బియ్యంప్పిండి, పచ్చిబఠాణీతో టేస్టీ రొట్టె - రుచి అదిరిపోతుంది
బియ్యంప్పిండి - పచ్చిబఠాణీలతో వండే టేస్టీ రొట్టె రెసిపీ తెలుసుకోండి.
తెలంగాణా ఫేమస్ వంటకం సర్వ పిండి. దీన్నే తపాలా చెక్క అని కూడా పిలుస్తారు. దీన్ని కాస్త డిఫరెంట్‌గా పచ్చిబఠాణీలతో చేస్తే రుచి అదిరిపోతుంది. ఎప్పుడూ ఒకేలా చేసుకుంటే బోరు కొట్టేయదు. అందుకే ఈసారి డిఫరెంట్ బియ్యంప్పిండికి, పచ్చి బఠాణీని జత చేర్చండి.
కావాల్సిన పదార్థాలు
బియ్యప్పిండి - ఒక కప్పు
పచ్చి బఠాణీ - ఒక కప్పు
పచ్చి మిర్చి - రెండు
జీలకర్ర - టీ స్పూను
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకులు - ఒక రెమ్మ
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక టీస్పూను
తయారీ ఇలా
1. పచ్చి బఠాణీలను ఉడికించి నీళ్లు వడకట్టాలి.
2. చేత్తో వాటిని మెత్తగా మెదుపుకోవాలి. కష్టమనుకుంటే మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాచాలు.
3. ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
4. అందులో బియ్యప్పిండి బాగా కలపాలి.
5. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి.
6. గారెలా పిండి ఎంత గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి.
7. ఒక పాలిథిన్ లేదా అరిటాకు కాస్త నూనె రాసి బూరె సైజులో చిన్న ముద్ద తీసుకోవాలి.
8. అరిటాకు లేదా పాలిధిన్ కవర్ పై పెట్టి చేత్తో ఒత్తుకోవాలి.
9. మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి.
10. పెనం పై కాస్త నూనె రాసి ఒత్తు కున్న రోటీని పెనంపై వేయాలి.
11. చిన్న మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. దీని రుచి చాలా బాగుంటుంది.
గింజధాన్యాలైన పచ్చి బఠానీలు సీజనల్‌గా లభిస్తాయి. వాటిని సీజన్ ప్రకారం కచ్చితంగా తినాలి. ఎండు బఠానీల కన్నా పచ్చి బఠానీలు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇవి మంచి వింటర్ డైట్ అని చెప్పాలి. వీటిలో ఫ్లేవనాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.ఇవి తినడం వల్ల గుండెకు ఎంతో మంచిది. గుండె వ్యాధులు, గుండె పోటు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. దీనిలో ఫైబర్ కంటెట్ కూడ అధికంగా ఉంటుంది. వీటిని తినడం జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం తగ్గుతుంది. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఆహారం. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ఇవి తగ్గిస్తాయి. ఎముకలకు ఇవి బలాన్నిస్తాయి.
View this post on Instagram
Also read: రోజూ వేడి నీటి స్నానం చేసే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా? వైద్యులు చెబుతున్నదిదే