ చేస్తుంది. వంకాయలో నాసునిన్ సహా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి సెల్ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తాయి. ఫైబర్ కంటెంట్ కారణంగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియని ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వల్ల గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటుని తగ్గించి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మధుమేహులు తినొచ్చా?

వంకాయ తక్కువ కేలరీలు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే వంకాయ వంట చేసే పద్ధతి, అందులో ఉపయోగించే పదార్థాలు పరిగణలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. నూనెలో వేయించడం లేదా ఉడికించడం వల్ల కేలరీలు, కొవ్వు పదార్థాలు గణనీయంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర నియంత్రణని ప్రభావితం చేస్తుంది. అందుకే వీటిని గ్రిల్లింగ్ లేదా బేకింగ్ లేదా ఆవిరితో ఉడికించుకుని తినడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులు ఎంచుకోవడం ఉత్తమం.

గర్భిణీలకు సురక్షితమేనా?

వంకాయ తింటే గర్భిణీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. డైటరీ ఫైబర్, విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు అందిస్తుంది. పిండం అభివృద్ధికి ఫోలేట్ చాలా ముఖ్యం. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంచడం కోసం పొటాషియం అవసరం. అయితే వంకాయని పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

వంకాయ తినేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి

⦿ వంకాయ అలర్జీ ఉంటే వాటిని తీసుకోకుండా ఉండటమే మంచిది.

⦿ ఇందులో చక్కెర కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహులు తీసుకోవచ్చు. కానీ దీన్ని సాస్, స్వీటేనర్ తో కలపకూడదు.

⦿ వంకాయ అతిగా తినడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇందులో సోలనిన్ అనే పదార్థం ఉంటుంది. అధిక మొత్తంలో తీసుకుంటే విషపూరితం కావచ్చు.

వంకాయ గురించి అపోహ, వాస్తవాలు

అపోహ: వంకాయ కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుందని అంటారు.

వాస్తవం: ఇందులో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు తక్కువే. కానీ వంట సమయంలో ఎక్కువగా నూనె వేస్తే పీల్చుకుంటుంది. అప్పుడు కొవ్వు పదార్థాన్ని పెంచుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: వైద్య చరిత్రలో మరో అద్భుతం - మనిషికి పంది కిడ్నీ పెట్టిన వైద్యులు, సర్జరీ సక్సెస్!

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget