(Source: Poll of Polls)
Hot Water: రోజూ వేడి నీటి స్నానం చేసే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా? వైద్యులు చెబుతున్నదిదే
మగవారికి కాస్త షాకిచ్చే వార్తే ఇదే. వేడి నీళ్లు కూడా వారికి శాపంగా మారే అవకాశం ఉందట.
ఆధునిక జీవనంలో ఎంతో ఒత్తిడి. ఆ ఒత్తిళ్ల మధ్య మానసికంగా, శారీరకంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు దాడి చేస్తున్నాయి. ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు చేసే వేడి నీటి స్నానం కూడా మగవారికి కీడు చేస్తుందట. వేడినీళ్ల ఉష్ణోగ్రత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ వేడినీళ్లు స్పెర్మ్ నాణ్యతపై ప్రతికూల ప్రభావాలను ప్రేరేపిస్తుందని వివరిస్తున్నారు.వేడి వాతావరణంలో నివసించే లేదా పని చేసే మగవారు తమ పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత కంటే వృషణాల ఉష్ణోగ్రత రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అలా తక్కువగానే ఉండాలి కూడా. అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో ఉండడం, అనారోగ్యకరమైన జీవనశైలి వృషణాలలోని స్మెర్మ్‌ను దెబ్బతీస్తుంది. తరుచూ వేడి నీటి స్నానం చేయడం వల్ల స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. కాబట్టి ఆ భాగంలో ఎక్కువ ఉష్ణోగ్రత తగలకుండా చూసుకోవాలి. మందపాటి దుస్తులు కూడా ఉష్ణోగ్రతను పెంచుతాయి, జంక్ ఫుడ్, వాతావరణ మార్పులు కూడా శరీర ఉష్ణోగ్రతను పెరిగేలా చేసి స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. వెల్డింగ్ పని, బాణా సంచా, సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేవారిలో తీవ్ర ఉష్ణోగ్రతలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి వృషణాల భాగంలో అధిక తగలకుండా చూసుకోవాలి.
ఎంతో మంది...
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 8 నుంచి 12 శాతం వంధ్యత్వం అంటే పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రపంచంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవారు స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్ సరిగా లేకపోవడం వల్ల పిల్లలను కనలేకపోతున్నారు.
ఒక నివేదిక ప్రకారం భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి. వీరిలో వీర్యకణాల సంఖ్య పడిపోవడం వల్ల వారు పిల్లల్ని పుట్టించలేకపోతున్నారు. అలాగే వీర్యకణాల్లో చురుకుదనం కూడా తగ్గి అవి వేగంగా కదలలేకపోతున్నాయని కూడా నివేదిక చెబుతోంది. వందేళ్ల కిందట భారత్‌లో మగవారిలో వీర్యకణాల సంఖ్య సగటున 60 మిలియన్/ మిల్లీ లీటర్లు ఉండగా, అది ఇప్పుడు ఒక మిల్లీ లీటరుకు 20 మిలియన్లకు పడిపోయింది.
Also read: బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ నిజంగా అదుపులో ఉంటుందా? ఎలా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.