News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ragi Recipes: రాగి పిండితో భలే భలే వంటకాలు - రుచి అమోఘం, తింటే ఆరోగ్యం

రాగి ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. అందుకే, చాలామంది నిత్యం రాగి జావ తాగుతుంటారు.

FOLLOW US: 
Share:

పూర్వం మన పెద్దలు రాగి సంకటి, రాగి జావ చేసుకుని తినేవాళ్ళు. అందుకే వాళ్ళు అంతా బలంగా రోగాల బారిన పడకుండా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు కంటికి ఏది నచ్చితే దాన్ని తినేసి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి రాగి సంకటి అంటే ఎంటో కూడా తెలియదు. కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు కొవ్వు స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది. అందుకే రాగులు మధుమేహ బాధితులకి చాలా మంచిది. ఇదే కాకుండా బరువు తగ్గేందుకు రాగి సహకరిస్తుంది.

రాగిలో పీచు పదార్థం ఎక్కువ. గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఇది అద్భుతమైన ఆహారం. రాగులు ఊబకాయాన్ని నివారించడంతో పాటు జీర్ణక్రియని మెరుగుపరుస్థాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగేలాగా చేస్తుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు క్రమం తప్పకుండా రాగులతో చేసిన పదార్థాలను తమ డైట్లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కొవ్వు తక్కువ ఉండటం వల్ల గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చు. రాగులతో జావ, రాగి దోశ మాత్రమే కాదండోయ్ ఇంక అనేక రుచికరమైన పదార్థాలను తయారు చేసుకోవచ్చు. అవేంటో మీరు ఒకసారి చూసేయండి.

రాగి బర్ఫీ

పాన్ స్టౌ మీద పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా రాగి పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. సన్నని మంట మీడా ఒక 3-5 నిమిషాల పాటు ఇడికించుకోవాలి. తర్వాత అందులో ¾ కప్పు బెల్లం పొడి వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత 1/3 కప్పు బదమ పొడి, ½ కప్పు పాలు, ¼ తెవుల స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా దగ్గరపడేదాక ఉడికించుకోవాలి. దాన్ని నెయ్యి రాసిన ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత బర్ఫీ ముక్కలు మాదిరిగా కట్ చేసుకోవడమే.

రాగి లడ్డు

పాన్ లో ½ కప్పు నెయ్యి వేసుకుని అందులో 1 ½ కప్పు రాగి పిండి వేసుకోవాలి. పిండి పచ్చి వాసన పోయేంత వరకు సుమారు 5-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత ¾ కప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి ½ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. మిశ్రమం వేడిగా ఉన్న సమయంలోనే చేతితో లడ్డూల మాదిరిగా ఉండలు చేసి గాలి చొరబడని సీసాలో వేసి భధ్రపరుచుకోవాలి.

రాగి కేక్

ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు కోకో పౌడర్, ¾ కప్పు చక్కెర, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లో 2 కప్పుల పాలు, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, ¾ కప్పు కరిగించిన వెన్న వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కేక్ గిన్నెలో ఆ మిశ్రమాన్ని పోసి మైక్రో ఓవెన్ లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద కనీసం 35 నిమిషాల పాటు ఉంచుకోవాలి. కుక్ అయిన తర్వాత దాని మీద వేయించిన జీడిపప్పు, బదమ వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి కేక్ రెడీ.

రాగి కుకీస్

50 గ్రాముల రాగి పిండి, 50 గ్రాముల గోధుమ పిండి తీసుకుని దాన్ని 5-7 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. దాన్ని మిక్సింగ్ గిన్నెలోకి మార్చుకోవాలి. మరో గిన్నెలో 60 గ్రాముల బెల్లం పొడి, 80 గ్రాముల వెన్న వేసుకోవాలి. దాంట్లో వేయించి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని, ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఓవెన్ ను 160 డిగ్రీల వద్ద పెట్టి బేకింగ్ ట్రే లో రాగి పిండి ముద్దలను కుకీల షేప్ లో వేసుకుని పెట్టేయాలి. కుకీలను 15 నిమిషాల పాటు కాల్చుకోవాలి. వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు.

రాగి పాన్ కేక్

పిల్లలు ఎంతో ఇష్టంగా పాన్ కేక్ లు తింటారు. రాగి జావ తాగని పిల్లల కోసం తల్లులు ఇవి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎంతో ఆబగా వీటిని తినేస్తారు. ½ కప్పు రాగి పిండి ½ కప్పు గోధుమ పిండి, ¼ టీ స్పూన్ ఉప్పు, ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ¼ కప్పు బెల్లం పొడిని తీసుకుని బాగా ఫోం వచ్చేదాకా కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి బాగా వేడి చేసిన తర్వాత దాని మీద నూనె లేదా నెయ్యి రాయాలి. ఒక గంటె పిండిని తీసుకుని పాన్ మీద వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి రాగి పాన్ కేక్ రెడీ. ఇవే కాదు రాగి ఇడ్లీ, రాగి దోశ కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రాగి పిండితో ఈ వంటకాలు చేసి రుచి చూసేయండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ఏడాదికి రూ.61 లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగం, అయిదేళ్ల వయసు దాటిన ఎవరైనా అప్లయ్ చేయచ్చు

Also read: ఆవు పాలకన్నా గేదెపాలలోనే పోషకాలు ఎక్కువ, వాటిని తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

 

Published at : 03 Aug 2022 04:14 PM (IST) Tags: Ragi Recipes Ragi Burfi Ragi Pancake Ragi Laddu Ragi Cookies Ragi powder Benefits Ragi Powder Recipes

ఇవి కూడా చూడండి

Vegetable Peels: కూరగాయల తొక్కలు పడేస్తున్నారా? వాటితో చేసే ఈ రుచికరమైన వంటలు మిస్ చేసుకున్నట్టే!

Vegetable Peels: కూరగాయల తొక్కలు పడేస్తున్నారా? వాటితో చేసే ఈ రుచికరమైన వంటలు మిస్ చేసుకున్నట్టే!

Pakodi: వేడి నీటితో క్రిస్పీగా ఉండే పకోడీ ఇలా చేసేయండి!

Pakodi: వేడి నీటితో క్రిస్పీగా ఉండే పకోడీ ఇలా చేసేయండి!

Banana Curry: అరటికాయతో ఇలా కోఫ్తా కర్రీ చేస్తే అదిరిపోతుంది

Banana Curry: అరటికాయతో ఇలా కోఫ్తా కర్రీ చేస్తే అదిరిపోతుంది

Tasty Recipes: వంట చేసుకోవడానికి బద్ధకిస్తున్నారా? ఈ సింపుల్ టేస్టీ రెసిపీలు మీకోసమే

Tasty Recipes: వంట చేసుకోవడానికి బద్ధకిస్తున్నారా? ఈ సింపుల్ టేస్టీ రెసిపీలు మీకోసమే

Samosa: ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే అదిరిపోయే టేస్టీ సమోసా తయారు చేసేసుకోవచ్చు

Samosa: ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే అదిరిపోయే టేస్టీ సమోసా తయారు చేసేసుకోవచ్చు

టాప్ స్టోరీస్

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌