అన్వేషించండి

Garlic Rice Recipe : టేస్టీ, హెల్తీ గార్లిక్ రైస్.. లంచ్ బాక్స్​కోసం ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి

Garlic Rice Recipe : టిఫెన్, లంచ్ బాక్స్​ల కోసం మీరు టేస్టీ ఫుడ్ చేసుకోవాలనుకుంటే గార్లిక్ రైస్ చేసుకోవచ్చు. దీనిని చేయడం చాలా తేలిక. ఇది మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 

Tasty Lunch Recipes : హెల్తీ ఫుడ్ తీసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ బిజీ లైఫ్​లో పడి హెల్త్​ని కాస్త పక్కన పెట్టేస్తున్నారు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే.. సింపుల్​గా చేసుకోగలిగే.. గార్లిక్​ రైస్​ను ట్రై చేయవచ్చు. ఇది మీకు మంచి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలోని ఎన్నో సుగుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పైగా వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవడం ఇష్టం లేని ఇలా తీసుకుంటే.. మంచి రుచిని పొందవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

వెల్లుల్లి - పావు కప్పు 

నూనె - మూడు టేబుల్ స్పూన్లు

క్యారెట్  - పావు కప్పు

బీన్స్ - 4 టేబుల్ స్పూన్లు

బియ్యం - 1 కప్పు

మిరియాల పొడి - పావు టీస్పూన్

వైట్ పెప్పర్ పొడి - పావు టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

వెనిగర్ - 1 టీస్పూన్

ఒరిగానో - అర టీస్పూన్

సోయా సాస్ - 1టీస్పూన్

స్ప్రింగ్ ఆనియన్స్ - 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా బాస్మతి రైస్​ను బాగా కడిగి.. దానిలో కాస్త ఉప్పు వేసి.. వండుకోవాలి. రైస్ మెత్తగా కాకుండా పొడిపొడిలాడేలా ఉంటే మంచిది. వెల్లుల్లిపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్​ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఓ చిన్న కడాయిలో నూనె వేసి.. వెల్లుల్లి ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్​లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే రుచి మంచిగా ఉంటుంది. మరీ ఎక్కువగా వేగితే రుచి మారిపోతుంది. చేదుగా అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

వెల్లుల్లి గోల్డెన్​ రంగులోకి మారిన తర్వాత.. వాటిని పక్కకు తీసేయాలి. ఇప్పుడు మందపాటి కడాయి తీసుకోండి. దానిలోకి వెల్లుల్లి వేయించిన నూనె, మరికాస్త నూనె వేయాలి. దానిలో క్యారెట్ ముక్కలు వేసి ఓ నిమిషం వేయించాలి. అనంతర బీన్స్ వేసి మరో నిమిషం వేయించాలి. మరీ ఎక్కువగా వేయిస్తే వాటిలోని క్రంచీనెస్ పోతుంది. రుచిగా ఉండాలంటే వాటిని ఎక్కువసేపు వేయించకపోవడమే మంచిది. ఇప్పుడు దానిలో వేయించుకున్న వెల్లుల్లి వేసుకోండి. ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని దీనిలో వేసి బాగా కలపాలి.

అన్నంలో ముందుగానే ఉప్పు వేసి ఉడికిస్తాము కాబట్టి ఉప్పు వేసుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎక్కువయ్యే ప్రమాదముంది. ఇప్పుడు దీనిలో మిరియాలపొడి, వైట్ పెప్పర్ పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వెనిగర్, సోయా సాస్ వేసి మంటను ఎక్కువ చేసి.. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో స్ప్రింగ్ ఆనియన్స్  వేసి.. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కలిపి.. స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ, హెల్తీ గార్లిక్ రైస్ రెడీ. ఇది పెద్దల నుంచి పిల్లలకు ఎంతో నచ్చుతుంది. పైగా మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. 

Also Read : సండే స్పెషల్ టేస్టీ హల్వా.. కరాచీ స్టైల్​లో రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Maruti Suzuki E-Vitara: మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Maruti Suzuki E-Vitara: మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పరిచయం చేసిన మారుతి - లుక్, ఫీచర్లు అదుర్స్!
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Sony PS5 Pro: గేమర్స్‌కు గుడ్ న్యూస్ - మోస్ట్ అవైటెడ్ పీఎస్ 5 ప్రో వచ్చేసింది - రేటు చూస్తే షాకే!
గేమర్స్‌కు గుడ్ న్యూస్ - మోస్ట్ అవైటెడ్ పీఎస్ 5 ప్రో వచ్చేసింది - రేటు చూస్తే షాకే!
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
Embed widget