అన్వేషించండి

Bagara Rice Recipe : తెలంగాణ స్టైల్ బగారా రైస్.. ఈ రెసిపీని ఫాలో అయితే ఫ్లేవర్, రుచికే 100 మార్కులు వేసేస్తారు

Bagara Rice : తెలంగాణ స్టైల్​లో చేసే బగారా రైస్​కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే దీనిని చాలా సింపుల్​గా, ఫ్లేవర్​ ఫుల్​గా ఎలా చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలేమిటో చూసేద్దాం.

Telangana Style Bagara Rice : ఒక్కోప్రాంతానికి ఒక్కో ఫుడ్​ క్రేజ్ ఉంటుంది. అలాగే తెలంగాణలో పలు వంటలకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి వాటిలో బగారా రైస్ ఒకటి. ఫ్లేవర్​ ఫుల్​గా, నోరూరించే విధంగా ఈ బగారా రైస్​ను ఎలా తయారు చేసుకోవాలో? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే రుచి బాగా పెరుగుతుందో.. కావాల్సిన పదార్థాలేమిటో వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


బాస్మతి రైస్ - అరకేజి


షాజీరా - అర టీస్పూన్


స్టార్ పువ్వు -1 


దాల్చిన చెక్క - 1 అంగుళం


మిరియాలు - అర టీస్పూన్ 


ధనియాలు - 1 టీస్పూన్


నువ్వులు - 2 టీస్పూన్లు


జీలకర్ర - అర టీస్పూన్


లవంగాలు - 4


యాలకులు - 2


జీడిపప్పు - 20 


అల్లం - 2 అంగుళాలు


వెల్లుల్లి - 1


టోమాటోలు - 1(పెద్దది)


కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు 


ఉల్లిపాయలు - 2 


పచ్చిమిర్చి - 5


కరివేపాకు - 1 రెబ్బ


పుదీనా - 1 కప్పు


కొత్తిమీర - 1 కప్పు


ఉప్పు - రుచికి తగినంత


నెయ్యి లేదా నూనె - ఫ్రైకి సరిపడేంత


తయారీ విధానం


ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి. షాజీరా, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, టోమాటో ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్​ను కేవలం బగారా రైస్​కే కాదు.. చికెన్ కర్రీకి, చికెన్ బిర్యానీ సమయంలో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పేస్ట్​ను పక్కన పెట్టుకుని.. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను సిద్ధం చేసుకోవాలి. 


స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకోవాలి. దానిలో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. దానిలో మరో 10 జీడిపప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్​గా మారేవరకు వేయించుకోవాలి. అనంతరం పుదీనా వేసి కలిపి.. ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్​ను వేసుకోవాలి. మసాలా బాగా ఉడికి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి.


బిర్యానీ మసాలా బాగా ఉడికిన తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అనంతరం నానబెట్టుకున్న బియ్యాన్ని దానిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. గ్లాస్ బియ్యానికి.. గ్లాసున్నర నీటిని వేసుకోవాలి. నీరు వేసిన తర్వాత దానిని బాగా కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని.. నిమ్మరసాన్ని పిండుకోవాలి. దీనిని సన్నని మంటపై 20 నుంచి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. అనంతరం పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ బగారా అన్నం రెడీ. 



ఫంక్షన్లు, పండుగల సమయంలోనే కాకుండా.. వింటర్​లో టేస్టీగా తినాలనుకున్నప్పుడు, లంచ్​గా తీసుకువెళ్లాలనుకున్నప్పుడు దీనిని కుక్ చేసుకోవచ్చు. పైగా దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. దీనిలోకి రైతా చాలా మంచి కాంబినేషన్ అవుతుంది. ఏ కర్రీ అయినా దీనికి బాగా సెట్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ డిష్​ని ట్రై చేసి ఇంట్లోవారికి తినిపించేయండి. 


Also Read : చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget